రాష్ట్రీయం

పోలీస్ డ్యూటీ మీట్‌లో ఏపి ఘనత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: హర్యానాలోని పంచుకలలో ఇటీవల జరిగిన 59వ అఖిల భారత పోలీసు డ్యూటీ మీట్‌లో భాగంగా నిర్వహించిన ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ 5కిలోమీటర్ల ఈవెంట్, క్రైమ్ సీన్ ఫొటోగ్రాఫిలో ఏపి పోలీసుకు చెందిన ఇద్దరు పోలీసులు స్వర్ణ పతకం సాధించారు. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1వరకు జరిగిన ఈ మీట్‌లో వెస్ట్ గోదావరికి చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ యు.లక్ష్మినారాయణ, హేడ్ కానిస్టేబుల్ ఎం.తులసి చైతన్యలు చక్కటి నైపున్యతను ప్రదర్శించి క్రైమ్ సీన్ ఫొటో గ్రాఫి, ఓపెన్ స్విమ్మింగ్‌లో స్వర్ణ పతకం సాధించారు. అదే విధంగా సబ్ ఇన్‌స్పెక్టర్ షేక్ సమీయుల్లా క్రైమ్ సీన్ ఫొటోగ్రాఫిలో, కానిస్టెబుల్ ఎంకె ఉదయ్‌కిరణ్ ఆటోమెటేషన్ టెస్ట్ ఇన్ కంప్యూటర్ ఆవర్‌నేస్‌లో, వి.రవి ట్రెక్కింగ్ టెస్ట్ ఇన్ డాగ్ స్క్వాడ్ పోటీలో తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సాధించారు.