రాష్ట్రీయం

ఎసిబి వలలో మరో అవినీతి తిమింగలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్వాలిటీ కంట్రోల్ ఎఇ ఆస్తులు రూ. 6 కోట్లు
విశాఖపట్నం, డిసెంబర్ 19: పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ విభాగం అసిస్టెంట్ ఇంజినీరు (ఎఇ) డి రవికుమార్ సుమారు ఆరు కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల రవాణా శాఖలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రమేష్ ఆస్తులపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించగా, కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చినది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బంధువైన ఎఇ రవికుమార్ ఆస్తుల గురించి ఎసిబి అధికారులు ఆరా తీశారు. ఇందులో భాగంగానే ఎసిబి కేంద్ర దర్యాప్తు విభాగం (సిఐయు) అధికారులు శనివారం ఉదయం నగరంలో దాడులు జరిపారు. ఈ దాడిలో వివిధ ప్రాంతాల్లో రవికుమార్‌కు పలు ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. వీటి మార్కెట్ విలువ దాదాపు రూ. 6 కోట్ల పైమాటేనని ఎసిబి అధికారులు చెబుతున్నారు. రవికుమార్‌కు ఎంవిపి కాలనీలో రెండు ప్లాట్లు, ద్వారకానగర్‌లో ఒక ప్లాట్, మురళీనగర్‌లో ఒక ఇల్లు, అచ్యుతాపురంలో నాలుగు ఇళ్ల స్థలాలు ఉన్నాయి.
వీటితో పాటు ఆయన ఇంట్లో సోదా చేయగా రెండున్నర కిలోల బంగారం, 9 కిలోల వెండి, రూ. 4.5 లక్షల నగదు, బ్యాంకు డిపాజిట్లు, ఎల్‌ఐసి బాండ్లు, శ్రీరామ్ మ్యూచ్యువల్ ఫండ్స్‌కు సంబంధించిన పత్రాలు లభించాయని ఎసిబి కేంద్ర దర్యాప్తు విభాగం డిఎస్పీ ఎ రమాదేవి తెలిపారు. ఈ దాడిలో ఎసిబి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఈ ఆస్తుల కొనుగోలు, ఆదాయం తదితర వివరాలను రాబట్టే పనిలో ప్రస్తుతం అధికారులు నిమగ్నమయ్యారు.