ప్రార్థన

సణుగుకొనకుడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యేసు మాట - మీలో మీరు సణగుకొనకుడి - యోహాను 6:44
మీరు సణగకుడి - వారిలో కొందరు సంహారకుని చేత నశించిరి. - 1 కొరింథి 10:10
పాపములలో అతి సాధారణమైనది సణగుట. కానీ దేవుని దృష్టిలో మాత్రము ఇది చాలా ప్రమాదమైనది. ఒక విధముగా చూస్తే మరణకరమైనది. కానీ మనకేమో ఇది చాలా సాధారణమైనది. పని లేకపోతే లేదనీ, ఉంటే ఉందనీ, ఎక్కువైతే ఎక్కువైందని, లేక తక్కువైందని సణుగుతూనే ఉంటారు. పని వారి మీద యజమానులు సణుగుతూనే ఉంటారు. యజమానుల మీద పనివారు సణుగుతూనే ఉంటారు. ఇక తోటి పనివారి మీద అయితే చెప్పే అవసరమే లేదు. ఇంట్లోకి వస్తే చెప్పాల్సినదేముంది. తల్లిదండ్రులు పిల్లల మీద, పిల్లలేమో తల్లిదండ్రుల మీ, భార్య భర్త మీద, భర్త భార్య మీద, కుటుంబమంతా కలిసి ఇరుగు పొరుగు వారి మీద సణుగుడే సణుగుడు. సమాజము సణుగుడుతో నడుస్తోంది. సంఘములో కూడా తక్కువేమీ కాదు. పెద్దల మీద సంఘం, సంఘం మీద పెద్దలు, కాపరి మీద సంఘం, సంఘం మీద కాపరి. ఇలా ఒకరి మీద ఒకరు సణుగుడు పండిట్స్ లేని ప్రాంతము లేదు. ఇంగ్లీషు వాడు ఇంగ్లీషులో, తెలుగు వారు తెలుగులో, జర్మనీ వారు, హిందీ వారు, ఫ్రెంచి వారు ఇలా అన్ని భాషల వారిలో కూడా ఇది సామాన్యమే. వారు ఏ భాషలో గొణుక్కుంటున్నా మనకు అర్థవౌతుంది. ఏ భాష వారైనా ఏ దేశస్థులైనా ప్రేమ ఎలా అర్థవౌతుందో గొణుగుడు కూడా అలానే తెలిసిపోతుంది. దీని నుండి గొడవలు ప్రారంభమై చివరకు మరణముతో అంతవౌతాయి. విడాకులతో కొట్లాటలతో పోట్లాటలతో చివరకు మరణముతో ఆగిపోతాయి.
Murmur is half suppressed or muttered complaint in webster definition. Complaining or murmuring does not give glory to God. God hates murmuring.

గొణుగుఢు వల్ల అనేక కష్టాలు, ప్రమాదాలు జరుగవచ్చు.
1.గొణుగుడు వల్ల ఉపయోగముండదు కానీ ఒత్తిడి పెరుగుతుంది.
2.దేవుడు చేసిన మేలులన్నీ మరపులోనికి వస్తాయి.
3.ఇశ్రాయేలీయులు దేవుని సేవకుని మీద గొణిగి మరణించారు.
4.గొణుగుడు వల్ల విశ్వాసము బలహీనపడుతుంది.
5.సాక్ష్యం బలహీనపడుతుంది.
6.గొణిగే సమయములో సాతానుడు మనకు తెలియకుండానే మన లోనికి ప్రవేశిస్తాడు. వాడు ఒక్కసారి వస్తే వెళ్లగొట్టడం చాలా కష్టం.
7.దేవుని మీద గొణిగే వాళ్లు కూడా లేకపోలేదు. అది ఇంకా ప్రమాదము.
ఇశ్రాయేలీయులు దేవుని సేవకుడైన మోషే మీద గొణగటం ప్రారంభించారు. దేవుని మాట వినిన మోషే ఇశ్రాయేలీయులను విడిపించటానికి తన రాచరికాన్ని వదులుకొని బానిస బ్రతుకుల్లో కలిసిన సంగతి వారికి తెలియక కాదు గానీ పరిస్థితులు అననుకూలంగా లేనప్పుడు, అరణ్యములో ఆహారము లేనప్పుడు, ఎడారిలో నీళ్లు దొరకనప్పుడు వారు గొణగటం ప్రారంభించారు. వాస్తవానికి మోషే త్యాగాన్ని చూశారు. అంతేకాదు దేవుని అద్భుత కార్యాలు కూడా చూశారు. ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వము నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహిస్తే కానాను దేశమునకు నడిపించటానికి దేవుడు మోషేను ఎన్నుకొని ఎలా తోడుగా ఉండి నడిపించారో చూసినప్పటకీ కొంచెం కష్టం ఏదైనా ఓర్చుకోలేక పోయారు. అంతేకాదు ప్రభువు చేసిన గొప్ప అద్భుత కార్యాలన్నీ మరచిపోయారు. మోషే మీద గొణగటం ప్రారంభించారు. ఇంకొక సంగతి తెలుసుకోవాలి. మోషే మీద గొణగటమంటే ఆయను ఎన్నుకున్న దేవుని మీద గొణగటమే. తల్లిదండ్రుల మీద గొణగటమంటే దేవుని మీద గొణగటమే. యజమానుల మీద, పనివారి మీద, అధికారుల మీద, పిల్లల మీద గొణగటమంటే వారిని సృష్టించిన సృష్టికర్త మీద గొణగటమేనన్న సంగతి జ్ఞాపకముంచుకోవాలి.
చూడండి - మోషే దేవుని ఆజ్ఞానుసారముగా ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించేటప్పుడు దేవుని అద్భుతమైన శక్తిని బట్టి పది రకాలైనటువంటి గొప్ప అద్భుతాలు చూయించి ఫరో రాజును భయక్రాంతుడను చేసి, ఇశ్రాయేలీయులను మాత్రము అతి భద్రముగా కాపాడి ఐగుప్తు నుండి బయటకు తెచ్చినప్పుడు మరల ఫరో రాజు హృదయాన్ని కఠిన పరచుకొని తన సైన్యములతో ఇశ్రాయేలీయులను వెంబడింపగా వారు భయపడి గొణగటం మొదలుపెట్టారు.
ఫరో రథములను సిద్ధపరచుకొని ఇశ్రాయేలీయులను తరిమెను. చివరకు పిహహీరోతు సముద్రము దగ్గర ఇశ్రాయేలీయులను కలిసికొనిరి. ఫరో సైన్యముతో సమీపించుచుండగా, ఐగుప్తు సైన్యాన్ని చూసిన ఇశ్రాయేలీయులు మిక్కిలి భయపడి యెహోవాకు మొఱ్ఱ పెట్టిరి. చూడండి మొఱ్ఱ పెట్టారు కానీ విశ్వాసము లేని ప్రార్థన. ఎందుకంటే వారిని విశ్వాసముకన్నా భయమే ఎక్కువ ఉండబట్టి వారు మోషేతో - ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మునిట్లు చేయనేల? - నిర్గమ 14:11
ఎన్ని గొప్ప కార్యాలు చూసినా ఇశ్రాయేలీయులలో సరియైన విశ్వాసము లేదు. ప్రార్థనలు ఈ రోజులలో కూడా కొందరు చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి చేస్తున్నారు. కానీ శత్రు భయముతోనే, లోక భయముతోనే అల్ప విశ్వాసముతో విశ్వాసము లేకుండా కొందరు చేస్తున్నారు. జాగ్రత్త! అల్ప విశ్వాసమైన అవిశ్వాసమైనా పాపమే. కారణం నీకున్న సమస్యను దేవుడు తీర్చలేడు అన్న భయం ఉంది కనుక. ఆ దినాలలో వారి ముందు ఎఱ్ఱ సముద్రముంది వెనుక సైన్యముంది. అయినా ఎంత అద్భుతంగా ఎఱ్ఱ సముద్రమును పాయలుగా చేసి ఎండిన నేల మీద ఇశ్రాయేలీయులను ఎలా నడిపించాడో మనకు తెలుసు. ఆ తరువాత ఎడారిలో బండ నుండి నీళ్లతో వారిని తృప్తిపరచిన దేవుని గూర్చి బాగుగా ఎరిగిన - ఈ రోజుల్లో కూడా, చిన్నచిన్న సమస్యలకు దిగులు భయము మనుష్యులను భయభ్రాంతులను చేసినందున, అలవాటున ప్రార్థనలు చేస్తున్నారు గానీ సందేహముతోనే చేస్తున్నారు. అప్పుడు ఇశ్రాయేలీయులను ఎఱ్ఱ సముద్రము నుండి దాటించి ఫరో సైన్యమును సముద్రములో ఏ ఒక్కరిని విడువకుండా నాశనము చేసిన దేవుడే, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ప్రభువే ఇప్పుడు మనకు తోడుగా ఉన్నాడన్న సంగతి పూర్తిగా విశ్వసించాలి. అప్పుడు మన ముందు ఉన్న సముద్రమంత సమస్యలు మాయవౌతాయి. మన వెనుక వస్తున్న సాతాను సమూహాలు నశించిపోతాయి. మనము చేయవలసిందంతా ఒక్కటే, నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా ఉన్న ఆ ప్రభువును విశ్వసించటమే. మృత్యుంజయుడైన యేసయ్యను నమ్మటమే. అప్పుడు మనలను నడిపించే నాయకుల మీద గానీ, అధికారుల మీద గానీ మన పెద్దల మీద గానీ గొణుగుడు ఉండదు. ఫిర్యాదులుండవు.
పిల్లలు గమనించాలి. తల్లిదండ్రులు దేవుని ఆజ్ఞల మేరకు పిల్లలను పెంచాలని, కష్టపడి తినీ తినక ఎన్నో త్యాగాలు చేసి పెంచుతూ ఉంటే వారి మీద దయచేసి గొణగకండి. దేవుడిచ్చినంతలో గొప్పగా చేయాలనే ప్రయత్నిస్తారు. సామర్థ్యానికి మించి శక్తికి మించి చేస్తారు. ఇతరులతో పోల్చి వారి మీద గొణగకండి. ఆ బాధ వారిని కృంగదీయవచ్చు. బలహీనపరచవచ్చు. మోషే అంతటి దైవజనుడే ఇశ్రాయేలీయుల గొణుగుళ్లకు ఫిర్యాదులకు అలసిపోయాడు. దేవుని ఇల్లంతటిలో సాత్వీకుడైన వాడు వారి గొణుగుళ్లకు సహనాన్ని కోల్పోయి, దేవుడు తన స్వహస్తాలతో వ్రాసి ఇచ్చిన పది ఆజ్ఞలు గల పలకలను పగులగొట్టాడు.
‘మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేక పోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు - మేమేమి త్రాగుదుమని మోషే మీద సణగుకొనగా..’ - నిర్గమ 15:23-24
ఐగుప్తులో నీళ్లను రక్తముగా మార్చిన దేవుడు మారాలో చేదు నీటిని మధురముగా మార్చలేడా? ఇప్పుడు మన చేదు అనుభవాలను మధురముగా మార్చలేడా, మన ఎండిన బ్రతుకులను చిగురింప చేయలేడా మన కష్టాలను బాధలను తొలగించలేడా, యజమానుని కఠిన హృదయం మార్చలేడా, పనివారి మనస్సులను మార్చలేడా? - మరి ఎందుకు అంత అసహనం, గొణుగుడు దిగులు కోపం వస్తుందో అర్థం కావటము లేదు.
చూడండి ఎంతో అద్భుతముగా ఐగుప్తు బానిసత్వము నుండి తప్పించి బయటకు తెచ్చిన తరువాత ఎన్నో అద్భుతాలను చూచిన తరువాత ఇప్పుడు ఇశ్రాయేలీయులు మరల మోషే మీద అహరోనుల మీద గొణగటం మొదలుపెట్టారు. ఇపుపడు కథ మాంసం మీదకొచ్చింది. ఐగుప్తులో మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి? ఈ అరణ్యము లోనికి తెచ్చారు అని మాంసం కోసం సణగటం మొదలుపెట్టారు. దానికి గాను దేవుడు ఆకాశము నుండి ఆహారమును కురిపించాడు. ఉదయమున చాలినంత ఆహారమును సాయంకాలమున మాంసమును ఇచ్చినా ఇంకా సణుగుతూ ఉండగా యెహోవా దేవుడు విన్నాడు. అందుకు వారితో మోషే - మీ సణుగుడు యెహోవా మీదనే గాని మా మీద గాదన్నాడు. దేవుడు వారికి భోజనము ఎంత చక్కగా మంచు పొట్లాలలో జాగ్రత్తగా పంపాడో చూడండి. ఆ మంచు ఆరిపోయిన తరువాత సన్నని కణములు వారికి కనపడెను. ‘ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక, - ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇదే తినుటకు దేవుడిచ్చిన ఆహారమని మోషే వారికి తెలియజేసెను. 40 సంవత్సరములు ఉదయమున మన్నాను సాయంకాలమున పూరేళ్లను ఇచ్చుచునే ఉండెను. ఏనాడూ ఆపలేదు. ఏనాటి ఆహారము ఆనాడు పంపించాడు.
‘మన్నా’ అను పదమునకు అర్థము ‘ఇదేమి’ అనునది. మొట్టమొదట ఇశ్రాయేలీయులు దానిని చూచినపుడు పుట్టిన ప్రశ్నయే ఈ పేరు. ఇశ్రాయేలీయులు దేవుడు పంపిన ఆహారమునకు మన్నా అనే పేరు పెట్టిరి. ఆహారము ఇచ్చిన దేవుడు నీరిచ్చి దాహము తీర్చడా? రెఫీదీములో నీటి కొరకు మోషే మీద గొణుగుట మొదలుపెట్టారు. మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడకు తేనేల అని సణుగుడు చేశారు. ఇక్కడ ఇంకొక సంగతి గమనించాలి. దేవుడు జీవము గురించే మాట్లాడుతూ ఉంటాడు. సాతానుడు మాత్రము మనుష్యులతో మరణము గురించే మాట్లాడుతాడు. మన నుండి జీవపు మాటలు దీవెనలు వస్తుంటే మంచిది. ఇంకొక ముఖ్యమైన విషయమేమంటే సాతానుడు ఎల్లప్పుడు ఈ లోక విషయాల మీద, తిండి మీద, బట్టల మీద శరీరాశల మీదనే మన ఆలోచనలు ఉండేటట్టు ప్రేరేపిస్తాడు. ప్రభువేమో నిత్య జీవము నిత్య రాజ్యము శాంతి సమాధానాల గురించి మాట్లాడుతుంటాడు. నిత్య రాజ్యాన్ని వెదకే వారికి ఈ లోక అవసరాలన్నీ దేవుడే తీరుస్తాడు.
ఇశ్రాయేలీయులు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రభువును బాగా నమ్మారు. అననుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని మీద నమ్మకము పోయింది. అసహనము పెరిగింది గనుక గొణుగుడు మొదలుపెట్టారు. ఆశ్చర్యకరుని శక్తిని నమ్మలేదు. ఎటువంటి పరిస్థితులైనా నమ్మకముతో ఉంటే ప్రభువు ఇంకా గొప్ప అద్భుతాలు చేస్తాడు అన్న నమ్మకము తగ్గిపోతుంది. దేవాది దేవుని శక్తిని నమ్మకపోవటము కూడా పాపమే.
దేవుని గొప్పగా నమ్మిన పౌలు భక్తుని విశ్వాసము చూడండి.
నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుట లేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి యుండ నేర్చుకొని యున్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును. సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి యుండుటకును ఆకలిగొని యుండుటకును, సమృద్ధి కలిగి యుండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొనియున్నాను - ఫిలిప్పీ 4:11-12
ప్రతి విశ్వాసి కూడా అన్ని పరిస్థితులలో పౌలు భక్తుని వలె స్థిర విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అప్పుడే ఎటువంటి పరిస్థితులలోనైనా సమాధానముగా ఉండగలము. సణుగుడు లేకుండా ఏ పరిస్థితులలోనైనా కీర్తనలు పాడి ప్రభువును స్తుతించగలము. పౌలు భక్తుడు జైల్లో ఉండి వ్రాసిన ఉత్తరాలు ఏడు. అవి ఇప్పటికి మనకు కూడా ధైర్యాన్నిస్తున్నాయి బలపరుస్తున్నాయి.
నన్ను బలపరచె వానియందే నేను సమస్తము చేయగలను - ఫిలిప్పీ 4:13
పరలోకము నుండి మన మధ్యకు వచ్చిన ప్రభువు నన్ను తప్పక బలపరుస్తాడని అందరము నమ్మినట్లయితే మనలో నెమ్మది ఉంటుంది. రక్షణ కర్తయైన యేసు చాలు అనే స్థితికి వస్తే ఏ లోటు ఉండదు. ఒకవేళ లోటుపాట్లు ఏవైనా ఎదురైనా ఆ ప్రభువే చూసుకుంటాడు.
జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొక కొనను దహింపసాగెను - సంఖ్యా.11:1
మనకు తెలుసు దేవుని కోపము రగులుకొని ఒకసారి జలప్రళయములో జనులందరు నశించి పోయారు. మరియొక సారేమో అగ్నితో కాల్చివేయబడ్డారు.
అయితే నిర్గమము సమయములో మరలా దేవునికి కోపము తెప్పించిన ప్రజలను కాల్చివేయవలసినప్పుడు మోషే దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని - యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేల? కొండలలో చంపటానికి భూమి మీద నుండకుండ నశింప చేయటానికి అంటే కీడు కొరకే వారిని తీసికొని పోయెనని ఐగుప్తీయులు చెప్పుకోవటమెందుకు, దయచేసి నీ కోపాగ్ని నుండి మళ్లుకొని నీవు ఈ ప్రజలను క్షమించమని వేడుకున్నాడు. అంతట యెహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను - నిర్గమ 32:14
అబ్రహాము లోతు రక్షణ కొరకు ప్రార్థించిన ప్రార్థన దేవుడు విన్నాడు. మోషే ప్రార్థన విని ఇశ్రాయేలు ప్రజల మీద రగులుకున్న మంటను చల్లార్చుకున్నాడు.
ఇప్పుడు మనలను రక్షించటానికి వచ్చిన మన ప్రియ ప్రభువు యేసుక్రీస్తు ప్రార్థన విజ్ఞాపనముల వలన ఇంకా లోకములో మనము జీవిస్తూ ఉన్నాము. దేవుడు ఏర్పాటు చేసుకున్న కాపరులు, అధికారులు చేసే ప్రార్థనలు ప్రభువు ఆలకిస్తాడు గనుక, ఈ విజ్ఞాపన ప్రార్థనలు యాచనలు ఎంతో అవసరము. తెలియక మనుషులు సణగొచ్చు గొణగొచ్చు కానీ దయచేసి ఏర్పరచబడినవారు పాపులనుబట్టి కోపించక, ప్రభువుకు మాదిరి క్షమించి వారి మీద దేవుని ఉగ్రత రాకుండా ప్రార్థించమని మనవి చేసుకుంటున్నా - మన దేవుడు క్షమించటానికి సిద్ధమనస్సు గలవాడు.
అలానే ఐగుప్తు బంధకాలలో ఉన్న ఇశ్రాయేలీయుల వలె ఇప్పుడు ఎంతో మంది అనేక రకాలైన బంధకాలలో చిక్కుకొని ఉన్నారు. అప్పుల ఊబిలో తప్పుల ఊబిలో చిక్కుకొని, ఒక కాలు తీయటానికి ప్రయత్నిస్తే ఇంకొకటి ఇంకా లోపలికి వెళ్లి తప్పులు అప్పులు ఎక్కువౌతున్నాయి తప్ప బయటకు రాలేక సతమతవౌతున్నారు. ఈ బంధకాలలో నుండి తప్పించటానికి ఎంతోమంది సేవకులను పంపిన ఉపయోగము అంతగా కనపడక, చివరకు తన ఏకైక కుమారునే దేవుడు ఈ లోకానికి పంపించాడు. ప్రభువు ఈ లోకములో ఒక సాధారణ మనిషిగా జన్మించి, నిత్య రాజ్యానికి వారసులగుటకు మనము జీవించవలసిన విధానము బోధించి నేర్పించి లోక పాపముల కొరకు తన్నుతానే బలిగా అర్పించుకొని తన రక్తము ధారపోసి, ప్రాణాలిచ్చి మృత్యుంజయుడై పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపనము చేస్తూనే ఉన్నాడు. ఆయన మరణము జ్ఞాపకము చేసికోమని సంస్కారములో ఆయన శరీరానికి గుర్తుగా రొట్టెను, ఆయన రక్తానికి గుర్తుగా ద్రాక్షారసమును ఆచరించమని బోధించాడు. వాక్యమైయున్న దేవుడు, జీవాహారము నేనే - నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నదని, ఆత్మీయ జీవితానికి ముఖ్యమైనది ఆయన వాక్యమేనని ‘ఆత్మయే జీవింపచేయునని, శరీరము కేవలము నిష్ప్రయోజనమని, నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై యున్నవ’ని తెలియజేశాడు.
అయితే పూర్వము ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడిపించబడి అరణ్యములో 40 సంవత్సరములు చేసిన ప్రయాణములో ఆహార విషయములో గొణిగి దేవుని కోపము రేపినట్లే, ప్రభువు చెప్పిన ఈ మాటలను కూడా శరీర సంబంధముగానే ఆలోచించుచు, ఈ కఠినమైన మాటలు ఎవడు వినగలడని గొణగటం మొదలుపెట్టి, అప్పటి వరకు ఆయనను వెంబడించిన వారు అనేకులు ప్రభువుని విడిచి వెళ్లెనని యోహాను సువార్తికుడు తాను వ్రాసిన సువార్త 6వ అధ్యాయము 66వ వచనములో తెలియజేశాడు. మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదట. ప్రభువు ఆశ మనలను నిత్య జీవము లోనికి నడిపించాలని, గానీ సాతానుడు మాత్రం మన దృష్టి అంతా ఈ లోక అల్పకాలము మీదనే దృష్టిని మలిపి లోకాశలు అంటే శరీరాశ నేత్రాశ జీవపు డంబులోనే ఉంచి, ఏమి తిందాం ఎలా తిందాం ఎక్కడ తిందాం అన్నట్టు జీవించే విధానములోనే లోకానికి నేర్పుతున్నాడు. అందుకే ప్రభువు చాలా స్పష్టముగా ఒక విషయాన్ని తెలిపాడు. ‘మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును’ అని చెప్పాడు. కాబట్టి ఎటువంటి అననుకూల పరిస్థితులున్నా యేసు ప్రభువు తప్పక సరిచేస్తాడని, బంధకాల నుండి విడిపిస్తాడని, శోధనలలో తోడుగా ఉండి కీడులను తప్పిస్తాడని రూఢిగా నమ్మి దేవుని మీద గాని, దేవుడు తన రూపులో చేసిన ప్రజల మీద కాని గొణగకుండా సమాధానముగా సాగటానికి పరిశుద్ధాత్ముని సహాయము కోరుకుందాం. ప్రార్థించుదాము.

- మద్దు పీటర్ 9490651256