రాష్ట్రీయం

ఏపీ ఇసుక పాలసీ దేశానికే మార్గదర్శకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇసుక, మైనింగ్ విధానం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఇసుక పాలసీ అమలుపై బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంఓ) కార్యదర్శి ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఓ వైపు పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలు తీసుకుంటూనే అవినీతికి తావులేని, పారదర్శకమైన, అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసే విధంగా ఇసుక పాలసీ అమలు చేస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ ‘ ఎ డర్టీ ఫిష్ స్పాయిల్స్ ద హోల్ పాండ్’ (ఓ చెడ్డ చేప చెరువు మొత్తాన్ని చెడగొడుతుంది) అనే తరహాలో ఇసుక అక్రమాలకు సంబంధించి ఒక్క కేసు నమోదైనా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని స్పష్టం చేశారు. అలా జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. అవినీతి రహిత, పారదర్శకమైన ఇసుక పాలసీని అమలు చేయాలని, ఎక్కడా అక్రమాలు జరక్కుండా పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇందుకోసం కలెక్టర్లంతా అన్ని వైపుల నుంచి సమగ్రమైన సమాచారాన్ని సేకరించి అందుకు అనుగుణంగా స్పందించాలని సూచించారు. వచ్చే స్పందన కార్యక్రమం నాటికి దీనిపై పక్కా సమాచారంతో సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు.

*చిత్రం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి