రాష్ట్రీయం

పోలీసు శాఖకు అధిక నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెక్నాలజీ అభివృద్ధికి రూ. 20కోట్లు
31కోట్లతో సిటిజెన్ సెంట్రిక్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్
రూ. 58కోట్లతో సిసి కెమెరాల ఏర్పాటు
ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది

హైదరాబాద్, డిసెంబర్ 7: తెలంగాణ పోలీసు శాఖలో టెక్నాలజీ అభివృద్ధికి, వ్యవస్థీకృత నేరాల అదుపునకు, నేరస్థుల డేటా సేకరణకు ప్రభుత్వం ఇతోధిక నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని పోలీసు స్టేషన్ల ఆధునికీకరణకు, ఆధునిక సాంకేతికతో కూడిన వస్తు సామగ్రి కొనుగోళ్ల నిమిత్తం రూ. 20కోట్లు, సిటిజెన్ సెంట్రిక్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కోసం రూ. 31 కోట్లు, నగర వ్యాప్తంగా సిసి కెమెరాల ఏర్పాటుకు గానూ రూ. 58, 58, 69,000లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
2015-16 ఆర్థిక సంవత్సరానికి గానూ మంజూరైన నిధులతో వ్యవస్థీకృత నేరాల అదుపుతోపాటు పాత నేరస్థుల గుర్తింపు, వారి వివరాల సేకరణ, సిబ్బందికి శిక్షణ, ఆధునిక వస్తు సామగ్రి కొనుగోళ్లకు ఈ నిధులను వెచ్చిస్తారు.