రాష్ట్రీయం

2019 నాటికి రాష్ట్రంలో బలమైన శక్తిగా బిజెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళా మోర్చా ఇన్‌చార్జి పురంధ్రీశ్వరి జోస్యం
ఒంగోలు, డిసెంబర్ 19: రాష్ట్రంలో 2019 సంవత్సరం నాటికి భారతీయజనతాపార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆపార్టీ జాతీయ మహిళా మోర్చా ఇన్‌చార్జి దగ్గుబాటి పురంధ్రీశ్వరి జోస్యం చెప్పారు. శనివారం రాత్రి ఒంగోలులోని ఎకెవికె కాలేజిమైదానంలో జిల్లా బిజెపి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంవి రమణారావు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన పురంధ్రీశ్వరి మాట్లాడుతూ బిజెపి ఎదుగుదలను రాష్ట్రంలో ఎవరూ ఆపలేరని, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న యువశక్తి తమపార్టీవైపు చూస్తోందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పగ్గాలు చేపట్టిన తరువాత భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో బిజెపి బలంగా ఉన్నప్పటికి అంతకంటే మిన్నగా రాష్ట్రంలోపార్టీ బలోపేతంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించిందన్నారు. 2019ఎన్నికలను లక్ష్యంగా ఎంచుకుని ఇప్పటినుండే పార్టీశ్రేణులు బలోపేతంపై దృష్టిసారించారన్నారు. ప్రతిపక్షపార్టీల విమర్శలను పట్టించుకోవద్దని పార్టీకార్యకర్తలకు విజ్ఞప్తిచేశారు. అభివృద్ధే ధ్యేయంగా,ప్రజాసమస్యలే ఎజెండాగా ముందుకువెళ్తే రాష్ట్రంలో బిజెపికి మంచిగుర్తింపురావటమే కాకుండా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మంచి మెజార్టీ సాధించటం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్భ్రావృద్ధికి కేంద్రప్రభుత్వం పూర్తిస్ధాయిలో కృషిచేస్తుంటే ప్రతిపక్షపార్టీలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. పెద్దఎత్తున కేంద్రం రాష్ట్రానికి నిధులనుమంజూరు చేసి అభివృద్ధికి సహకరిస్తుంటే ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజి అంశాలను ప్రతిపక్షపార్టీలు తెరపైకి తీసుకురావటం బాధాకరమన్నారు. పార్టీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేవాదాయశాఖమంత్రి పి మాణిక్యాలరావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు భారతదేశంవైపుచూస్తున్నాయన్నారు. తీరప్రాంతంల్లోని జిల్లాల్లో షిప్పింగ్ హర్బర్లు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయటమే కేంద్రప్రభుత్వ ధ్యేయమని అందులోభాగంగానే ప్రధాని మోదీ పగ్గాలుచేపట్టిన వారంరోజుల్లోనే ముంపుప్రాంతాలను రాష్ట్రంలో విలీనం చేశారన్నారు. (చిత్రం) సమావేశంలో మాట్లాడుతున్న డి పురంధ్రీశ్వరి