సబ్ ఫీచర్

పాత్రలకు జీవం పోసిన జన్నాభట్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్నాభట్ల నరసింహప్రసాద్ సుప్రసిద్ధ కథకుడు. లోగడ వీరి రచనలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఇప్పుడు అవి గ్రంథ రూపంలో వచ్చాయి. గ్రంథము పేరు జన్నాభట్ల కథలు-4. ఇందులో సుమారు 15 కథలు ఉన్నాయి. అన్నీ సాంఘిక సమకాలీన ఇతివృత్తాలతో మనల్ని ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. పేరుకు ఇవి కల్పితాలే అయినప్పటికీ ఇందలి పాత్రలన్నీ సజీవంగా మన కళ్ళముందు మనచుట్టూ తిరుగుతున్న వ్యక్తులనుండి తీసుకొన్నవి. అంటే రచయిత తన జీవితంలో జరిగిన చూసిన అనేక సంఘటనలు ఇందులో ఇతివృత్తాలుగా మారాయి. ఉదాహరణకు అవే కళ్లు అనే కథలో టి.వి దుష్ఫలితాలు కళ్ళకు కట్టవచ్చినట్లు వర్ణించారు. దిద్దుబాటు అనే కథలో మత సామరస్యము సూచింపబడింది. కర్మవిపాకంలో చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అనే విధంగా ఎవరు తీసుకున్న కర్మ ఫలం వారినే వెంబడిస్తుంది. ఐదు రూపాయలు కథలో నేటి అన్యాయపు కాలంలో నీతి కథ. స్వశక్తితో కష్టపడి ఉన్నత స్థితికి ఎదిగినవారి పిల్లలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుంటే వారికి తగు విధంగా బుద్ధిచెప్పి పెద్దలకు కనువిప్పు చూపించేదిగా ఉన్నది. ఎండమావులు అందరిముందు ప్రేమలు, ఆప్యాయతలు ప్రదర్శిస్తూ లోలోపల తల్లిదండ్రులను హింసించే వారికి గుణపాఠం చెబుతుంది. ఈ కథ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కథలో నేటి వివాహ వ్యవస్థలో నెలకొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పిచ్చిగల ఆడపిల్లల తల్లిదండ్రులకు తగిన గుణపాఠం రామబ్రహ్మం పాత్ర ద్వారా చూపించారు. ఇలాగే మిగతా కథలు కూడా సాగుతుంటాయి.
జన్నాభట్ల నవలికలు-3 గ్రంథములో వైవిధ్యమైన ఇతివృత్తాలతో ఇందులో మూడు కథలు ఉన్నాయి.
కలకానిది: ఒక సాధారణ స్ర్తి తన జీవితంలో అనుభవించిన వేదన. భర్త యొక్క నిరాదరణ కళ్ళకుకట్టినట్లు చిత్రీకరించారు. తనకు ఎదురైన కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో విజేతగా నిలుస్తుంది. స్ర్తి అనుకొంటే సాధించలేనిది ఏమి ఉండదు అని నిరూపించిన కథ ఇది.
పరాజితుడు: వ్యసనపరులకు, స్వార్థమే పరమావధిగా ధన సంపాదనే ధ్యేయంగా ఉన్నవారికి ఈ కథ ఒక గుణపాఠమే. సాంప్రదాయ కుటుంబాలు ఎలా పాడైపోతున్నాయో ఈ కథలో చూపించారు.
గెలుపుగుర్రాలు (నాటిక): కార్పొరేట్ విద్యావ్యవస్థతో నేటి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైపోతున్నది. ప్రభుత్వ విద్యాలయాలను ఉపయోగించుకొని తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు రాచబాటవేసి ప్రగతిపథంలో ప్రజలందరు నడవాలి అని సందేశాత్మకంగా సూచించారు.
జన్నాభట్ల నరసింహప్రసాద్ తండ్రి సుప్రసిద్ధ రచయిత. ‘ఆత్మా వైపుత్ర నామాతి’ అన్నట్లు తండ్రి యొక్క రచనా చాతుర్యం కుమారునికి సంక్రమించింది. ఈయన తండ్రికి తగ్గ తనయుడు మాత్రమే కాదు. తండ్రిని మించిన తనయుడు కూడా. ఆధునిక కథాసాహిత్యంలో జన్నాభట్ల వారికి ఉన్నస్థానం ఏమిటో సహృదయులు, విశే్లషకులు గమనించాలంటే ఈ రెండు గ్రంథాలను చదివి తీరవలసిందే.

--ప్రొ. ముదిగొండ శివప్రసాద్