రాష్ట్రీయం

9న పౌర్ణమి గరుడసేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 3: తిరుమలలో ఫిబ్రవరి 9వ తేదీన పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం పాఠకులకు విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగుమాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
శ్రీవారి భక్తితత్వాన్ని వ్యాప్తి చేసిన ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు తిరుమలలో పౌర్ణమి గరుడసేవ సందర్భంగా నాళాయిర దివ్యప్రబంధ మహోత్సవాన్ని నాల్గవసారి టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఇదివరకు వేద మహోత్సవం, భజన మేళా వంటి కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించిన విషయం విదితమే. దివ్యప్రబంధ మహోత్సవంలో భాగంగా ద్రవిడ వేద నాలాయిర దివ్యప్రబంధ పారాయణ పథకంలోని దాదాపు 200మంది పారాయణదారులు స్వామివారి వాహనం ఎదుట పాశురాలను పారాయణం చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి పారాయణదారులు విచ్చేయనున్నారు.
ముందుగా ఉదయం 10గంటలకు తిరుమలలోని ఆస్థానమండపంలో నాలాయిర దివ్యప్రబంధ పారాయణదారులతో సమావేశం, దివ్యప్రబంధ పారాయణం నిర్వహిస్తారు. టీటీడీ పెద్దజీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి విచ్చేసి తమ సందేశాలిస్తారు. అనంతరం సాయంత్రం 4 నుండి 5గటల వరకు తిరిగి దివ్యప్రబంధ గోష్టిగానం నిర్వహిస్తారు. ఆ తరువాత రాత్రి 7 నుండి 9గంటల వరకు ఆలయ నాలుగుమాడవీధుల్లో జరగనున్న శ్రీవారి పౌర్ణమి గరుడసేవలో జీయర్‌స్వాముల వెంట పండితులు దివ్యప్రబంధ పారాయణం చేస్తారు.