రాష్ట్రీయం

కండలేరు నుంచి చెన్నైకి నీళ్లు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: శ్రీశైలం, కండలేరు నుంచి చెన్నై నగరానికి మంచినీటి కోసం నీరు విడుదల చేయాలని తమిళనాడు నీటిపారుదలశాఖ అధికారులు కృష్ణానదీ యాజమాన్య బోర్డును కోరారు. జలసౌధలో బుధవారం కృష్ణానదీ యాజమాన్య బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మూడు రాష్ట్రాల నుంచి ఇంజనీర్లు హాజరయ్యారు.
తమకు ఇప్పటి వరకు 5.2 టీఎంసీల నీరు మాత్రమే అందిందని, చెన్నైలో ప్రస్తుతం ఉన్న మంచినీటి కొరత తీర్చడానికి శ్రీశైలం, కండలేరులో సమృద్ధిగా నీరు ఉండటంతో విడుదల చేయాలని తమిళనాడు ఇంజనీర్లు బోర్డును కోరారు. తమ రాష్ట్రాల అవసరాలు తీరిన తర్వాతనే నీరు ఇవ్వడం సాధ్యం అవుతుందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు సూచించారు. అయితే తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నీరు విడుదల చేయాలని తమిళనాడు అధికారులు కోరారు. ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత చెన్నైకి నీరు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్టు కృష్ణాబోర్డు స్పష్టం చేసినట్టు అధికార వర్గాల సమాచారం.