రాష్ట్రీయం

ఆకివీడు - భీమవరం టౌన్ మధ్య రైల్వే డబ్లింగ్ మార్గం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 4: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు - భీమవరం టౌన్ స్టేషన్ల మధ్య 16కి.మీ డబ్లింగ్ రైలు మార్గం రైళ్ల రాకపోకలకు రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆమోదం పొందింది. ఈ డబ్లింగ్ మార్గంలో మొదట రైలు నెం 17482 తిరుపతి - బిలాస్‌పూర్ విజయవంతంగా నడిపారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, విజయవాడ మధ్య రైల్వే అనుసంధానాన్ని విస్తరించడానికి దక్షిణ మధ్య రైల్వే విజయవాడ - గుడివాడ - భీమవరం - నర్సాపూర్, గుడివాడ - మచిలీపట్నం, భీమవరం - నిడదవోలు స్టేషన్ల మధ్య 221 కి.మీ రైలు మార్గం డబ్లింగ్, విద్యుద్దీకరణ చేయడానికి సంకల్పించింది. ఈ మొత్తం ప్రాజెక్టు 2011-12లో రూ. 1428.70 కోట్ల అంచనా వ్యయంతో మంజూరయింది. ఈ ప్రాజెక్టు ఖర్చులో 50 శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి ఒప్పందం జరిగి, నిర్మాణ బాధ్యత రైల్ వికాస్ నిగం లిమిటెడ్‌కి అప్పగించారు. కోస్తాంధ్ర ప్రాంతాన్ని అనుసంధానించే ముఖ్యమైన రైలుమార్గంగా భావించి పనులను త్వరితగతిన చేపట్టి మొత్తం పనిని 5 దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. 1వ దశలో విజయవాడ - మోటూరు, 2వ దశలో మోటూరు - భీమవరం టౌన్, 3వ దశలో భీమవరం టౌన్ - నిడదవోలు, 4వ దశలో గుడివాడ - మచిలీపట్నం, 5వ దశలో భీమవరం - నర్సాపూర్ పనులను ఒకే సమయంలో ప్రారంభించారు. 2వ దశలో మోటూరు - ఆకివీడు మధ్య 40 కి.మీ నిడివిలో చేపట్టిన డబ్లింగ్ పనులను గతంలోనే పూర్తి చేశారు. ప్రస్తుతం 2వ దశలో భాగమైన ఆకివీడు - భీమవరం టౌన్ మధ్య చేపట్టిన డబ్లింగ్ పనులను పూర్తి చేసి రైలు సర్వీసులను నడిపారు. ఈ మార్గంలో విద్యుదీకరణ పనులు వేగంగా పురోగతిలో ఉన్నాయి. 2వ దశలో చేపట్టిన డబ్లింగ్ పనులు పూర్తి చేయడంతో కృషి చేసిన దక్షిణ మధ్య రైల్వే, ఆర్‌వీఎన్‌ఎల్ అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభినందించారు.