Others

అదో కొత్త అనుభూతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మెల్లింగ్ సెన్స్‌లేని ఓ అమ్మాయి పాత్ర చేయడం ఓ కొత్త అనుభూతి ఇస్తోందని అంటోంది కేథరిన్ థ్రెసా. సిద్దార్థ్, కేథరిన్ థ్రెసా హీరో హీరోయిన్లుగా దర్శకుడు సాయిశేఖర్ తెరకెక్కించిన చిత్రం -వదలడు. విడుదలకు సిద్ధమవుతోన్న సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడింది థ్రెసా.
నా పాత్ర పేరు జ్యోతి. స్మెల్లింగ్ సెన్స్‌లేని టీచర్‌ని. ఆమెకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయన్నది అసలు ట్విస్ట్. ఈ పాత్ర కొత్త అనుభూతినిచ్చింది.
జ్యోతిది ఓ అప్పర్ మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ. స్మెల్లింగ్ సెన్స్ లేని తనకు భవిష్యత్‌లో పిల్లలు పుడితే -వారి ఆలనా పాలనా ఎలా చూడాలన్న భయంతో ఉంటాను. ఈ నేపథ్యంలో జ్యోతి, ఆమె తండ్రీ మధ్య సిట్యుయేషన్ కామెడీ బావుంటుంది.
సినిమాలో ప్రత్యేకంగా చర్చించిన అంశం కల్తీ ఆహారం. కాన్సర్ ఓ రోగం కాదు, ఓ బిజినెస్ అంటూ హీరో అట్లా కల్తీ చేసేవారిపై యుద్ధం చేయడమే ప్రధానాంశం. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటుగా మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది.
ఇది యూనివర్సల్ అంశం. అందరూ ఫుడ్ తింటున్నారు. వారు తినే ఆహారంలో ఎటువంటి కల్తీ జరుగుతుంది, దాని ద్వారా ఎలాంటి రోగాలపాలవుతున్నారనే అంశాలతో థ్రిల్లర్‌గా చిత్రాన్ని రూపొందించారు.
మీరన్నట్టు ఇది హారర్ చిత్రం కాదు. ప్రేక్షకులకు ఎటువంటి భయమూ ఉండదు. పిల్లలంతా కలిసి చూడదగ్గ యు సర్ట్ఫికెట్ చిత్రం. విత్ యాక్షన్‌తో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఓ 30శాతం సినిమాలో కనిపిస్తాయి. అది చూసి హారర్ అనుకుంటున్నారేమో.
హీరో సిద్ధార్థ్ స్వతహాగా సమాజ శ్రేయస్సు కోరేవారు. ఆయన ట్విట్టర్ ఖాతాలో ఇలాంటి పోస్ట్‌లు పెడుతూంటారు. సమాజంలో జరుగుతున్న అసమానతలపై, ఘోరాలపై ఆయన స్పందిస్తే వెంటనే ట్విట్టర్‌లో మెసేజ్ పెడతారు. ఆయనొక సోషల్ పర్సన్.
మంచి పాత్రలు వస్తే చేయడానికి ఎప్పుడైనా సిద్ధమే. అలా సరైనోడులో ఎంఎల్‌ఏ పాత్ర చేశాను. ఆ పాత్రకు నేను కనెక్టయ్యాను. పైగా సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అలాంటి పాత్రలు వస్తే ఎప్పటికీ వదలను. ఐ లుక్ గుడ్ స్క్రిప్ట్. రిపీట్ పాత్రలు చేయడం అసలు ఇష్టం ఉండదు.
ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్‌లో ఓ మంచి పాత్రలో నటిస్తున్నా. దర్శకుడు క్రాంతిమాధవ్ ఈ పాత్రను అద్భుతంగా డిజైన్ చేశారు. అయితే ఆ పాత్ర గురించి త్వరలో తెలియజేస్తా.
డ్రీమ్ రోల్ ఎప్పుటికప్పుడు కొత్త తరహ పాత్రలు చేయాలనే! నేనొక వెర్సటైల్ యాక్టర్‌ను. డిఫరెంట్ రోల్స్ చేయాలని కోరుకుంటాను. తమిళంలో చేసినవి తెలుగులో చేయడంలేదు. తెలుగులో చేసినవి తమిళంలో చేయడంలేదు. అక్కడి పాత్రలకు, ఇక్కడి పాత్రలకు చాలా తేడా వుంటుంది. ముఖ్యంగా తమిళంలో చేసే పాత్రలకు ఎటువంటి గ్లామర్ ఉండదు. అలాగే ప్రత్యేక పాత్రలు కూడా చేస్తున్నా.
డబ్బింగ్ నేనే చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నా. ఇద్దరు దర్శకులు నీలకంఠ, సంపత్‌నంది ఓకె చేశారు. త్వరలో రానున్న వరల్డ్ ఫేమస్ లవర్‌కూ చెప్పేందుకు ప్రయత్నిస్తా.