సబ్ ఫీచర్

నాటి చలం.. నేటికీ ఒక సంచలనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక దీపం యిచ్చే వెలుగు, ఒక ఆవు యిస్తున్న పాలనుబట్టి వాటి విలువలు వున్నట్టే, సంతోషం, సేవించడం, పిల్లల్ని కనే సామర్థ్యంబట్టి స్ర్తి విలువ, పొందుతోంది’’ 90 సంవత్సరాల క్రితం, ‘ఆమె’ బతుకు తీవ్రంగా అణచివేతకు గురిఅవుతున్న రోజులలో జీవితమే సాహిత్యంగా నాటి సంఘంపై గుడిపాటి వెంకటచలం కొరడా ఝుళిపించారు. ‘మేన్ అండ్ ఉమన్’ చలం నాటి ఆంగ్ల రచనలోని ఇతివృత్తం అది. ‘‘స్ర్తికి కూడా శరీరం వుంది. దానికి వ్యాయామం యివ్వాలి. ఆమెకీ మెదడు వుంది. దానికి విజ్ఞానం యివ్వాలి. ఆమెకు హృదయం వుంది. దానికి అనుభవం ఇవ్వాలి’’. చలం పుట్టే నాటికి 1894కు ముందు శతాబ్దంలో సతీ సహగమనం, అతి బాల్య వివాహాలు, కన్యాశుల్కం, ఎన్నో సనాతన ఛాందస దురాచారాలు స్ర్తి స్వేచ్ఛను అతి అమానవీయంగా అణచివేస్తున్న నేపథ్యంలో కందుకూరి, గురజాడ చేపట్టిన సాహిత్య ఆయుధాన్ని చలం అందుకొన్నాడు. నాటి స్ర్తిల శారీరక, మానసిక వేదన చలాన్ని కదిలించి, కరిగించింది. నీళ్ళులేక ఎండిపోతున్న గడ్డిపోచ ఆర్తనాదాన్ని, కాలి కింద నలుగుతున్న చీమల రెక్కల చప్పుడు విని చలించే చలం హృదయానికి, జీవితంలో ఒక్క నిమిషం శాంతి లేదు. నాటి రోజుల స్ర్తిల జీవితానుభవాలు చలాన్ని చీల్చి, నలిపి ఊపిరాడనీయలేదు. ‘ఈ భూమి మీదనే అమృతంతో నింపగల స్ర్తి అనుభవిస్తున్న వేదన చలాన్ని, నిరంతర సంఘర్షణ, అశాంతితో తీవ్ర భావోద్వేగంతో ప్రభావితం చేసింది. స్ర్తిల కన్నీళ్ళు, కలలు జీవితాంతం శాసించాయి. ఒంటరి పోరాటం, సంఘం వెలివేసింది. యువకునిగా ఆరంభమైన జీవన గమ్యం తీవ్ర అనే్వషణ, అవిశ్రాంత పథికునిగా అరుణాచల రమణాశ్రమంవైపు సాగిపోయింది. 1979 మేలో తుదిశ్వాస వదిలేవరకు 85 సంవత్సరాల జీవనయానం జీవితానందపు లోలోతులు వెదుక్కుంటూ నిరీశ్వర, ఈశ్వర వాదాల వివాదాస్పదంగా వైరుధ్య వైవిధ్యంగా తెలుగునాట సంచలనం సృష్టించింది.
సాహిత్యంలో మహిళా స్వేచ్ఛ
శశిరేఖ తొలి నవలగా దైవమిచ్చిన భార్య, మైదానం, అమీనా, వివాహం వంటి రచనలు, 1930-40 మధ్య అరుణ, బ్రహ్మణీకం, జీవితాధర్మం, పురూరవ నాటకాలు, స్ర్తి, ప్రేమలేఖలు, మ్యూజింగ్స్ చలం సృష్టించిన సాహిత్యం అంతా స్ర్తి స్వేచ్ఛ ప్రాతిపదికగా, తీవ్రంగా సమాజాన్ని నిలదీసింది. పూర్వాశ్రమంలోను, రమణాశ్రమంనుంచి సుమారు అయిదు దశాబ్దాలుగా నిష్కల్మషంగా, నిర్మొహమాటంగా పోరాడిన చలం, పలాయనవాదిగా ముద్రపొందటమే కాకుండా కుటుంబ వ్యవస్థలో చిచ్చురగిల్చే అనైతిక దుష్ట్ధోరణుల దుర్మార్గ మేధావిగా అపకీర్తి, తీవ్ర నిందారోపణలు మూటకట్టుకొన్నాడు. అయినా చలం నేటికీ సంచలనమే.
ప్రస్తుతం 21వ శతాబ్దపు ద్వితీయ శతాబ్దపు కాల నేపథ్యంలో సాంకేతిక ప్రజ్వలన సమాజ స్థితిగతులలో, అత్యాధునిక మహిళ, పురుష ప్రపంచంతో పోటీలో అన్నిరంగాలలో సమానత సాధించే దిశలో దూసుకుపోతోంది. సంఘ సంస్కర్తలు, మేధావంతులు, ప్రగతిశీల విప్లవ భావోత్తేజితులు, మహిళలకు శరీరానికి వ్యాయామం, మేధస్సుకు విద్యావిజ్ఞానం, హృదయానికి అనుభవం వంటి ఆవశ్యకతలను గురించి ఎత్తిచూపవలసిన అగత్యం లేదు. అయినా లైంగిక అత్యాచారాలు, అసమానత, ప్రతిభను సహించలేని ఈర్ష్యాద్వేషాలు, పురుషాధిక్యతను ధిక్కరించటం వలన ఆమెకు ఎదురయ్యే అమానవీయ పాశవిక ధోరణులు, ఆడతనం పట్ల ఉన్మాద వికృత వ్యామోహం పీడగా నేరప్రవృత్తి పెచ్చుపెరగటం కారణంగా అమానుష హత్యలు, ఆత్మహత్యలకు ప్రేరణలు, హింసా దౌర్జన్య, అన్యాయ అసమానతలు కొనసాగుతూనే వున్నాయి. అయినా మతం ఏదైనా, సనాతన ఆధ్యాత్మికతా జీవన విధానపు విలువలకు అసంఖ్యాకంగా, మహిళాప్రపంచం ప్రశాంత ధార్మిక సంప్రదాయానికి తలవంచి ఔదల దాలుస్తోంది. భారత రాజ్యాంగం ప్రసాదించిన సమానత హక్కుల పరిరక్షణ, మానవతా విలువల ప్రాధాన్యత మహిళా సాధికారతా లక్ష్యం ఆలోచింపచేయటంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్థంభాలైన న్యాయస్థానాలు, మీడియా యితర రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలు అవకాశాలు అందిపుచ్చుకొంటున్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల సెక్షన్ 497 కొట్టివేయటం నాటి చలం తీవ్ర భావ సంచలనం గుర్తుచేస్తుంది.
జీవన సంక్షోభం సృష్టించే అనైతిక బాంధవ్యం
పురుషులకు వివాహేతర సంబంధాలు నాడు సాధారణమే కాదు. గర్వకారణం కూడా. అందుకే 158 ఏళ్ళనాటి ఐపిసి 497 సెక్షన్ ప్రకారం ఏ భర్త అయినా తన భార్యకు ఒకవేళ ప్రేమికుడు వుంటే నేరస్థునిగా శిక్షపడేటట్టు చేయవచ్చు. భార్య, భర్త ఆస్తిగా ఆమెకు లైంగిక స్వేచ్ఛ లేకపోగా అదే విధంగా, సెక్షన్ 198(2) ప్రకారం భర్తకు మాత్రమే అటువంటి ఫిర్యాదుచేసే హక్కు వుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ రోహిన్టన్ నారిమన్, జస్టిస్ ఇందు మల్‌హోత్రా ధర్మాసనం ఆ చట్టాలపై వ్యక్తంచేసిన న్యాయాభిప్రాయాలు, ఆ చట్టాలను కొట్టివేయటం, భారతీయ మహిళల జీవితాలలో అనూహ్యమైన విచిత్ర పరిణామాంశం. భారతీయ సాహిత్యంలో తెలుగునాట చలం తిరుగుబాటు రచనలు, జాతీయస్థాయిలో గుర్తింపు పొందలేదు. చలం ఒక ప్రభంజనం. వైవాహిక వ్యవస్థను విధ్వంసంచేసి తుడిచిపెట్టగల బీభత్సాన్ని తట్టుకొనే చేవ సమాజానికి ఎంతవరకు అవసరమో ఆ స్థాయిలోనే ఆ ప్రచండ భావ తీవ్రతకు ఆమోదం లభించింది.
చలం యువ అభిమానిగా, ఈ వ్యాసకర్తకు ఆయన స్వదస్తూరీతో 1969-1974 మధ్య అయిదు ప్రత్యుత్తరాలు అందుకొనే అవకాశం లభించింది. ఈశ్వర కరుణ, ఈశ్వరాదరణ, ఈశ్వరాశీద్వారాలతో ఆయన పలకరింపులు, శైలి అనిర్వచనీయమైన భావోత్తేజం కలిగిస్తుంటాయి. రమణాశ్రమంలో, జీవన చరమాంకంలో, శారీరకంగా కృశిస్తున్నా వణుకుతున్న అక్షరాలతో రాసిన ఉత్తరం బహుశా ఆఖరి ప్రత్యుత్తరం కావచ్చు. ‘‘్భగవాన్నించి నేను అవలోకించిన దివ్యానుభూతి నాకే చాలకుండా వుంది. మీకెక్కడ పంపగలను?’’ అనిరాస్తూ ‘‘అప్పుడే కాదు’’ అన్నారు. చలం, రచయితగా, వ్యక్తిగా అహర్నిశలు పోరాడిన ‘వ్యక్తి స్వేచ్ఛ’ నేటికీ గగన కుసుమం. నలభై ఏళ్ళ ఆయన మరణం తర్వాత, సుప్రీంకోర్టు, న్యాయ సందర్భం అదే గుర్తుచేస్తోంది.

- జయసూర్య, 9440664610