Others

నాగయ్య.. పరకాయ ప్రవేశం( ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేమరా రన్నవుతుంది. వేమన బిలంలోకి వెళ్లడం పూర్తయింది. చూసిన సందర్శకుల కళ్లమ్మట ధారాపాతంగా కన్నీరు. అలా ఎంతసేపు కేమరా రన్ అయిందో తెలీదు. తర్వాత తేరుకొని కళ్లు తుడుచుకుంటూ కట్ చెప్పేరు కెవి రెడ్డి.

వాహిని సంస్థ ‘యోగివేమన’ సినిమా నిర్మాణం అనేకమైన కాంట్రావర్సీలతో కొనసాగింది. తొలుత ఈ చిత్రానికి దర్శకత్వం బియన్ రెడ్డి చేపడితేనే బావుంటుందనుకున్నారు. అయితే, బియన్ ఎంతో నిజాయితీగా ‘యోగివేమన కథని ఇంకా బాగా పరిశోధన గావించవలసి వుంది. తెలిసిన సమాచారం, ప్రస్తుతం అందుబాటులో వున్న సమాచారం చాలదు. ఈ స్క్రిప్టు కెవీ (రెడ్డి) చేతిలో పెడితే ఆయన దగ్గర మంచి టీమ్ వుంది. దీనిమీద బాగా తపించాలి అని ఆ బాధ్యతలు కేవీకి ఒప్పగించారు.
కెవి రెడ్డి మంచి చదువరి. లోతైన విశే్లషణ చేయగల దిట్ట... అతని శిష్యుడు కమలాకర కామేశ్వరరావు. ఆయన గతంలో కృష్ణాపత్రికలో సాహితీ విమర్శలతోబాటు సినీ సమీక్షలు నిర్భయంగా రాసేవాడు. మంచి చదువరి. మూడవ వ్యక్తి ‘లింగమూర్తి’. మంచి నటుడే కాదు, విమర్శకుడు కూడా. పూర్వాశ్రమంలో జర్నలిస్టు. ప్రపంచాన్ని బాగా చదివిన వ్యక్తి. నాలుగవ వ్యక్తి ఇంటూరి వెంకటేశ్వరరావు. ఆ రోజుల్లోనే విద్యాధికుడైన జర్నలిస్టు. కెవి రెడ్డికి అంతేవాసి. యోగివేమన చిత్రానికి సహకార దర్శకుడు. ఇంత మంది గొప్పవాళ్ల మేధోమథనంతో రూపుదిద్దుకున్న స్క్రిప్టు యోగివేమన.
హీరో పాత్రధారి నాగయ్య. నాగయ్యకు అత్యంత ప్రీతిపాత్రులు ఈ ముగ్గురూ.. లింగమూర్తి, కమలాకర, ఇంటూరి. వీరిలో వీరికి ఒకరిపట్ల మరొకరికి అపారమైన గురి, నమ్మకం. ఒకే మాట- ఒకే బాటలా వుండేది వీరి సాంగత్యం.
కెవి రెడ్డి సెట్‌లో గంభీరంగా వుండేవారు. ఆయన చేయబోయే సినిమాని ముందే ఊహించుకొనేవాడు. సన్నివేశాల రూపకల్పనలో నిర్దిష్టమైన ప్రణాళిక ఆయనది.
సెట్‌లో ఎవరైనా బెటర్‌మెంట్‌ని సూచించినట్టయితే తర్వాతి పిక్చర్లో చూసుకుందాం. ఇప్పటికిలా కానివ్వండి అంటూ నిర్మొహమాటంగా చెప్పేసేవాడు కెవి రెడ్డి.
పతాక సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది. స్టూడియోలోనే వేసిన సెట్‌లో చిత్రీకరణ... యోగివేమన సమాధి స్థితికి వెళ్లిపోతాడని తెలిసి, వేమన భక్తులు తండోపతండాలుగా చూడ్డానికి తరలివస్తారు. వారిని వేమన శూన్య దృక్కులతో చూస్తూ నిర్లిప్తంగా వుండిపోతాడు. తనను బిడ్డలా భావించే అన్నయ్య వదినలు వస్తారు. వారిపట్ల కూడా వేమనది అదే భావన.. అవ్వే శూన్యదృక్కులు..
అన్నయ్య వదినలు చమర్చిన కళ్లతో నమస్కారం చేస్తారు. వేమన కళ్ళల్లోంచి కన్నీళ్లు చిప్పిల్లుతుండగా నిర్జీవంగా నవ్వుతూ ప్రతి నమస్కారం చేస్తాడు. తన ప్రాణమిత్రుడు అభిరాముడు (లింగమూర్తి) వస్తాడు. లింగమూర్తిని చూసిన వేమన (నాగయ్య)లో రవ్వంత చలనం.. అవ్యక్తమైన భావన. తననుతాను ఎరుకపరుచుకొనే ప్రయత్నంలో అభిరాముడు పసిపిల్లాడిలా విలవిల్లాడిపోతాడు- ఆ సమయంలో అభిరాముడ్ని అక్కున చేర్చుకుంటాడు వేమన.. తర్వాత బిలంలోకి వెళ్లిపోతాడు. సందర్శకులు ప్రతిమల్లా వుండిపోతారు.
కేమరా రన్నవుతుంది. వేమన బిలంలోకి వెళ్లడం పూర్తయింది. చూసిన సందర్శకుల కళ్లమ్మట ధారాపాతంగా కన్నీరు. అలా ఎంతసేపు కేమరా రన్ అయిందో తెలీదు. తర్వాత తేరుకొని కళ్లు తుడుచుకుంటూ కట్ చెప్పేరు కెవి రెడ్డి.
నిజానికి అభిరాముడ్ని వేమన అన్నా వదినలను చూసినట్టే చూస్తాడు. ఆ సందర్భంలో అభిరాముడిగా లింగమూర్తి అభినయం కదిలించి వేమన అక్కున చేర్చుకున్నాడు. ఇది ముందు అనుకున్నది కాదు. అయినా యోగివేమన ఆత్మను ఆవిష్కరింపచేశాడు నాగయ్య. ఒక్క మాటలో చెప్పాలంటే వేమన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు నాగయ్య. అందుకే ఆయన నటులుగా అమరులయ్యారు.

-ఇమంది రామారావు 9010133844