ప్రార్థన
సాకులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అప్పుడు మోషే - ప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండియైనను, నేను మాట నేర్పరిని కాదు, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా -
యెహోవా - మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానికే గాని చెవిటి వానినేగాని దృష్టిగల వానినే గాని గ్రుడ్డివానినేగాని పుట్టించిన వాడు ఎవడు?
యెహోవానైన నేనే గదా. - నిర్గమ 4:10-11
దేవుని పనికి ఎంత తేలికైన సాకులు చెప్తున్నాడో గదా! వాస్తవానికి మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై యుండెను - అపొ. 7:22
మనిషిని సృష్టించిన వాడు నోరిచ్చిన వాడు యెహోవా, ఆయన ప్రతి ఒక్కరినీ ఆయన అరచేతితో చెక్కియున్నాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉద్దేశములో నిర్మించాడు. మోషే, ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీయులను బానిసత్వము నుండి విడిపించటానికి ఫరో కుమార్తె దగ్గర రాచమర్యాదలతో సకలమైన విద్యలతో పెంచబడ్డాడు. రాచమర్యాదలతో పెంచబడి, చివరకు తాను చేయవలసిన పనిని గూర్చి దేవుడు తెలియజేయగా చిన్న సాకు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. అయితే దేవుడు ఏ పనికి నిన్ను ఎన్నుకుంటాడో ఆ పనికి కావలసిన నైపుణ్యత, కావలసిన వస్తువులు పనిమనుషులు కావలసిన శక్తి జ్ఞానము సమస్తమును సిద్ధం చేసి ఉంటాడు. వర్షాకాలంలో వెళ్లాలంటే కావలసినన్ని, ఎండా కాలానికి కావలసినన్ని, చలికాలానికి కావలసినన్ని, దానికి కావలసిన వనరులు కూడా సమకూరుస్తాడు. ఆయన సృష్టికర్త సర్వజ్ఞుండు సర్వశక్తిమంతుడు సర్వాంతర్యామి.
అయితే సాకులు చెప్పే వారికి ఎండాకాలం ఎండల సాకు, ఎండలు బాగా ఉన్నవి కనుక ఎండలు కాస్త తగ్గుముఖం పట్టాక వెళ్తామంటారు. వర్షాకాలం వర్షాలలో కుదరదు లెండి వర్షాలు తగ్గనివ్వండి అంటారు. చలికాలం చలి ఎక్కువగా ఉంది కాస్త తగ్గాక వెళ్దాము అంటారు. ఇలా ఏ పని చేస్తామని చెప్పినా ఏదో ఒక సీజనల్ సాకు చక్కగా ఉంటుంది.
కొంతమంది ఇంకొక రకమైన సాకులు, ఉద్యోగమొచ్చే వరకు ఓ.. రోజు ఉదయం సాయంత్రం ప్రార్థనలే ప్రార్థనలు. ఉద్యోగమొచ్చాక ఒక్క ప్రార్థనకు రాడు. కనపడడు. కారణమడిగితే ‘స్టాండర్డ్’ సాకు ‘బిజీ’. తరవాత పెళ్లి, పిల్లలు, ఇల్లు, ఉద్యోగం వాటితో బిజీగా ఉన్నాను కనుక చర్చికి రాలేక పోతున్నానండి. రావాలనే ఉంది కానీ ఎక్కడ టైమ్ దొరకటం లేదు. అంటే నీ ప్రార్థనకు జవాబిచ్చి ఉద్యోగమివ్వటం, మంచి కుటుంబంగా కట్టటం, మంచి ఇంటిని ఇవ్వటం, పిల్లల నివ్వటం దేవుని తప్పా? ఒక సంగతి గుర్తు చేసుకోండి. నీకు ఇష్టమైన విషయాలకు ఇంత బిజీలో కూడా సమయం దొరుకుతుంది. కానీ ఇంతగా ఆశీర్వదించిన దేవుని సన్నిధికి రావటానికి బిజీ.. కనిపెంచిన పెద్దవారిని చూడటానికి కూడా చాలామందికి కుదరటం లేదు. అదే ప్రమోషన్ కోసమో ఇంకా వేరే విషయాల కోసమైతే సమయం కుదుర్చుకుని మరీ వెళ్తారు. ఇంకొక అసలు సంగతి - దేవుడు ఊపిరాడని పనులు పెట్టడు. మనకు కుదరని పనులు పెట్టేది అపవాది. వాడి చేతుల్లో పడితే ఊబిలో పడ్డట్టే. ఊపిరాడదు. కదలలేము మెదలలేము. జాగ్రత్త! ఛాయిస్ మనదే. దేవుని సత్యమార్గములో కష్టాలుండొచ్చు. ఆపదలు ఎదురవ్వచ్చు. శోధనలుండొచ్చు. కానీ మన విశ్వాసము చెదరదు. అదే సాతాను మార్గములో వెళ్లేటప్పుడు ఊపిరాడని పనులు కష్టాలు పెట్టి ఆపదలలోనెట్టి, చివరకు దారి కానరాక, ఉన్న కొనప్రాణాన్ని కూడా తీసివేసుకోవాలనిపించేట్లు చేస్తాడు.
ఱఖఒక ఘౄక ఇళ ఇళజశ ఖశజూళూ ఢ్ఘఆ్ఘశ క్యరీళ.
ఏమీ ముఖ్యమైన పనులు లేకపోయినా అనవసరమైన పనులలో మునిగి బిజీగా ఉన్నాను తీరిక లేదు అని చెప్పటంలో చాలామంది బిజీగా ఉన్నారు. సర్వలోకాన్ని సృష్టించి అందలి జీవరాసులను పోషించుచున్న దేవుడు మన కోసం సమయాన్ని తీసికొని ఉన్నత స్థితిని వదలి మన మధ్యకు మన రక్షణ కొరకు మనల్ని ఉద్ధరించటానికి ఈ లోకానికి వస్తే.. మనమేమో ఆ దేవుని కంటె బిజీగా ఉండి, ఆ దేవుని కలవటానికి కూడా కొద్ది సమయం ఇవ్వలేక బిజీ అంటున్నారు. బిజీ అనేది ఒక స్టాండర్డ్ సాకు అయింది.
మొదటి సాకు ఆదాము, దేవాది దేవునితో చెప్తున్నాడు. ఎందుకో దేవునితో, దేవుని బిడ్డలతో దేవుని పనుల విషయములో చాలా తేలికగా, సులువుగా సాకులు చెప్పటం పరిపాటయ్యింది.
తినకూడదని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తిన్నావా? అని ప్రభువడిగితే ఆదాము చెప్పిన మాట.
‘నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్ర్తియే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటి’ననెను.
అలా కాకుండా క్షమించండయ్యా తప్పయిందని చెప్పినట్లయితే లోక పరిస్థితి ఇంకొక విధముగా ఉండేది. కానీ ఆదాము సాకుతో తప్పించుకోవాలని ప్రయత్నించినందుకు, చూడండి బ్రతుకు దినములన్నియు ప్రయాసముతోనే ఉండుననె శాపాన్ని పొందుకున్నాడు.
భర్త సాకు చెప్పి తప్పించుకున్నాడని అవ్వ కూడా ‘సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను’ అంటే భార్య భర్త లిరువురు కూడా చివరకు దేవుని మీదనే తప్పు మోపారు. ఆదామేమో నీవిచ్చిన ఈ స్ర్తినిబట్టి నేను తినవలసి వచ్చిందంటే అవ్వేమో నీవు సృష్టించిన ఈ సర్పమే నన్ను మోసము చేసిందని ఇద్దరూ చెరొక సాకు చెప్పి తప్పించుకోవచ్చనుకున్నారు గానీ అప్పుడు వారికి పడిన శిక్ష చాలా పెద్దదే. దేవాది దేవునితో సహవాసము కోల్పోయారు. అధికారము పోయింది. వారి నివాసానికి ఏర్పాటు చేయబడ్డ ఏదేను వనము నుండి త్రోసివేయబడ్డారు. శాపాన్ని తెచ్చుకున్నారు. ఒక్క సాకుకు ఎన్ని నష్టాలో చూడండి. అయితే మనమేమో సాకుల ప్రొఫెసర్లము అయ్యాము. దాని పర్యవసానము చూడండి. ముందుగా దేవుని సహవాసము ఉండదు. అంతేకాదు, సాకులు చెప్పి దేవుని సహవాసాన్ని కోల్పోయినప్పుడు సాతాను ఏవేవో ఎరలు వేసి, దేవుని సహవాసము లేకపోతే ఏంటి నేను లేనా అన్నట్టు లోకపరమైన వసతులు అనేకం కల్పిస్తాడు. ఏదేను వనము కంటె ఎక్కువ అన్నట్లు, ఆహ్లాదకరమైన స్థలాలకు తీసికొని వెళ్లి చివరకు వాడి వశం చేసికొని దేవాది దేవునికి మనలను విరోధులుగా చేస్తాడు. దాని ఫలం నిత్య నరకమే సుమా! ఎందుకంటే వాడు కల్పించిన వసతులు వాడి సహవాసము ఉత్త బూటకమే మోసమే. దయచేసి దేవునితో సాకులు చెప్పి సాతాను వేసిన వలలో పడకండి.
ప్రభువు ఎటువంటి కష్టమైన పనికి మనలను పిలిచినా, ఆ కష్టమంతా మన మీదనే వేయడు. మన మీద వేసిన కాడి ఒక ప్రక్కన మనముంటే ఇంకొక ప్రక్కన ప్రభువే ఉంటాడు. ఆ కార్యం పూర్తయ్యే వరకు దేవుడు నిన్ను విడువడు. తోడుగానే ఉంటాడు. మన కిచ్చిన ఆ పని ఫలభరితవౌతుంది. ముందు అది ఎంతో పెద్ద సవాలుగా, అంటే ఎఱ్ఱ సముద్రములాగనో, ఎడారి ప్రయాణము లాగనో ఉన్నా చివరకు పాలు తేనెలు ప్రవహించే కానాను చేరుతాము. నిత్య రాజ్యానికి వారసులవౌతాము. కానీ మనకున్న ఈ లోక జ్ఞానముతో ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటే అది మనకే నష్టం. అట్లని ఆ పని ఆగదు. ఎవరో ఒకరిని తిరిగి ఎన్నుకొని ప్రభువు చేయదలచిన పనిని మాత్రం చేస్తాడు. కాకుంటే మనకొచ్చే ఆశీర్వాదాలు బహుమానాలు ఇంకొకరికి పోతాయి.
క్రొత్త క్రొత్త సాకులు కనుగొంటున్నారు. ట్రాఫిక్ ఒక సాకు. ఈ రోజుల్లో అన్ని పట్టణాలలో రద్దీ ఎక్కువగానే ఉంది. అందుకని ముందే బయలుదేరి సమయానికి చేరుకోవాలి. చూడండి ఎయిర్‌పోర్ట్‌కి గానీ బస్టాండ్‌కి గానీ రైల్వే స్టేషన్‌కి గానీ ఎంత ముందు ఉంటామో గదా. కారణం - అక్కడ సాకులు చెల్లవు కాబట్టి. మరి దేవుని దగ్గర అస్సలు చెల్లవు.
ప్రభువు ఒక ఉపమానములో మనుష్యులు ఎలాంటి సాకులు చెప్తారో తెలియజేశాడు. ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను.
వాస్తవానికి ఈ విందు ఉపమానము రక్షణను గురించి, పరలోక రాజ్యాన్ని గురించి. ఈ విందును సిద్ధపరచింది సాక్షాత్తు దేవుడే. యేసు ప్రభువే మన కొరకు సిద్ధపరచిన విందు.
‘క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్ర వేసి యున్నాడని చెప్పెను’ - యోహాను 6:27.
‘పరలోకము నుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను’ - యోహాను 6:33. కావున వారు - ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను ‘జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు. నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు’ - యోహాను 6:36.
‘జీవాహారము నేనే’
వాక్యమై యున్న దేవుడే జీవాహారము. ఆ వాక్యాన్ని అంగీకరించి అనుసరించితే దేవుని రాజ్యానికి వారసులవౌతాము. ఆయన వాక్యాన్ని నింపుకున్న వారిలో ఆయన ఉంటాడు. ఇది నిత్యజీవమిచ్చు అక్షయమైన ఆహారము. ఆయన వాక్యము మనలో ఉంటే మనము ఆయనలో ఉన్నట్టే. మనము క్రీస్తులో ఉంటే, ఆ మహోన్నతుని చాటున ఉంటే నాశనకరమైన ఏ తెగులు నిన్ను సమీపింపలేదు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నాడు. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడక ఉందువు. నీ ప్రక్కన వేయి మంది పడినను నీ కుడిప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు.
‘అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను’ - కీర్తన 91:14
దేవుని ప్రేమించి ఆయన శక్తి మీద నమ్మకముంచి ఆయన వాక్యాన్ని అనుసరించి పాటించువారికి, ఆయన శరణుజొచ్చు వారికి పైన ఉదహరించబడిన మేలులన్ని సిద్ధంగా ఉన్నాయి.
అయితే వారందరు ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి.
మొదటివాడు - నేనొక పొలము కొనియున్నాను. అవశ్యముగా వెళ్లి దాని చూడవలెను. నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను.
ఎంత బుద్ధితక్కువ సాకు చెప్పుచున్నాడో చూడండి. పొలము చూడకుండా కొన్నాడట. ఇప్పుడు వెళ్లి చూసి వస్తాడట.
మరియొకడు - నేను ఐదు జతల యెడ్లను కొని యున్నాను వాటిని పరీక్షించ వెళ్లుచున్నాను. నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాననెను. ఇతడు చూడండి. ఐదు జతల యెడ్లను పరీక్షించకుండానే కొన్నాడట. ఇప్పుడు పరీక్షించ వెళ్లుచున్నాడట.
మరియొకడు - నేనొక స్ర్తిని వివాహము చేసికొన్నాను. అందుచేత నేను రాలేననెను. తన భార్యను కూడా విందుకు తీసుకువెళ్లవచ్చు గదా. కాదంట. చూడండి మూడు రకాల సాకులు ఎలా చెప్పారో.
యజమానుని మీద సాకు - చూడండి. ఒక తలాంతు తీసికొనిన వాడును వచ్చి ‘అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవును చల్లని చోట పంట కూర్చుకొనువాడవునైన కఠినుడవని నేనెరుగుదును. గనుక నేను భయపడి వెళ్లి నీ తలాంతును భూమిలో దాచి పెట్టితిని, ఇదిగో నీది నీవు తీసికొనుమని చెప్పెను. అందుకు అతని యజమానుడు దానిని చూచి - సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తనిచోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడ నా సొమ్ము తీసికొని యుందునె అని చెప్పి, ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి పది తలాంతులు గలవాని కియ్యుడి. కలిగిన ప్రతి వానికియ్యబడును. అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి అతనికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను - మత్తయి 25:24-30.
ఉపచారము - సహాయము చేయకుండా చెప్పే సాకు
ప్రభువు చెప్పిన మాట - నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపమని. అయితే ఆకలి గొనిన వానికి ఆహారము దప్పిగొనిన వారికి దాహమివ్వటం పరదేశులను చేర్చుకోవటం దిగంబరికి బట్టలివ్వటం రోగిని దర్శించడం చెరసాలలో ఉన్నవారిని పలుకరించటం దేవుని ఉద్దేశం. అల్పులైన వారికి చేస్తే ప్రభువుకు చేసినట్లే. అంటే ఆయన రూపులో చేయబడ్డాము గనుక ఆయన ఆజ్ఞ ప్రకారము చేసినట్లయితే ఆయనను గౌరవించినట్లే. అంటే ప్రభువుకు చేసినట్లే అవుతుంది. చేయకపోతే ఇక చెప్పేదేముంది. కానీ ఎప్పుడు ఆకలిగొన్నావయ్యా ఎప్పుడు దాహము గొన్నావయ్యా ఎప్పుడు చెరసాలలో ఉన్నావయ్యా అని అడిగితే - అల్పులైన వారికి చేస్తే నాకు చేసినట్లేనని చెప్పాడు. వారికి చేయని వాడు నాకు చేయనట్టే - నా మాట విననట్టేనని ప్రభువు వారి సాకును కొట్టిపారవేశాడు.
బంగారు దూడను ఎందుకు చేశారని అహరోనును మోషే అడిగినప్పుడు అతని సాకు చూడండి ఎలా ఉందో, చిన్నపిల్లల కన్న హీనంగా ఉంది. ఎందుకో ఏదో ఒక సాకు చెప్పాలని, ఏదో ఒకటి చెప్పి పట్టుబడతారు గానీ ఉన్నదున్నట్టు సత్యాన్ని వెంటనే చెప్పలేక పోతున్నారు. పోలీసుల వద్దనైతే నాలుగు తగిలితేగాని సత్యము బయటకు రావటం లేదు. కారణం అవ్వ ఆదాముల పాపమే.
వారు చేసిన ఆ దూడను బట్టి ఇశ్రాయేలు ప్రజల మీదికి గొప్ప పాపము వచ్చింది. మరి ఇంత గొప్ప పాపము వారి మీదకు వచ్చేటట్లు ఈ పాపపు పని చేయుటకు వారు ఏమి చేశారు అనగా - అహరోను - నా యేలినవాడా నీ కోపము మండనీయకుము. ఈ ప్రజలు ఎటువంటి వారో నీవెరుగుదువు గదా, మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము, మోషే యేమాయెనో మాకు తెలియదు. ఎక్కడకు వెళ్లాడో తెలియదు. కాబట్టి ఒక దేవతను చేయమనగా, వారి యొద్ద ఉన్న బంగారము తెప్పించి అగ్నిలో వేయగా ఈ దూడ తయారైంది. అంతేగాని నాకు ఏమీ తెలియదు, వారు చేయమన్నారు. నేను చేశాను అంతే అని ఎంత చక్కని అబద్ధమాడాడో చూడండి. అసలు జరిగిన సంగతి ఏంటో నిర్గమ 32:4లో చూడండి. ‘అహరోను, వారి యొద్ద బంగారము తీసికొని పోగరుతో రూపమును ఏర్పరచి దానిని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలు ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అనిరి’ చూడండి అసలు సంగతి. వారి యొద్దఉన్న బంగారమంతా పోగేసి, పోత పోసి దూడను చేసిన అహరోను ఎవల్యూషన్ థియరీలా ఎంత చక్కగా చెప్పాడో గదా. జీవము లేని కొన్ని ఆర్గానిక్ కెమికల్ వల్ల జీవము మొదలైనట్లు, బంగారమంతా ఊడదీసి అగ్నిలో వేయగా ఈ దూడ అయ్యిందని అహరోను చెప్పాడు. వాస్తవానికి వారిలో ఉన్న దూడ జ్ఞాపకాలతోనే ఈ దూడను తయారుచేసికొని, మాకు ఏమీ తెలియదు. బంగారాన్ని అగ్నిలో వేస్తే దూడలా అయిందని చెప్పారు. ఇక్కడ చూడండి - సాకు అబద్ధము కలిపి ఎంత ధైర్యంగా చెప్తున్నాడో. అందుకే ఆ దినాన సుమారు 3వేల మంది కూలిపోయారు. జాగ్రత్త! సాకులు అబద్ధాలు చెప్పి మనుషులను మోసము చేయవచ్చేమో గానీ దేవునిని మోసము చేయాలనుకోవటం శుద్ధ తప్పు. అందుకే సర్వం ఎరిగిన తండ్రి ముందు సాకులు, అబద్ధాలు చెప్పకుండా జరిగింది జరిగినట్టు, చేసింది చేసినట్టు చెబితే క్షమిస్తాడు, క్షమించటానికి సిద్ధ మనస్సుగల దేవుడు మన యేసయ్య.
గాడిదలను వెతకటానికి వెళ్లిన సౌలును ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజలకు రాజునుగా చేస్తే, అతడు చెప్పిన సాకును చూడండి.
సమూయేలు అతనితో - నీవు చేసిన పని యేమని అడిగెను.
అందుకు సౌలు - జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు, అనుకున్న సమయానికి నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిర్మషులో కూడియుండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించితిననెను. అందుకు సమూయేలు ఇట్లనెను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి, నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు’ - 1 సమూ.13:12-13.
చూడండి చక్కని సాకు చెప్పినా, సౌలు రాజ్యం నిలువలేదు. అధికారము పోయింది. సౌలుకు భక్తునితో దేవాది దేవునితో సహవాసము పోయింది.
కరోనా వైరస్ కంటికి కనపడదు కాని మైక్రోస్కోప్‌లో ఎంత చక్కగా ఉందో ప్రపంచమంతా చూస్తున్నారు. మనకు కనపడనంత మాత్రాన అది లేదని అనగలమా? అలాగే ఆత్మ స్వరూపియైన దేవుడు మనకు కనపడనంత మాత్రాన ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదు. ఇష్టమొచ్చినట్లు జీవించకూడదు. ప్రభువు తన భక్తులతో మాట్లాడి మానవాళికిచ్చిన కట్టడలు మనము నెరవేర్చాలి. వాటి ప్రకారము జీవిస్తూ ఆయన కిష్టులమైనప్పుడు తప్పక ఆయనను చూసేటువంటి ఆత్మీయ స్థితికి రాగలము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనపడనంత మాత్రాన లేడని అనుకోవటం, మన తప్పుడు పనులు చూడటం లేదు అనుకోవటం, ఎలాపడితే అలా సాకులు చెప్పాలనుకోవటం క్షమించరాని తప్పే. ఫలితం అనుభవించాల్సిందే.
మోషేని చూద్దాం. ఆయనను ప్రభువు ప్రత్యేకముగా ఎన్నుకొని ప్రత్యేకముగా రాచమర్యాదలతో పెంచి పెద్దవాడిని చేసి, తన ప్రజలను విడిపించమని వారి బానిసత్వము నుండి తప్పించమని చెప్పినప్పుడు, మోషే చెప్పిన సాకులు ఎలా ఉన్నవో చూడండి. ఒకసారేమో - నేనెంతటి వాడనయ్యా అంతమంది ఇశ్రాయేలీయులను నడిపించటానికని, ఇంకొకసారి - వారు నా మాట వినరని, మరియొకసారి నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని సృష్టికర్తతోనే చెప్పుచున్నాడు. వాస్తవానికి లూకా వ్రాసిన అపొ.కార్యములు 7:22లో చూస్తే ‘మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటల యందును కార్యముల యందును ప్రవీణుడైనవాడని’.
అంత పెద్దాయనే సాకులు చెప్పినప్పుడు మనదేముందిలే అనుకోవచ్చు. కానీ కొన్ని లక్షల మందిని బానిసత్వము నుండి, దుఃఖము నుండి కష్టాల నుండి విడిపించటానికి ప్రభువే తోడుగా నుంటానని చెప్పి, ప్రభువు తోడుగా ఉంటే మన శక్తి ఎలా ఉంటుందో చూయించి, మోషే ద్వారా లక్షలాది మందిని విమోచించిన దేవుడు ఇప్పుడు మనకు తోడుగా ఉండి అద్భుతముగా వాడుకోవాలని పిలిస్తే దయచేసి సాకులు చెప్పకుండా ముందుకు సాగితే, లక్షల మందినో వేల మందినో వందల మందినో రాబోయే ఉగ్రత నుండి, నరకము నుండి తప్పించిన వారవౌతాము. వాస్తవానికి ఈ లోకములో కొంతకాలముండే బానిసత్వము, కష్టాలు, దుఃఖమును, నరకపు ఆరని అగ్నితో పోలిస్తే తక్కువే. ఆ అగ్ని నుండి అనేకులను, తోటివారిని నీ స్నేహితులను బంధువులను రక్షణ లోనికి నడిపించటానికి మనలను పిలిస్తే సిద్ధంగా ఉందాము. మేము సిద్ధమేనని ప్రభువుకు తెలుపుదాము. అనేకుల త్యాగ ఫలితంగా మనము ప్రభువును తెలుసుకొన్నాము. అలాగే రక్షించబడిన మన జీవితాలు అనేకులను రక్షణలోనికి నడిపించేవిగా ఉండాలని నా ప్రార్థన.
అలా స్వచ్ఛందంగా దేవుని సేవకు వచ్చినవారు.
యెషయా: నేనున్నాను నన్ను పంపమని ముందుకు వచ్చాడు.
దావీదు: దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును - కీర్తనలు 51:14.
నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను పాపులును నీ తట్టు తిరుగుదురు - కీర్తనలు 51:12-13.
అబ్రహాము - పిలిచిన వెంటనే ఎటువంటి సాకు చెప్పకుండా 100 సం.లకు పుట్టిన కుమారుని బలి ఇవ్వటానికి వెనుకాడలేదు.
పౌలు - ప్రభువా నేనేమి చేయవలెనని అడిగి, ప్రభువు సేవకు జీవితాన్ని సమర్పించుకున్నాడు.
మన కొరకు ప్రాణము పెట్టిన ప్రభువు పిలుపునకు లోబడి ఆయన ఇచ్చే ఆశీర్వాదము అందరం పొందుకొని ఆయురారోగ్యాలతో ఉండటానికి పరిశుద్ధాత్ముడు సహాయము చేయునుగాక.