Others

చెంగు చెంగునా ..(నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతుల కడగండ్లు ఎలా ఉంటాయో చాటి చెబుతూ, వారిలో ఏమాత్రం ఈర్ష్య, అసూయ, ద్వేషాలు కానరావని నమ్మిన బంటుగా ఇంట్లో తిరుగాడే జంతువులే మనిషికి అన్నివిధాల సహాయకారులుగా ఉంటాయని చెబుతూ రూపొందించిన చిత్రం -నమ్మినబంటు. అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి, ఎస్వీ రంగారావు, గుమ్మడిల అసమాన నటనా ప్రతిభతో ఈ చిత్రం అప్పట్లో వందరోజుల ఉత్సవాలు జరుపుకుంది. ముఖ్యంగా తెలుగుదేశంలో ఎక్కువ శాతం ప్రజలు రైతులే. వారి ఇంట్లో జరిగిన కథలాగే ఈ చిత్రాన్ని రూపొందించటంతో విజయం వరించింది. చనిపోబోతున్న ఓ ఆవుదూడను సావిత్రి తీసుకొచ్చి ప్రాణాలు కాపాడి తన దగ్గరున్న మరో దూడతో జతకట్టించి ఈ రెండు దూడలు బుడతల్లా చేలల్లో గంతులు వేస్తుంటే ఈ పాట చిత్రీకరించారు.
మనుషులకన్నా పశువులు ఎన్నో విషయాలలో నయమని, కవులెందరో ఎన్నో మాధ్యమాలలో నొక్కివక్కాణించారు. ఇక చలనచిత్ర గీతాలలో. ‘గోవుల గోపన్న’లో పాట ‘వినరా వినరా నరుడా’లో కొసరాజుగారు ఒక ఆవు సేవలను వర్ణించే తీరుగా ఒక మాటలో ‘పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను’అని చెప్పేసారు. అలాగే ‘నమ్మినబంటు’ సినిమాలో మహానటి సావిత్రి, కొసరాజుగారే రచించిన ‘చెంగు చెంగునా గంతులు వేయండీ’ పాటకు అద్భుతమైన అభినయంతో తువ్వాయిలను తోలుతూ చెప్పిన పశుతత్వపు విశేషాలు అమితంగా ఆకట్టుకునేలా ఉంటాయి.
ఈ పాటలో పశువులు పంచభక్ష్యాలు అడగక గప్పెడు గడ్డి, గుక్కెడు నీళ్ళతో తృప్తిచెంది, మనుషులలో కనపడని జాలిని కురిపిస్తూ, పగలనకుండా రేయనకుండా పరోపకారంచేస్తూ తెలుగుతల్లికి ముద్దుబిడ్డలుగా వెలుగొందుతూ జాతి రత్నాలుగా, ఇలవేల్పులుగా పశుసంపద లేనిదే మానవజాతికి బ్రతుకే లేదు అన్నట్లుగా నోరులేని జంతు స్వభావాన్ని, అనితరసాధ్యంగా మనకందించారు కవి కొసరాజు. 1960లో వచ్చిన ‘నమ్మినబంటు’లో నటించిన ఎద్దులు కూడా ఎంతో ఖ్యాతి పొందాయి. ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావు, ఈ పాటకు ప్రాణంపోసిన జీవనాడి శ్రీమతి పి.సుశీల.
- యం.వి.రమణకుమారి, హైదరాబాద్