Others

పాటపాడిన అంజలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్యకాలంలో సినిమా తారలు నటులుగా ఓవైపు మెప్పిస్తూనే మరోవైపు గొంతు సవరించుకుంటూ గాయకులుగా కూడా ఆకర్షిస్తున్నారు. ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది పవన్‌కళ్యాణ్. ప్రతి సినిమాలో ఏదో పాటతో ఆకట్టుకునే ఆయనను చాలామంది హీరోలు ఫాలో అవుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్, నారా రోహిత్ లాంటి వారు పాటలు పాడి ఆకట్టుకున్నారు. హీరోయిన్లు కూడా సింగర్స్‌గా తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడీ లిస్టులో చేరింది తెలుగు భామ అంజలి. హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈమె తాజాగా ఓ చిత్రంలో పాట పాడింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న అంజలి చిత్రాంగద చిత్రంలో నటిస్తోంది. లేడీ ఓరియంటెడ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అశోక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాకోసం అంజలి పాడిన పాటను ఇటీవలే చెన్నయ్‌లో సెల్వగణేష్ నేతృత్వంలో రికార్డ్ చేశారు.