రాష్ట్రీయం

సినీరంగ సమస్యలు, డిమాండ్లపై చిరంజీవి, నాగార్జునతో మంత్రి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం సినీరంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జునతో సమావేశమయ్యారు. ఈ చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ సమావేశంలో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్టు మంత్రి తలసాని తెలిపారు. ఆన్‌లైన్ టికెటింగ్ విధానం అమలు, శంషాబాద్‌లో సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ ఇన్సిస్టిట్యూట్‌కు స్థలం కేటాయించాలని వారు కోరినట్టు మంత్రి తెలిపారు. సినీ పరిశ్రమలో 24 విభాగాలకు చెందిన కార్మికులు, సాంకేతిక నైపుణ్యాన్ని పెంచడానికి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కోరారని తెలిపారు. సినిమా టికెట్ల రెట్ల సరళీకృత విధానాన్ని అమలు చేయాలని సూచించినట్టు చెప్పారు. చిత్రపురి కాలనీ పక్కన సినీ కార్మికులకు ఇళ్లు నిర్మించడానికి 10 ఎకరాల స్థలం కేటాయించాలని కోరినట్టు వివరించారు. సినీ కార్మికులు, కళాకారుల కోసం సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు కోసం జూబ్లీహిల్స్‌లో మరో 2 ఎకరాలు కేటాయించాలని చిరంజీవి, నాగార్జున కోరినట్టు చెప్పారు. అదే విధంగా సినీ, టీవీ కళాకారులకు ఫిలిం డవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డులు జారీ చేయాలని, సినీ అవార్డుల ప్రదానం, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను సినీ కార్మికులకు వర్తింప చేయాలని, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, గ్రూప్ ఇన్స్‌రెన్స్ అమలు చేయాలని ప్రతిపాదించినట్టు మంత్రి తలసాని పేర్కొన్నారు. సినిమా షూటింగ్‌లకు ముందే ఫిలిం డవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో రిజిస్టర్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారని తెలిపారు. చిత్రపురి కాలనీలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థలంలో హాస్పిటల్, స్కూల్ నిర్మించడానికి దాతలు ముందుకు వస్తే వారి పేర్లపైనే నిర్మించనున్నట్టు మంత్రి తెలిపారు. చిత్రపురి కాలనీలో మంచినీరు, రోడ్లు, బస్సు సౌకర్యం తదితర సమస్యలను పరిష్కరించినట్టు చెప్పారు. ఇప్పటికే అనేక పర్యాయాలు సినీ ప్రముఖులు, చిత్రపురి కాలనీ బాధ్యులతో సమావేశమై పలు సమస్యలను తెలుసుకున్నట్టు మంత్రి చెప్పారు. ఈ నెల 2వ వారంలో సినీరంగ ప్రముఖులు, సంబంధిత అధికారులతో సమావేశమై సమస్యలపై మరింత వివరంగా చర్చించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి తలసానితో పాటు ఫిలిం డవలప్‌మెంట్ మాజీ చైర్మన్ రామ్మోహన్‌రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్‌బాబు, నిర్మాత నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.