ప్రార్థన

క్రీస్తు మాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హృదయశుద్ధి గలవారు ధన్యులు. వారు దేవుని చూచెదరు.
-మత్తయి 5:8
హృదయములో ఎటువంటి ఆలోచనలు ఉన్నవో, దేనితో నిండి ఉన్నదో మనకు మాత్రమే తెలుసు. మనలో ఉన్న ప్రేమ పగ ద్వేషం కామము క్రోధము కక్ష ధనాపేక్ష మద మత్సరము ఈర్ష్య అన్యాయము అసూయ ఖేదము దిగులు విచారము చెడుతనము సంతోషము దుఃఖము బాధ తృప్తి కృతజ్ఞత మోసము.. ఇంకా అనేకమైన విషయాలతో నిండి ఉంటుంది. ఎవరి హృదయములో ఏముందో వారికి మాత్రమే తెలుసు. తరువాత ఆకాశ మండలమును విశాలపరచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవాకు మాత్రము తెలుసు. చల్లకొచ్చి ముంత దాస్తున్నారన్న సంగతి మనకే అర్థవౌతుంటే, సర్వజ్ఞానియైన దేవునికి ఇంక ఎంత తేటగా అర్థవౌతుందో గదా! ఏ పని ఎందుకు చేస్తున్నామో? ఎలా చేస్తున్నామో? మంచి వారమని మనుషుల చేత అనిపించుకోవటానికా లేక మంచితనముతోనా అన్న సంగతి ప్రభువుకు బాగా తెలుసు. దేవుని జ్ఞానము ఎరిగిన దావీదు మహారాజు - సొలొమోనా నా కుమారుడా నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును ఆలోచన లన్నింటిని సంకల్పము లన్నింటిని ఎరిగినవాడై యున్నాడు. కనుక నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకంగా మనఃపూర్వకముగా సేవించుమని హెచ్చరించాడు. ప్రభువు మనుషుల ఆంతర్యము ఎరిగినవాడు.
దేవుడు పరిశుద్ధుడు పరిపూర్ణుడు గనుక పరిశుద్ధంగా లేనివారికి ఆయన కనపడడు. వినపడడు. అర్థం కాడు. హృదయాలలో మంచి మానవత్వం ప్రేమ అనురాగాలు సేవాదృక్పథం ఉన్నా మలినముతో కలిసి మోసముగా ఉన్నాయి. అందుకే ఆదికాండం 6వ అధ్యాయంలోనే ‘నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు’ యెహోవా చూచెను. మన ప్రభువు మన హృదయాలను చూచువాడు. హృదయ రహస్యాలు ఎరిగినటువంటి వాడు. హృదయము అన్నిటికంటె మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి గలది దాని గ్రహింపగలవాడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియా ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను. అంతరేంద్రియములను పరీక్షించువాడను.
మార్కు 7:21 - మనుషుల హృదయములో నుండి దూరాలోచనలును జారత్వమును దొంగతనములును నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనమును కామ వికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నియు లోపల నుండియే బయలువెళ్లి మనుష్యుని అపవిత్రపరచునని యేసు చెప్పెను. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. నరుల హృదయము మరి తేటగా ఆయనకు కనపడును గదా! కనుక హృదయములో ఎటువంటి మలినమున్న దానిని తీసివేయాలి. అది కోపం కావొచ్చు. వేషధారణ కావొచ్చు. దురాశ కావొచ్చు. వాటినన్నిటిని కడుగకుండా చేసే సేవ వృధా. దానధర్మాలు పుణ్యకార్యాలు ఆరాధనలు ప్రార్థనలు స్తుతి అంతా వృధా అవుతుంది. ఎందుకంటే ఈ ప్రజలు పెదవులతో నను ఘనపరచుదురు కాని వారి హృదయము నాకు దూరముగా ఉందని ప్రభువు సెలవిస్తున్నాడు. దైవభక్తి లాభ సాధనముగా వాడుచున్నారు. పేరు దేవునిది లాభం వారిది. జాగ్రత్త.. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. నరుల హృదయము మరి తేటగా ఆయనకు కనపడును గదా. కనుక హృదయములో ఎటువంటి మలినము ఉన్నా దానిని తీసివేసుకోవాలి. అది కోపం అవ్వచ్చు వేషధారణ అవ్వచ్చు. ధనాశ లాంటివి ఏవైనా సరే వాటినన్నిటిని కడుగకుండా చేసే సేవ అంతా వృధానే అవుతుంది.
‘దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయమును విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుచున్నారు.’ దేవుని సొమ్మును విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. దేవుని ఆస్తులను ఆక్రమించి విక్రయిస్తున్నారు. అవసరములో ఆశ్రయించిన వారితో అవసరాలు తీర్చుకొంటున్నారు. ఇటువంటి హృదయము శుద్ధిపరచుట ఏల? మనము శుభ్రపరచలేము. ఎందుకంటే కోపం మానితే దురాశ, దురాశ మానితే అసూయ, అసూయ మానితే ఇంకొకటి ఇంకోటి పుట్టుకొస్తూనే ఉంటాయి. అందుకే దావీదు మహారాజు ప్రార్థించాడు. ‘దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధి నుండి త్రోసివేయకు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుమని.
-ఖూజఆక యచి హళ్ఘూఆ జఒ యూౄళ ఆ్ద్ఘశ ఒజశషళూజఆక.
హృదయము ఎలా శుద్ధి చేయబడుతుంది?
ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపు నుండి పవిత్రులనుగా చేయును. వెలుగులో నడచుట తోటి వారిని ప్రేమించటమే. ఈ ప్రేమ అన్నిటిని ఓర్చును. దీర్ఘకాలము సహించేది, దయ చూపించును. మత్సరపడదు. డంబముగా ప్రవర్తింపదు. ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. అన్నిటిని తాళుకొనును. అన్నింటిని నమ్మును. అన్నిటిని నిరీక్షించును.
మన పాపములను ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మమును పవిత్రులుగా చేయును.
ప్రార్థన - కీర్తన 51: 1,2 దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము.’ ఈ ప్రార్థన మనము కూడా చేయాలి. దానికి తోడు దేవుని వాక్యము చదివి దాని ప్రకారము జీవించుట ద్వారా శుద్ధి చేయబడతాము. కీర్తనలు 119:11 - నీ ఎదుట పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను అని కీర్తనకారుడు వ్రాసినట్లు, మనము కూడా వాక్యాన్ని హృదయములో భద్రపరచుకోవాలి. దేవుని పరిశుద్ధమైన శక్తిగల మాటలతో మన హృదయాన్ని నింపుకొన్నట్లయితే హృదయము శుద్ధంగా ఉంటుంది. అప్పుడు దేవుని చూడగలము. ఆయన పునరుత్థాన శక్తిని గ్రహించగలము. ఇట్టి ధన్యత మనమంతా పొందుకోవాలని దేవుని ఆశ.

-మద్దు పీటర్ 9490651256