Others

అదంతా నటనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయాలంటున్నారు. నా ఉద్దేశ్యంలో రెగ్యులర్ అన్నది వేరే అర్థం. నావరకు ‘సూపర్ డీలక్స్’, ‘యూ టర్న్’ తరహాలో భిన్నమైన పాత్రలు చేయాలనే ఆలోచిస్తున్నా. నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడమే ఇపుడు నాముందున్న తపన. -ఇదీ అందాల భామ సమంతా మనసులో మాట.
నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సామ్ -పెళ్లి తరువాత హీరోయిన్లు సినిమాలెందుకు మానేయాలి? అని ప్రశ్నిస్తోంది. ‘ఏ మాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి గ్లామర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో టాప్‌స్టార్‌గా ఎదిగిన సమంత ప్రస్తుతం భిన్నమైన పాత్రలు చేసేందుకు సిద్ధమైంది. పెళ్లి తరువాత భర్త నాగచైతన్యతో కలిసి నటిస్తున్న చిత్రం మజిలీ. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంలో మీడియా ముందుకొచ్చింది సమంత. మనసులోని మాట ముచ్చట్లుగా చెప్పింది.
పెళ్లి తరువాత మొదటి చిత్రమిదేగా?
-పెళ్లి తరువాత చైతుతో కలిసి నటిస్తున్న మొదటి చిత్రమిదే. కరెక్టుగా పెళ్లి తరువాత మేమిద్దరం కలిసి నటించే కథ దొరికింది.
రియల్ లైఫ్‌లో ఒక్కటైన మీరు రీల్ లైఫ్‌లో చైతుతో నటించడం ఎలా ఉంది?
-పెళ్లికి ముందు చైతుతో కలిసి చేసినప్పుడు వేరేలా ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా అనిపిస్తోంది. దాంతోపాటు మేమిద్దరం కలిసి సినిమా చేయడం అవసరమా? అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇద్దరి సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు వేరేగా ఉంటాయిగా, అందుకు.
కథలో మీకు అంతగా నచ్చిన అంశం?
-సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ప్రేమ గురించి చాలా సినిమాలు వచ్చాయి. కాని పెళ్లి తరువాత ఆ జంట ఎలా ఉంటారు. ముఖ్యంగా ఆ అమ్మాయి లైఫ్ తెలీని సెక్యూరిటీలో ఉంటుంది. కేరింగ్.. ఒకరకమైన సంతృప్తి ఉంటుంది. అలాంటి విషయాలతో సరిగ్గా ఈ టైంలో శివ కథ తీసుకొచ్చాడు.
పర్సనల్ లైఫ్‌లో మీరు కూడా అలాగే ఫీలవుతున్నారా?
-అవును. ప్రేమలో ఉన్నపుడు కేర్ ఉంటుంది. లవర్ విషయంలో తిన్నావా? ఎక్కడున్నావు? లాంటి కేర్ ఉంటే, పెళ్లి తరువాత సెక్యూరిటీ ఉంటుంది. దాంతోపాటు తెలియని సంతృప్తి ఉంటుంది.
మీ పాత్ర ఎలా ఉంటుంది? రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉంటుందా?
-ఈ సినిమాలో నా పాత్ర పేరు శ్రావణి. భర్త అంటే అమితమైన ప్రేమవున్న అమ్మాయి. చాలా సైలెంట్. రియల్ లైఫ్‌లో నేనేమో ఎక్కువ మాట్లాడతాను. శ్రావణికి నాకు ఎలాంటి పోలికలూ ఉండవు.
చైతు నటన ఎలా ఉంటుంది?
-షూటింగ్‌లో నా నటన కంటే చైతూ పెర్ఫార్మెన్స్‌నే ఎక్కువ గమనించేదాన్ని.. అబ్బా ఇక్కడ బాగా చేశావు. ఇక్కడ బాగాలేదని మొహమాటం లేకుండా చెప్పేదాన్ని. దాన్ని చూసి చైతూ అవన్నీ డైరెక్టర్ చూసుకుంటారు, నీ పని నువ్వు చూసుకో అనేవాడు. షూటింగ్ అయ్యాక కూడా సినిమా గురించి చర్చించుకునేవాళ్లం.
ఈమధ్య కాలంలో హీరోయిన్ల పాత్రలకు ఎక్కువ ప్రాముఖ్యత పెరిగింది కదా? దీనిపై మీ అభిప్రాయం?
-నిజమే. గత మూడు నాలుగేళ్లుగా హీరోయిన్ల పాత్రలకు చాలా ప్రాముఖ్యత పెరిగింది. అంతకుముందు హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ కోసమో, లేక పాటల కోసమే ఉన్నట్టే ఉండేది. కానీ ఇపుడు పరిస్థితి మారింది. ఎందుకంటే అమ్మాయిలు ఎప్పుడైనా స్పెషల్ కదా.
మీరు నటించిన సూపర్ డీలక్స్ సినిమా మంచి సక్సెస్ టాక్ అందుకోవడమే కాకుండా మీ పాత్రకు మంచి ప్రశంసలు వస్తున్నాయి?
-అవును, సూపర్ డీలక్స్ మంచి సక్సెస్ టాక్ రావడం, ముఖ్యంగా నా పాత్రకు మంచి అప్లాజ్ వస్తుంది. ఈ సినిమాలోని పాత్ర గురించి నాపై ట్రోల్స్ వస్తాయని అనుకున్నాను. కానీ బాగా చేశావని అంటుంటే ఆనందంగా ఉంది.
అంటే ట్రోల్స్ వస్తాయని మీరు ముందే ఫిక్స్ అయ్యారా?
-ఈమధ్య ట్రోల్స్ అన్నవి ఎక్కువయ్యాయి కదా. ఇంతకుముందు ట్రోల్స్ గురించి బాధపడేదాన్ని. కానీ ఇపుడు లైట్ తీసుకుంటున్నా.
ఈ సినిమాలో చైతు లిప్‌లాక్ గురించి మీరు ఎలా ఫీలయ్యారు?
-నిజానికి లిప్‌లాక్ ఉంటుందని ముందు తెలీదు. ఆ సీన్ తీశాక నాకు చెప్పారు. అయినా లిప్‌లాక్, హగ్, రొమాన్స్‌లాంటి విషయాలన్నీ కూడా నటనలో భాగమే. అంతేకానీ అవి ప్రత్యేకమని నేననుకోను. సినిమాల విషయంలో నాకు సెట్స్‌లో కెమెరా స్టార్ట్ అయ్యాకా ముందు వెనుక ఎవరున్నారన్నది మరచిపోతా. నటనలో నా పాత్ర ఏమిటో అదే చూస్తా.
సినిమాల విషయంలో మీ ప్రాధాన్యత?
-నాకు కథ, పాత్రే ముఖ్యం. ఇక ప్రతి సినిమాను మొదటి సినిమాగా భావిస్తా. దూకుడు సమయంలో మహేష్ ఇదే చెప్పాడు. ఎప్పుడూ ప్రతి సినిమానూ నీ మొదటి సినిమాలాగే భావించాలని అనేవాడు. నాకు అది బాగా నచ్చింది. నేను కూడా అదే ఫాలో అవుతా.
పెళ్లి తరువాత సినిమాలు తగ్గాయని అనుకుంటున్నారా?
-ఎందుకు తగ్గుతాయి. ఇప్పటికే చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ అన్ని రెగ్యులర్ కమర్షియల్ కథలే కావడంతో భిన్నమైన పాత్రలు చేయాలని ఒప్పుకోవడంలేదు. సూపర్ డీలక్స్, యు టర్న్ తరహాలో నా పాత్రకంటూ ప్రత్యేకత ఉండాలన్నది నా కోరిక.
బాలీవుడ్ నుండి అవకాశాలు వచ్చాయా?
-లేదు. వాళ్లకు నేను కరెక్ట్ కాదనుకున్నారేమో (నవ్వుతూ)
నెక్స్ట్ సినిమాలు?
-తెలుగులో 96 రీమేక్ ఉంటుంది. దాంతోపాటు కథలు వింటున్నా.

-ఆర్