రాష్ట్రీయం

5 జిల్లాల్లో వెయ్యి సోలార్ పంపుసెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈపిడిసిఎల్ సిజిఎం రమేష్ ప్రసాద్

విశాఖపట్నం, డిసెంబర్ 5: సోలార్ పంపుసెట్ల వాడకం రోజురోజుకీ పెరుగుతున్నందున విద్యుత్ ఆదా అవుతోందని ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) చీఫ్ జనరల్ మేనేజర్ (కమర్షియల్) బి రమేష్‌ప్రసాద్ తెలిపారు. విశాఖలోని సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంస్థ పరిధిలోకి వచ్చే ఐదు జిల్లాలకు సంబంబంధించి 1452 సోలార్ వ్యవసాయ పంపుసెట్ల ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే వెయ్యి పంపుసెట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. మిగిలిన 452 పంపుసెట్లన త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖపట్నం జిల్లాలో 277, విజయనగరంలో 303, శ్రీకాకుళంలో 120, తూర్పుగోదావరికి సంబంధించి 242, పశ్చిమగోదావరి జిల్లాలో 44 సోలార్ వ్యవసాయ పంపుసెట్లను మంజూరు చేసామన్నారు. ఇవి కాకుండా మరో వెయ్యి సోలార్ పంపుసెట్లను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దశలవారీగా వీటిని ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధమైందన్నారు. ఈపిడిసిఎల్ పరిధిలో సోలార్ పంపుసెట్లకు రైతుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నందున వీటిని కోరిన అందరికీ మంజూరు చేసేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందన్నారు. అవసరమైన పత్రాల సమర్పిస్తే ఎటువంటి జాప్యం లేకుండా పంపుసెట్ల మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ఎక్కువగా 5హెచ్‌పి పంపుసెట్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయని, దీనికి కేవలం 55వేలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. 1452 సోలార్ పంపుసెట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే నెలకు వెయ్యి యూనిట్ల వంతున ఏడాది మొత్తంపై 12 వేల యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చన్నారు. అలాగే వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్ లైన్లను నిర్మించాల్సిన అవసరం రాదన్నారు. సోలార్ వ్యవసాయ పంపుసెట్ల వినియోగంపై అవగాహన కల్పించేందుకు జిల్లాలవారీగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.