రాష్ట్రీయం

పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు ఏలేటి అశిష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, నవంబర్ 30: ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తన కుటుంబంతో కలిసి నివాసముంటూ వైద్య విద్యను అభ్యసిస్తున్నప్పటికీ, భారతీయ మూలాలు కలిగి ఉండి నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడైన ఏలేటి అశిష్ పవర్ లిఫ్టింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికవడంతో స్థానిక క్రీడాకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 2016 జూన్‌లో అమెరికాలో జరుగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు ఆయన ఆస్ట్రేలియా నుండి ప్రాతినిథ్యం వహించనున్నారు. 23 ఏళ్ల వయస్సు, 93కిలోల బరువు కేటగిరిలో అశిష్ తలపడనున్నాడు. బాల్కొండ మండలం వెంచిర్యాల గ్రామానికి చెందిన ఏలేటి వినోద్, ఏలేటి ఉమశ్రీల సంతానం అశిష్. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఏలేటి వినోద్ గత చాలాకాలం క్రితమే ఆస్ట్రేలియాలోని సిడ్నీలో స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే ఏలేటి అశిష్ కూడా ఆస్ట్రేలియాలోనే తన విద్యాభ్యాసం కొనసాగించాడు. ప్రస్తుతం ఆయన క్విన్స్‌ల్యాండ్‌లోని బాండ్ యూనివర్శిటీలో మెడిసిన్ కోర్సును అభ్యసిస్తున్నాడు. అయితే ఆస్ట్రేలియాలో అత్యంత ఆదరణ ఉన్న పవర్ లిఫ్టింగ్ క్రీడపై ఆసక్తిని ఏర్పర్చకున్న అశిష్ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం ఆ దేశం తరఫున ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలలో పాల్గొనేందుకు అర్హత సాధించడంతో ఆయన మూలాలు ఉన్న వెంచిర్యాల గ్రామంలోనే కాకుండా జిల్లాకు చెందిన క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ సమాఖ్య ఆమోదించిన తొలి భారతీయ మూలాలు కలిగి ఉన్న క్రీడాకారుడిగా అశిష్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. పవర్ లిఫ్టింగ్‌తో పాటు రగ్బీలోనూ ప్రవేశం ఉన్న అశిష్ తాను విద్యనభ్యసిస్తున్న యూనివర్శిటీ జట్టు తరఫున ఈ ఆటలో ప్రాతినిథ్యం వహించడం విశేషం. వచ్చే ఏడాది జూన్‌లో అమెరికాలో జరుగనున్న పవర్ లిఫ్టింగ్ ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లో ఆయన అద్భుత ప్రతిభను కనబర్చాలని ఆశిద్దాం.