Others

ప్రేమాభిషేకం (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నట జీవితంలో మైలురాళ్లుగా నిలిచిన చిత్రాలన్నీ ప్రేమకథా చిత్రాలే. దేవదాసు, అనార్కలి, ప్రేమనగర్, ప్రేమాభిషేకం.. ఇలాంటి ఎన్నో ప్రేమ కథా చిత్రాలు ఆయన నటనా ప్రావీణ్యాన్ని రుచి చూపించినవే. దర్శకరత్న దాసరి నారాయణరావు మస్తిష్కం నుంచి పుట్టుకొచ్చిన అతిగొప్ప ప్రేమకథా చిత్రం -ప్రేమాభిషేకం.
కథా విషయంలోకి వస్తే రాజేష్ (ఏఎన్‌ఆర్), దేవి (శ్రీదేవి)ని ప్రేమిస్తాడు. ఆమె అతన్ని ఇష్టపడి వివాహం చేసుకోవాలనే లోగా -రాజేష్‌ను ‘క్యాన్సర్’ కబళిస్తుంది. తనమూలంగా ప్రేయసి అకాలంలో విధవరాలు కాకూడదని, పెళ్లిని చెడకొట్టుకుంటాడు. తాగుబోతుగా, వేశ్యావాటికలో తిరిగే సంస్కారహీనుడుగా దేవిని నమ్మిస్తాడు. రాజేష్‌ని అపార్థం చేసుకున్న దేవి, వేరే సంబంధం ఖాయం చేసుకొంటుంది. పెళ్లికై కళ్యాణవేదిక ఎక్కుతుంది. క్లైమాక్స్‌లో నిజం తెలుసుకొంటుంది. నాయకుడు దేహం చాలించే అవసానదశలో వేశ్య జయంతి (జయసుధ) ఇంట్లో ఉంటాడు. చిత్రం విషాదాంతం కనుక, ప్రేక్షకుల గుండెల్లో అక్కినేని నట విశ్వరూపం చివరి ఫ్రేమ్‌లో కళ్లనీరు పెట్టిస్తుంది. పాటలు, మాటలు, దర్శకత్వం దాసరి ప్రతిభకు తార్కాణం. సంగీతం చక్రవర్తి, నేపథ్య గాయకులు ఎస్‌పి బాలు, పి సుశీల. ఏడు ప్రసిద్ధగీతాలు ఉన్నాయి. సినిమాలో జయసుధ (జయంతి) వేశ్య పాత్రలో హైలెట్. శ్రీదేవికి జయసుధకు నడుమ నడచిన సంభాషణ నిజమైన ప్రేమను నిరూపించుకోవటానికి చిత్రికపట్టిన తురుపుముక్కలు. సహజ నటి జయసుధ, అందాల నటి శ్రీదేవి, నటసామ్రాట్ అక్కినేని గురించి చెప్పటం కష్టమేమరి. నా కళ్ళు చెబుతున్నాయి, దేవీ వౌనమా, ఒక దేవుని గుడిలో, కోటప్పకొండకు వస్తానని, తారలు దిగివచ్చిన వేళ, వందనం... అభివందనం, ఆగదూ...ఆగదూ... ఇలా పాటలన్నీ హిట్. ఈ చిత్రం మరికొన్ని ప్రేమ చిత్రాలకు స్ఫూర్తిదాయకం. ఎప్పుడు చూసినా గొప్ప అనుభూతిని మిగిలించే చిత్రం. తాగుబోతు నటనకు అక్కినేనిదే చిరునామా. పల్లెటూళ్లో ప్రదర్శించే నాటకాల్లోనూ అతన్ని అనుకరించేవారు.
క్లైమాక్స్‌లో ‘ఆగదూ...! ఆగదూ!...’అనే పాట ప్రేమకథలు విషాదాంతమేనా అన్పిస్తాయి. ‘ప్రేమ’ అనే విషయంతో సినిమాలు నిర్మించాలనుకొనే వారందరికీ ఈ చిత్రం ఒక అద్భుత నిఘంటువు. అందుకే ఎప్పటికీ మరువలేని, మరచిపోని నా అభిమాన చిత్రం ప్రేమాభిషేకం.
-ఎల్ శ్రీనివాసరావు, అద్దంకి