రాష్ట్రీయం

అమరావతి చుట్టూ రింగ్‌రోడ్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ.20వేల కోట్లతో ప్రతిపాదనలు శాసనమండలిలో మంత్రి రాఘవరావు వెల్లడి
సర్కారు బడుల మూసివేతపై సభ్యుల మండిపాటు బాక్సైట్ తవ్వకాలపై వాకౌట్

హైదరాబాద్, డిసెంబర్ 17: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి శీతాకాల సమావేశాల్లో తొలిరోజు ప్రశ్నోత్తరాల పర్వం ఆసక్తికరంగా కొనసాగింది. సభ ప్రారంభం కాగానే, వైఎస్సార్ కాంగ్రెస్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కాల్‌మనీ అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. అదేవిధంగా ఎమ్మెల్సీలు శ్రీనివాసరెడ్డి, శర్మ, బాలసుబ్రహ్మణ్యం, గేయానంద్‌లు అనంతపురంలో ఏడు ఎకరాల భూమిని ప్రభుత్యం స్వాధీనం చేసుకున్న వ్యవహారంపై చర్చించాలని కోరారు. రైతులను రోడ్డు పాలు చేసిన ఈ ఘటనపై మండలి స్పందించాలని కోరుతూ వెల్‌లోకి దూసుకురావటంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన వెంటనే చైర్మన్ కాల్‌మనీపై వైఎస్సార్ కాంగ్రెస్ రైతుల భూములపై వామపక్ష పార్టీలిచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించి, ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. రెండు గంటల పాటు ప్రశ్నోత్తరాల సమయంలో సభ వాడివేడిగా సాగింది. సభ్యుడు యలమంచిలి రాజేంద్రప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి రాఘవరావు సమాధానమిస్తూ రాజధాని చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణం కోసం రూ.19,700 కోట్లతో ప్రతిపాదనలను రూపొందించామని తెలిపారు. ప్రతిపాదిత 180 కి.మీ.ల ఔటర్ రింగ్‌రోడ్ నిర్మాణం కోసం ప్రభుత్వం భూమిని సమకూర్చడానికి అంగీకరించి, ఎన్‌హెచ్‌డిపి 7వ దశలో కేంద్రం చేర్చేలా అందుకు సంబంధించిన అలైన్‌మెంట్‌ను ఖరారు చేసి, జాతీయ రహదారిగా ప్రకటించడం కోసం ఈ నెల రెండో తేదీన కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందని మంత్రి వివరించారు.
బాక్సైట్‌పై చర్చ జరగాల్సిందే!
వైజాగ్ చుట్టూ బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి సర్కారు జారీ చేసిన ఆదేశాలపై సరైన వివరణ ఇవ్వాలని సభలో విపక్ష సభ్యులు పట్టుబట్టారు. సభ్యులు చెంగల్రాయుడు, పిజె.చంద్రశేఖర్‌రావు అడిగిన ప్రశ్నకు మంత్రి పీతల సుజాత సమాధానమిస్తూ బాక్సైట్ గనుల తవ్వకాల కోసం ఎలాంటి ఉత్తర్వులను జారీ చేయలేదని చేప్పారు. రెండవ దశ అటవీ శాఖ అమోదం, మెసర్స్ ఏపి మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు భూమిని అప్పగించేందుకు మాత్రమే ప్రభుత్వ పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ ఇటీవల గత నెల 5న జివో నెంబర్ 97ను జారీ చేశామని పేర్కొన్నారు. గిరిజనులకు వ్యతిరేకంగా వ్యవహరించబోమని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం తరపున స్పష్టత లేకపోవటంతో సభ్యులు శర్మ, గేయానంద్, శ్రీనివాసరెడ్డితో పాటు ఇతరులు సభ నుంచి వాకౌట్ చేశారు.
పాఠశాలలను పరిరక్షించాలి
ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తున్నారంటూ వైఎస్సాఆర్పీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల విలీనంపై సభ్యుడు ఎంవివిఎస్.మూర్తి లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి గంటా శ్రీనివాసరావు సమాధానమిస్తూ రాష్ట్రంలో 32,346 వరకూ ఉన్న పాఠశాలల్లో ఇప్పటివరకు 1436 పాఠశాలలను ఏకీకృతం చేశామని తెలిపారు. ఈ సందర్భంగా సభ్యుడు మూర్తి మాట్లాడుతూ సర్కారు బడుల సంఖ్యను పెంచి, అభివృద్ధి పర్చాలే తప్ప, వాటిని మూసివేయటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో మూసివేసిన పాఠశాలలేమైనా ఉంటే తెరిపిస్తామని మంత్రి సభ్యులకు హామీ ఇచ్చారు.