Others

శ్రీమంతుడు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారని పల్లె మనస్తత్వాల మీద కోపంతో పట్టణానికి వలసొచ్చి ఆగర్భ శ్రీమంతుడిగా ఎదిగిన తండ్రి. పట్టుగొమ్మలైన పల్లెలో మూలాలు వెతుక్కునేందుకు పట్టణం వదిలిపెట్టిన కొడుకు. ఈ రెండు జీవితాల మధ్య నడిచే కథలో సామాజికాంశం -ఊరు దత్తత. క్లుప్తంగా చెప్పుకుంటే శ్రీమంతుడు సినిమా ఇది. సినిమాకు కావాల్సిన కమర్షియాలిటీని జొప్పిస్తూ సామాజిక ఇతివృత్తాన్ని తెరకెక్కించిన దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమా అంటే నాకు చాలా చాలా ఇష్టం.
మహేష్‌బాబు, శృతిహాసన్ జోడీగా తెరకెక్కిన సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. హర్షవర్దన్ (మహేష్‌బాబు) తండ్రి రవి (జగపతిబాబు) బిజినెస్ టైకూన్. పల్లె జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల కారణంగా -జీవితంలో డబ్బు సంపాదనే ముఖ్యమన్న పరిస్థితికి వస్తాడు రవి. వ్యాపార బాధ్యతలు చూసుకోమని హర్షను వత్తిడి చేసినా వాయిదా వేస్తుంటాడు. హాయిగా జీవితాన్ని లాగేస్తోన్న హర్షకు -రూరల్ డెవలప్‌మెంట్ చదువుకోసం ఉత్తరాంధ్రలోని దేవరాపల్లి నుంచి వచ్చిన చారుశీల కనెక్టవుతుంది. ఆమెతో పరిచయం ప్రేమగా మారుతున్న క్రమంలో -తమ ఊరిపై కోపంతో వచ్చేసిన రవి కొడుకే హర్ష అని ఆమెకు తెలిసి దూరం పెడుతుంది. ఇది కథకు ట్విస్ట్. పల్లెను పట్టించుకోని కుటుంబంలోకి తాను రాలేనని చారుశీల చెప్పడంతో -మూలాలను వెతకడానికి వెళ్తాడు హర్ష. అలా దేవరాపల్లిలోకి అడుగుపెట్టిన కథానాయకుడు ఏం చేశాడు? ఆ ఊరి పరిస్థితిని ఎలా మార్చగలిగాడు? అన్నది మిగతా కథ. ఊరిని బాగు చేయలేక నిస్సహాయంగా తండ్రి పట్టణానికి వచ్చేస్తే -పట్టణం నుంచి వెళ్లి పల్లెను బాగు చేసుకున్న కొడుకు కథ శుభంగా ముగుస్తుంది. సింపుల్ సెటప్‌తో భారీ సినిమాను చూపించి ఆడియన్స్‌ని సంతృప్తిపర్చటంలో దర్శకుడు కొరటాల విజయం సాధించాడు. -ఓ మంచి సినిమా చూశామన్న భావన ఆడియన్స్‌కి కలుగుతుంది. ఓహో శ్రీమంతుడా.. అంటూ సాగే టైటిల్ సాంగ్ కథ లక్ష్యాన్ని చెప్పడంలో సక్సెస్ అయ్యింది. జతకలిసే, చారుశీల పాటలు బావుంటాయ. ఈకాలానికి తగిన ఓ మంచి సినిమా శ్రీమంతుడు.
-వి.శ్రీ, నరసాపురం