Others

బికినీతో షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచినటిగా పేరు తెచ్చుకోవడమేకాదు, అవసరమైతే నగ్నంగా నటించేందుకూ సందేహించనన్న స్టేట్‌మెంట్లతో మెంటలెక్కించిన నటి రాథికా ఆప్టే. లైంగిక వేధింపులమీదే కాదు, సౌత్‌లో హీరోయిన్లను గ్లామర్ డాల్స్‌గా మాత్రమే చూపిస్తారంటూ ఓపెన్‌గా మాట్లాడగల గట్స్ ఆమె సొంతం. ముంబైకి చేరిన రాధిక, టాలీవుడ్‌పై విమర్శలు చేయడం చాలామంది తెలుగువారికి నచ్చలేదు. కానీ అలాంటివాటిని రాధిక ఎప్పుడూ పట్టించుకున్నట్టు కూడా కనిపించదు. ప్రస్తుతానికైతే ఆప్టే బాలీవుడ్‌లో బిజీగానే ఉంది. మధ్యలో అప్పుడప్పుడూ సోషల్ మీడియా అకౌంట్‌లో స్పైసీ చిత్రాలతో హీట్‌నూ జనరేట్ చేస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే -ఈమధ్య జుట్టును సరిచేసకుంటూ రువ్విన నవ్వుకు మాత్రం ఆప్టే అభిమానులు పిదా అయిపోతున్నారు. ఒక్కరోజులోనే నెటిజనులు లైకులు కొట్టడమే కాకుండా ఎన్నో ఇంట్రెస్టింగ్ కామెంట్లూ చేశారు. ఒకరు ‘మిలియన్ డాలర్ స్మైల్’ అంటే, మరొకరు ‘సెక్సీ బ్యూటీ ఆన్ ది బోట్’ అంటూ కామెంట్ పెట్టారు. ఒక అభిమాని అయితే రెచ్చిపోయి ‘ఈస్ట్ ఆర్ వెస్ట్.. రాధిక ఈజ్ ది బెస్ట్’ అని కాంప్లిమెంట్ ఇచ్చేశాడు. అయితే పొగడ్తలే కాదు, ఆప్టే ఇచ్చిన పోజుకి తెగడ్తలూ రాకపోలేదు. ఆమధ్య రాధిక నటించిన ‘అంధాధున్’ చైనాలో భారీ వసూళ్లే రాబట్టింది. మరోవైపు రాధిక ‘ది ఆశ్రమ్.. ది వెడ్డింగ్ గెస్ట్’ అనే ఇంగ్లీష్ సినిమాల్లోనూ నటిస్తూ బిజీ అవుతోంది.