రాష్ట్రీయం

జోరుగా పందెం పుంజుల విక్రయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 10: సంక్రాంతి కోడి పందాలకు పందెం పుంజు కాలు దువ్వింది. గోదావరి జిల్లాల్లో గత రెండు రోజులుగా పందెం పుంజుల విక్రయాలు జోరందుకున్నాయి. ప్రస్తుత సీజన్‌లో డేగ, నెమలి, పర్లా పుంజులకు మరింత డిమాండ్ పెరిగింది. పందెంరాయుళ్లు వీటి కోసమే పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, పాలకోడేరు, ఆకివీడు, అయిభీమవరం, ఆచంట తదితర ప్రాంతాల్లో విపరీతంగా పర్యటిస్తున్నారు. గతేడాది ఈ రకాల పుంజులు పందెంలో గెలిచి పందెంరాయుళ్లకు లాభాన్ని చేకూర్చాయి. రెండు రోజుల క్రితం డేగ రూ.5వేలు పలుకుతుండగా, ప్రస్తుతం రూ.8వేలకు చేరుకుంది. ఇక నెమలి, పర్లా కూడా అవే ధరలకు దొరుకుతున్నాయి. సంక్రాంతి కోడిపందాలకు ఇంకా నెలరోజుల గడువు ఉండటంతో వీటి ధర అత్యధిక ధరకు చేరుకోవచ్చునని పందెంరాయుళ్లు భావిస్తున్నారు.
(చిత్రం) కోడి పుంజులు విక్రయిస్తున్న దృశ్యం