Others

ధర్మదాత (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజారఘుపతిరావు ఓ పెద్ద జమీందార్. సాయంచేసే గుణంతో ఊళ్లో ‘్ధర్మదాత’గా పేరుతెచ్చుకుంటాడు. భార్య ఇద్దరు బిడ్డలు, పెళ్లికాని చెల్లెలితో ప్రశాంతంగా జీవించే వారి జీవితంలోకి పక్క ఊరి ధనవంతుడు నాగభూషణం ప్రవేశిస్తాడు. అసూయ, దుర్భుద్ధితో రాజావారి చెల్లెల్ని తన కోడలిగా చేసుకొని ఆస్తి కాజేయాలనే పథకం వేసి యింటినుంచి వెళ్లే పరిస్థితి కల్పిస్తాడు. దానధర్మాల కోసం రాజావారు అప్పుచేసే శేఠ్‌తో లాలూచీపడి, చేసిన బాకీకి తన మహల్‌ను తాకట్టుపెట్టి యిరవై ఏళ్లకి బాకీ చెల్లించి విడిపించుకునే షరతులు పెట్టిస్తాడు. దాంతో ఊరువదలి డబ్బు సంపాదనే ధ్యేయంగా తన ఇద్దరు పిల్లల్ని కష్టపడి పెంచి చదివిస్తూ, కూడబెట్టిన డబ్బుతో మహల్‌ను విడిపించుకునే ప్రయత్నంలో వియ్యంకుడు చేసే మోసాన్ని పిల్లలు అడ్డుకుని బుద్ధిచెప్తారు. పెద్దకొడుక్కి మేనకోడలితో, కూతురికి మేనల్లుడితో పెళ్లిచేసి అందరూ ఒక్కటవ్వడంతో కథ సుఖాంతమవుతుంది. బాలమురుగన్ వ్రాసిన కథను చక్కని కథనంతో ఆసక్తికరమైన సన్నివేశాలతో వినోదాత్మకంగా తెరకెక్కించారు. పినిశెట్టి సంభాషణలు, కొసరాజు, సి.నారాయణరెడ్డి సాహిత్యం, తాతినేని చలపతిరావు వీనులవిందైన బాణీలు, ఎస్.వెంకటరత్నం ఛాయాగ్రహణం ఈ చిత్రానికి అదనపు శోభ తీసుకొచ్చింది.
‘్ధర్మదాత’ చిత్రాన్ని రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై అక్కినేని సంజీవి దర్శకత్వంలో తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించారు. రాజారఘుపతిగా, ‘్ధర్మదాత’ పెద్దకుమారుడిగా అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయంతో అద్వితీయంగా నటించారు. తండ్రి పాత్రలో సంఘర్షణాత్మక భావోద్రేకాల్ని, కొడుకు పాత్రలో చిలిపి అమాయకతను అల్లరి, వినోదాన్ని అలవోకగా మెప్పించారు. రెండో కుమారుడిగా పద్మనాభం కావలసినంత వినోదం పంచాడు. కూతురిగా నూతన తార అనిత, మేనకోడలిగా కాంచన, మేనల్లుడిగా స్వర్గంనరకం చిత్రం హీరో ఈశ్వరరావు నటించారు. రాజావారి భార్యగా షావుకారు జానకి, చెల్లెలుగా ఝాన్సీ, విలన్‌గా నాగభూషణం యింకా సాక్షిరంగారావు, సూర్యకాంతం, పద్మనాభం జోడిగా గీతాంజలి, మాస్టర్స్ ఆదినారాయణరావు, విశే్వశ్వరరావులు నటించారు. ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను నిర్మాత తమ్మారెడ్డి, యద్దనపూడి సులోచనారాణి కలిసి రాసుకున్నారు. ఈ చిత్రంలో అన్ని పాటలు ప్రజాదరణ పొందాయి. ‘ఓ...్ధర్మదాతా... ఓ ధర్మదాతా... ఎవరూ నీవారుకారు ఎవరూ నీ తోడు రారు’ ధర్మదాత సర్వం కోల్పోయి వూరు విడిచి వెళ్లే సన్నివేశంలో వచ్చే పాట. బిడ్డలు తన లక్ష్యసాధన అర్థం చేసుకోలేకపోతున్నారనే కోపంతో ‘ఎవ్వడికోసం ఎవరున్నారు పొండిరా పొండి.. నా కాలం ఖర్మం కలిసొస్తే రండిరా రండి’ అనే పాటలో అక్కినేని అభినయం అద్భుతం.

-పీవీఎస్పీ రావు, అద్దంకి