Others

కోతి పిల్లని హీరో చేసి వంద రోజులాడిస్తా!( ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబూ చూడూ. ఈ సినిమాలో చెయ్యడం నీ అదృష్టం. కాదంటే ఓ కోతి పిల్లని హీరో చేసి.. బొమ్మతీసి వందరోజులాడిస్తా’ అన్నాడు రాఘవ. ఆయన తరహాలో లౌడ్ ఛాలెంజ్ విసురుతూ. ‘మీ సినిమా వంద రోజులు కాదు రెండొందలు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ నమ్రంగా చెప్పి పంపించాడు శోభన్ బాబు.

ఆయనకు నూటామూడేళ్లు.
తెలుగు సినిమా తల్లికి ఇద్దరు అపూర్వమైన దర్శకుల్ని పరిచయం చేసిన నిర్మాత. ఆ ఇద్దరిలో ఒకరు దాసరి నారాయణరావు. మరొకరు కోడి రామకృష్ణ. ఇద్దరూ శతాధిక చిత్రాల దర్శకులే.
ఇంతకీ ఆ నూటమూడేళ్ల మొండి ఘటం ఎవరో తెలుసా? ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ. మొండిఘటం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఆయన ఎవర్నీ లెఖ్ఖ చెయ్యరు. అనుకున్నది చేసేస్తారు. అవసరమైతే చెయ్యి చేసుకుంటారు. అవసరమనుకుంటే కారు తాళాలు చేతికిచ్చి.. రేపట్నించి దర్జాగా తిరగమంటారు. అందరూ వందకి పది పదులు లెక్కపెడితే... ఆయన రూపాయికి వంద పైసలు లెక్కపెడతాడు. ఖర్చుపెట్టిన ప్రతి పైసా తెరమీద కనిపించాలంటాడు. అదీ నిర్మాతతత్వం. అచ్చంగా, రాఘవతత్వం.
రాఘవ, ఏకాంబరేశ్వరరావు వీరంతా కంబైన్డ్‌గా విజయ్‌భట్ మూవీస్ భట్‌తో కలిసి సినిమాలు చేసేవారు. అప్పట్లో ఒక సీజనంతా యస్వీ రంగారావే హీరో. మొనగాళ్లకు మొనగాడు, జగత్‌జెట్టీలు, జగత్ కిలాడీలు. ఇలా ‘జగత్’మకుటంగా వచ్చిన చాలా చిత్రాలున్నాయి. ఆ చిత్రాలకు రచయితగా పరిచయమైన వ్యక్తే దాసరి నారాయణరావు. దాసరి ఆలోచనలు నచ్చి, కథ చెప్పే విధానం నచ్చి.. ఓ కథకు విపరీతంగా ఆకర్షితుడైన రాఘవ నువ్వే ఈ సినిమా డైరెక్టరువి పో అనేశారు. అంతే, నిర్మాణ పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఆ కథే తాత-మనమడు.
దర్శకుడు సిద్ధంగా వున్నాడు. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే బౌండ్‌బుక్‌తో సిద్ధంగా వున్నాడు. హీరో కావాలి కదా- అప్పటికి కొన్ని సినిమాల్లో చేసిన హీరో శోభన్‌బాబు తప్పకుండా ఒప్పుకుంటాడన్న నమ్మకంతో వున్నాడు రాఘవ. పైగా శోభన్ సౌమ్యుడు. యస్వీఆర్ తాత పాత్రకు ఒప్పుకున్నాడు. సత్యనారాయణ, రాజసులోచన, అంజలీదేవి అంతా ఒప్పుకున్నారు. శోభన్‌బాబు హీరో అనేసరికి విజయనిర్మల కూడా ఒప్పుకుంది. తీరా షూటింగ్ దగ్గరపడుతుంది. రాఘవ శోభన్‌ని కలిసి హాపీగా న్యూస్ చెప్పాడు. అద్భుతమైన కథ.. అద్భుతమైన దర్శకుడు. మనం ఈ సినిమాని ఛాలెంజింగ్‌గా చేద్దామన్నాడు. రాఘవ సహజంగా ఆవేశపరుడు.
కథ వింటున్నపుడు, చెబుతున్నపుడు అద్భుతంగా వుంది. మరి దర్శకుడు కొత్తకదా. ఇపుడిపుడే నేను గ్లామరు పాత్రలేస్తూ లేడీ ఆడియన్సుకి దగ్గరవుతున్నా. బాగా కథ చెప్పిన దర్శకుడు చిత్రాన్ని బాగా తియ్యాలన్న రూలేం లేదుకదా. బాగా తీయనూ వచ్చును. ఎందుకైనా మంచిది. ఈ సినిమావరకూ నన్ను వదిలెయ్యండి. దయచేసి నామీద ఎక్స్‌పెరిమెంట్ చెయ్యకండి’ అంటూ సున్నితంగా తిరస్కరించాడు శోభన్. మరో మాటాడే అవకాశం ఇవ్వకుండా.
రాఘవకి అరికాలి మంట నెత్తికెక్కింది.
వెంటనే ‘బాబూ చూడూ. ఈ సినిమాలో చెయ్యడం నీ అదృష్టం. నువు చెయ్యనంటే ఓ కోతి పిల్లని హీరోని చేసి.. బొమ్మతీసి ఆ బొమ్మని వందరోజులాడిస్తా’. ఆయన తరహాలో లౌడ్‌గా ఛాలెంజ్ విసిరాడు. ‘మీ సినిమా వంద రోజులు కాదు రెండువందలు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ శోభన్‌బాబు వినమ్రంగా చెప్పి పంపించాడు.
ఆ కసితో వెంటనే రాజబాబుని బుక్‌చేసి నువ్వే నా హీరో అన్నాడు. రాజబాబుకేం అర్ధంకాలేదు. విజయనిర్మలకి అంతకన్నా అర్ధంకాలేదు. రాజబాబు హీరో ఏమిటి? నేను హీరోయిన్ ఏవిటి? తనూ శోభన్‌బాబులాగే మరో సినిమా చూద్దాం లెండి’ అంది. అయితే కృష్ణ ఒప్పుకోలేదు. రాఘవ లాంటి నిజాయితీగల నిర్మాత దగ్గర పనిచెయ్యడం మన అదృష్టం, చెయ్యి అన్నారు. ఆ సినిమాకు యూనిట్ అంతా అహర్నిశలూ శ్రమించారు.
దాసరికిది చావుబతుకుల సమస్య. యస్వీఆర్, సత్యనారాయణ. రాజసులోచన, అంజమ్మ అందరూ దాసరిని ఆశీర్వదించారు. సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది. మొదట హీరో కృష్ణ చూశారు. రాఘవని అభినందిస్తూ ‘నువ్వు వంద రోజులాడిస్తానన్నావు. ఈ సినిమా రెండు వందల రోజులకు పైనే ఆడుతుంది. కంగ్రాట్స్’ అంటూ రాఘవని అభినందించాడు. అలాగే రెండువందల రోజులాడింది. ఆ సందర్భంగా 8899 ఫియెట్ కారు (మిరప పండు) కొని దర్శకుడికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. సెంటిమెంట్‌గా దాసరి ఆ కారునే ఉపయోగించేవాడు. ఆ కోతిపిల్ల రాజబాబుతోనే దాసరి ‘ఎవరికివారే యమునాతీరే’ చిత్రం తీసి సూపర్‌హిట్ చేశాడు.

-ఇమంది రామారావు 9010133844