రాష్ట్రీయం

ఏపీఎస్‌ఈబీ మాజీ చైర్మన్ బలరామి రెడ్డి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ప్రముఖ విద్యుత్‌రంగ నిపుణులు, ఉమ్మడి రాష్ట్రం లో ఏపీఎస్‌ఈబీ మాజీ చైర్మన్ కే బలరామరెడ్డి (91) మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్‌రంగ అభివృద్ధికి కృషి చేశారు. వి ద్యుత్‌రంగ సంస్కరణలు, అమల్లో క్రియాశీల పాత్ర పోషించారు. 1953లో ఏపీఎస్‌ఈబీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించి అంచలంచలుగా ఎదిగి 1995లో ఏపీఎస్‌ఈబీ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. మొత్తం 42 సంవత్సరాల ఆయ న సుదీర్ఘ ప్రస్థానంలో 7 ఏళ్లు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రంలో ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ అభివృద్ధి, సిస్టం ఆపరేషన్, మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్‌లో తనదైన ముద్ర వేశారు. ప్రైవేట్ విద్యు త్ ప్రాజెక్ట్‌ల కోసం ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ (ఐపీపీ)తో చర్చలు జరిపా రు. విద్యుత్ టారిఫ్, పునర్నిర్మాణం, ప్రైవేటీకరణపై మార్గదర్శకాలు రూపొందించేందు కు ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీలో ఓ సభ్యునిగా అనేక ప్ర తిపాదనలు చేశారు. ఈ హెచ్‌టీ (ఎక్స్‌ట్రా హైటెన్ష న్) వ్యవస్థను అభివృద్ధి చేసినందుకుగాను 1988లో ఆయనకు విశే్వశ్వరయ్య అవార్డు దేశంలో పవర్ సిస్టం మేనేజ్‌మెంట్ హెచ్‌డీవీసీ విద్యుత్ వ్యవస్థ అభివృద్ధికి చేసిన కృషికి ప్రతిఫలంగా 1991లో సీబీఐ అండ్ పీ డైమండ్ జూబ్లీ అవార్డును అందుకున్నా రు. వివిధ రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ సంస్థలకు కూడా ఆయన సేవలందించారు. 1995 నుండి ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజ్ ఆఫ్ ఇండియాలో సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయ న అం త్యక్రియలు గురువారం ఉదయం 11 గం టలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
* ఏపీఎస్‌ఈబీ మాజీ చైర్మన్ బలరామి రెడ్డి (ఫైల్‌ఫొటో)