ప్రార్థన

తగ్గింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవుని సేవలో మొట్టమొదటి మెట్టు తగ్గింపు.
తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకోను ప్రతివాడును హెచ్చింపబడునది. (యేసు) చెప్పెను టీ.కా.14:11
అలాగని అతి చేయకోడదు.అందును గురించే తెలుగులో ఒక సామెత ఉంది. ‘‘అతి వినయం ధూర్తలక్షణం’’ అని. వినయంగా ఉండాలి మనస్థితితో మనముండాలి అంతేగాని మనుష్యుల ముందు అతిగా తగ్గించుకొన్నట్టు చేసినప్పుడు అది అతి తగ్గింపా లేక తగ్గింపాయనకు తెలుస్తూనే ఉంటుంది. పోలీసులకు చిక్కిన దొంగల తగ్గింపు ఇంత అంత కాగా, అలాగే కోర్టులల్లో జడ్జి ముందుకు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎంతగా తగ్గించుకుంటారంటే, వీలైతే నెక్‌బటన్ కూడ పెట్టుకుంటారు. వాళ్ళు ఒక్కసారి బయటకు వస్తే వాళ్ళ పరిస్థితి మనకు తెలియనిది కాదు. అందుకే అతి వినయం అస్సలు మంచిది కాదు. అలా ఉండేవారు చాల ప్రమాదకరమైన వారని ఈ సామెత మనకు వచ్చింది. ధూర్తులైన వారు అతిగా తగ్గించుకున్నట్టు చేసి ఎదుటి వారిని మోసము చేస్తారు.
బైబిల్ చెప్తున్న మాట తన్ను తాను హెచ్చించుకొనకూడదని. అది కూడ కొందరికి ఆకాశమే హద్దు. ఉభ్నది లేనిది కలిపి చెప్తునే ఉంటారు. అసలు వాస్తవానికి హెచ్చించుకోవటానికి మనదగ్గర ఏముందని. దేవుడు పిలిస్తే అన్ని వదలి వెళ్ళవలసిన వారమేగదా! సర్దుకోటానికి సమయము కూడ ఉండదు. అన్ని వదలి వెళ్ళవలసిందే. వాస్తవానికి పాపము చేసిన వెంటనే, వారు దేవుని సహనాన్ని, ఆయన రూపును, అధికారాన్ని ఏదేనా వనమును కోల్పోయారు. మిగిలింది ఏమీ లేదు. ఆత్మీయంగా చనిపోయారు. శరీరకంగా ఉన్నారంటే, దేవుడు తను ఇచ్చిన ప్రాణాన్ని తీసివేసుకుంటే మిగిలేది మనె్న... మన్నయినది చివరకు మన్నయి పోవును. ఇది సత్యము. రాజులేంటి, అధికారులేంటి ఆడ మగ తేడా లేదు. సర్వశరీరుల గతి అదే. ఏ దేశస్తులైన ఇదే సంగతి.
దేవుని శక్తిని ఎరిగి, ఆయన జీవాదిపతి అని తెలిసిన తరువాత, తాను ఇచ్చిన ప్రాణం చివరకు ఆయన ఇష్టప్రకారము తీసివేసుకుంటాడని తెలిసిన తరువాత మన విలువ ఎక్కడ ఉందో అర్ధం చేసుకొని, జీవాదిపతి ముందు తగ్గించుకొని ఉండాల్సిందే. ఈ విషయం తెలియనివారు రెచ్చిపోతుంటారు. ఆకాశానికి నిచ్చెనలు వేయటానికి ప్రయత్నాలు చేస్తుంటారు.
నోవా కాలములో నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పవైనది. వారి హృదయాలలో తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు, దేవుడు గమనించాడు. అయితే ఆ కాలములో నోవా మాత్రము నీతిమంతుడై ఉండటనుబట్టి దేవుడు, ఆయనకు ఓడను నిర్మించుకొని రాబోయే జలప్రళయమునుండి తప్పించుకోవలసినదిగా చెప్పినప్పుడు, దేవుడిచ్చిన కొలతల ప్రకారము ఓడను నిర్మించి, తాను తన కుటుంబము మాత్రము ఆ గొప్ప ప్రళయము నుండి తప్పించుకోగలిగారు. అలా తప్పించుకొని భూమియందంతట ఒకే భాష కలిగి ఉన్నారు. వారు షినారు దేశములోని మైదాన ముందు నివసించుచు ఆకాశము నంటువరకు ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని వారందరు తలంచారు. ఎందుకో పేరుప్రఖ్యాతులు కావాలని మనిషి ఆరాటపడుతూ ఉంటాడు. దానికోసం ఎంతకైనా తెగిస్తాడు. ఏదైన చేయటానికి సిద్ధపడతాడు. దానివల్ల వచ్చిన లాభంయేంటి దేవుడు వారి ఆలోచనలను తారుమారుచేసి, వారి భాషను తారుమారు చేసేడు, కనుక అక్కడనుండి వారిని భూమియందంట, చెదరగొట్టెను. అప్పుడు జనాలు భూమియందంతట చెదరిపోయిరి.
నోవా ఓడను నిర్మించడానికి సుమారు 100 సంవత్సరాలు పట్టి ఉండవచ్చని అంచనా. వాస్తవానికి ఆ దినాలలో వర్షాలు లేవు. వర్షాలు పడటం ఆ జనులు అప్పటివరకు ఎన్నడు చూడలేదు గనుక, అప్పటి జనులు నోవా చెప్పిన సువార్తను నమ్మలేదు. ఇప్పటివరకు వర్షాలు లేవు గదా! వర్షాలు వస్తాయంట మనలను ముంచేస్తవట అని హేళన చేసారు. అయినా వారి హేళనలను లెక్కచేయకుండా నోవా మాత్రము ఓడను కట్టుట ఆపలేదు. వారితో ఈ వార్తను తెలియచేయటం మానలేదు. దేవుని నమ్మిన నోవా ఆయన కుటుంబములు రక్షించబడింది. ఎప్పుడు మనకే యన్ని తెలుసు అనుకోకూడదు. ఇతరులను తక్కువా అంతనా వేయకూడదు. తక్కువ చేయకూడదు. అల్పులైన వారికి సహాయగా ఉంటానంటున్నాడు.
వాస్తవానికి ఆదాము బ్రతికిన సంవత్సరములు తొమ్మిది వందల ముప్పది ఏండ్లు. తన కుమారుడు షేతు తొమ్మిది వందల పండ్రెండేండ్లు. ఆ తరువాత వారి సంతానం వారు ఎనిమిది వందల ఎండ్లు, పది వందల ఏండ్లు, యెరెడు తొమ్మిది వందల అరువది రెండేండ్లు బ్రతికారు. తరువాత వారి ప్రవర్తన వలన అక్రమ కార్యాలనుబట్టి నరుల దినములు నూట ఇరువది సంవత్సరాలకు దేవుడే తగ్గించాడు. సంవత్సరాలు పెరిగేకొద్ది పాపము పెరుగుతోంది కాని తరుగుట కాదు కనుక కీర్తన 90:10 ప్రకారము నరుని ఆయుషును డెబ్బది సంవత్సరాలకు ఇంకా ఉంటే ఎనబది సంవత్సరాలకు కుదించినట్లు తెలుస్తుంది. దానికి మించినది ఆయాసము ప్రయాసయె.
సరె ఈ హెచ్చించుకొనె మనసు ఎక్కడనుండి వచ్చిందా అని చూస్తే యోషయా గ్రంథము 14వ, అధ్యాయము 13నుండి 15 వచనములో ‘‘నక్షత్రములకు పైగా నా సింహసనములను హెచ్చింతును ఉత్తర దిక్కున ఉన్న సఖా పర్వతము మీద కూర్చుందును. మేఘ మండలము మీది కెక్కుదును. మహాద్నతునితో నన్ను సమానునిగా చెనికొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా? నీవు పాతాళమునకు ఒక మూలకు త్రోయబడితివే.
నేను సర్వోన్నతునితో సమానునిగా చెసికొందును, నా సింహాసనమును హెచ్చించుకొందును. అనుకున్న పాతాళం వాటి అనుచరులు ఉన్నత స్థలమునుండి త్రోసివేయబడ్డారు. అదే మనసు కలిగిన మనుషుల గతి అంతే ఉంటుంది గదా! అన్వ ఆదాముకు దేవుడు చెయ్యనిదేమిటి. ఇయ్యనిదేమిటి అయినా సర్పము మాట్లాడిన మేయుకి మాటలకు పడిపోయింది. ఇక్కడ ఇంకొక సంగతి గ్రహించాలి. మన స్నేహము ఎవరితో ఉంది. దేవుని ప్రేమ మాటలు చెప్పేవారితోనా, లేనిపోని మాటలు కల్పించే వారితోనా, జాగ్రత్తగ చూసుకోవాలి. లేనిపోని మాటలు మాట్లాడే సర్పముతో సహవాసము ఎన్నాళ్ళు అవ్వ చేసిందో తెలియదు గాని, అవ్వ కూడ లేనిపోని మాటలు మాట్లాడటం మొదలుపెట్టింది.
ప్రభువు చెప్పిన మాట:- అయితే మంచి చెడ్డల తెలివినిచ్చ వృక్షఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదనని నరునికాజ్ఞాపించెను ఆది 2:17. అయితే 3వ అధ్యాయములో 3వ వచనములో సర్పములతో అవ్వ చెప్పిన మాటలు చూడండి ‘‘అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు- మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్ట కూడదనియు చెప్పెను’’ ముట్టకోడదు అని దేవుడు చెప్పలేదా కాని సర్ప సహవాసములో అధికంగా మాట్లాడటం అవ్వ నేర్చుకొంది. దేవుడు చెప్పని మాటలు కూడ చెప్పెడని అబద్ధమాడింది.
అందుకే కీర్తన కారుండు తన వ్రాసిన మొదటిలోనే
దుష్టుల ఆలోచన చొప్పన నడునాక
పాపుల మార్గమున నిలువన్
అపహసకులు కూర్చుండుచోట కూర్చుండక అని వ్రాసాడు.
ఎవరితో సహవాసము చేస్తున్నామో గ్రహించాలి, అయినా సాటియైన సహయము తోడుగా ఉంటే వేరే వాళ్ళతో ముచ్చట్లు ఏంటి, వాళ్ళ ఆలోచనలతో పని ఏంటి, రోజు చల్లపూట దేవుడే వచ్చి మీతో సహవాసము చేస్తున్నాడుగదా? అంతకు మించింది ఏంటి. చూడండి మానవుని చూడటానికి చల్లపూట దేవుడు వారి యొద్దకు వచ్చేవాడు. అయితే ఇప్పుడు వీలైనన్నిసార్లు మనమే ఆయన సహవాసము కొరకు ప్రత్యేక సమయమివ్వాలి. దేవుని బిడ్డలు, భక్తులు ప్రక్తలు దినమునకు మూడుసార్లు ప్రార్ధించేవారు. ఈ దినాలలో ఒక్కసారి ప్రార్థనలో దేవునితో సహకరించటానికి కుదరనంతగా మనుషులు పనులు కల్పించుకుంటున్నారు. అంత గొప్ప రాజే దినమునకు మూడుసార్లు ప్రార్థించేవాడంటే మనమెన్నిసార్లు చేయాలో గదా? దేవుడిచ్చిన జీవితం, దేవుడిచ్చిన ఉద్యోగాలు, దేవుడిచ్చిన కుటుంబాలు, కాని ఇచ్చిన దేవుని సన్నిధికి వెళ్ళలేక పోతున్నారు. ఉద్యోగాలు లేదా ఆస్తులు కాదు పదవులు కాదు కుటుంబాలు కాదు, ఈ లోకములో ఏది దేవుని సహవాసానికి మనలను దూరపరచకూడదు.
లోకములో సహవాసము చేస్తున్నామంటే లేనిపోని మాటలు, అవసరమైన మాటలు వింటాము మాట్లాడుతాము గనుక దేవునితో ఎక్కువ సహవాసము కలిగి ఉండాలి. అప్పుడే ఆయన మాటలు ఆయన ఆశీర్వాదము మనకు వస్తుంది.
అవ్వ, సాతానుతో సహావాసము చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించింది, ఆజ్ఞ అతిక్రమమే పాపము గనుక పాపములో పడి పోయింది. దేవుడు వాస్తవానికి వారికి ఏదేనా తోట మీద పూర్తి అధికారాలు ఇచ్చాడో, అయినా ఆశ కలిగింది. ఇంకా ఎదగాలని మోసపోయింది. దేవుని సహవాసము పోయింది. ఏదేను తోట నుండి వెలివేయబడ్డాడు. మొదలుకే మోసము వచ్చింది. ఇక అక్కడనుండి మొదలైన ఆశ ఇంకా ఆరలేదు. ఒకరికి మించి ఒకరు ఎదగాలని, ఉన్న దానికన్న మించి పోవాలని లోకమంతా ఆరాటపడుతుంది. అసలు సంగతి తన్నుతాను హెచ్చించుకోవాలనే ఆశ సాతానుడిదె, మనిషి సాతానుతో చేసిన సహవాసాన్ని బట్టి మనిషికి కూడ ఈ ఆశ అంటుకొంది. హెచ్చులకోసం పోయి ఉన్న దానిని కూడ సంతోషించలేకపోతున్నారు.
రాజు ఎదుట డంబము చూపకుము. గొప్పవారున్నచోట నిలువకుము. నీ కన్నులు చూచిన ప్రధాని మొదలు ఒకడు నిన్ను తగ్గించుట కంటె- ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా! 25:6.7
యాకోబు పత్రిక నాల్గవ అధ్యాయము పదవ వచనములో చెప్పబడిన మాట ‘‘ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడే ఆయన మిమ్మును హెచ్చించును.

- మద్దు పీటర్ 9490651256