Others

నిర్మాత డబ్బుల చెట్టు కాదు ( ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మూవీ మొఘల్’ అనిపించుకున్నాడంటే అందుకు రామానాయుడికి చాలా గొప్ప పునాది వుంది. నాయుడుగారు మొదట సినిమాని ప్రేమించాడు. తర్వాతే సినిమాని నిర్మించాడు. సినిమా నిర్మాణంలో వున్న ఇరవై నాలుగు విభాగాల మీద సంపూర్ణమైన అవగాహన వున్నవాడు. అన్నిటికంటే ముఖ్యంగా తను నిర్మాతగా మారిన తొలిరోజుల్లో విజయ వాహినీ స్టూడియోస్ అధినేత నాగిరెడ్డి దగ్గర దాదాపు శిష్యరికమే చేశాడు. నాగిరెడ్డిగారి మీద రామానాయుడి ప్రభావం... రామానాయుడి మీద నాగిరెడ్డిగారి ప్రభావం చాలావుంది. ఇద్దరి మైండ్‌సెట్ ఒకటే. కాబట్టే, సురేష్ విజయా కంబైన్స్ కలిసి ప్రొడక్షను కొంతకాలం నిర్వహించారు. ఒకరోజు చెన్నైలో నేను ఓ సినీ తార పత్రికకు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ కోసం వెళ్లాను. ఆ ఇంటర్వ్యూ కూడా నాగిరెడ్డిగారు ఆషామాషీగా ఇవ్వలేదు. నాగిరెడ్డి ఆత్మీయుడు నరసరాజుగారు నా గురించి చెబితే ఇచ్చారు. ఆ సమయంలో రామానాయుడుగారు అక్కడే వున్నారు. ఇద్దరిమధ్యా సీరియస్‌గా డిస్కషన్ జరుగుతోంది. చిత్ర నిర్మాణంలో భారీతనం, భారీ తారాగణం, భారీ బడ్జెట్టూ నిర్మాతకి లాభమా? నష్టమా? ఇదీ విషయం. ముమ్మాటికీ లాభమే అంటారు రామానాయుడు. ఏ విధంగా అని ప్రశ్నించాడు నాగిరెడ్డిగారు. ‘్భరీ చిత్ర నిర్మాణం అనగానే బ్యానరు వేల్యూ పెరుగుతుంది. అగ్రస్థాయి నటీనటులందరూ.. తదుపరి సినిమాలోనూ నటించడానికి ఉత్సాహం చూపిస్తారు. ఫైనాన్సు డిస్ట్రిబ్యూషన్ ప్రోబ్లెమ్ వుండదు. (అప్పటికింకా బయ్యర్సు రాలేదు) ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతుంది. (అప్పటికి మీడియా రాలేదు.) యూనిట్ సంఖ్యా పెరుగుతుంది. పదిమందికి అన్నం పెట్టొచ్చు.’
ఇంత చేసి సినిమా దెబ్బతింటే నిర్మాతకెవరు అన్నం పెడతారు? -నాగిరెడ్డిగారి సూటి ప్రశ్న. ఇద్దరిమధ్యా కాస్సేపు వౌనం. నాయుడుగారు తేరుకొని ‘సినిమా ఫెయిలవుతుందని ఎందుకు నిర్దారణకొచ్చారు?’ అడిగాడు. ‘సినిమాకేదైనా హిట్ ఫార్ములా ఈ ప్రపంచంలో వుందా? వుంటే చెప్పండి. కోటి రూపాయిలిచ్చి కొనుక్కుంటాను!’ అన్నారు నాగిరెడ్డి. నాయుడుగారు తక్కువ తిన్నారా. ‘మరి మీరు అగ్రనటులతో సినిమాలెందుకు తీశారు?’
‘బాగా అడిగావ్... నా దృష్టిలో వాళ్లు స్టార్‌లు కాదు. రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, అంజలి వీరంతా మా హోమ్‌టీమ్. రెండవది ఏషియాలోనే పెద్ద స్టూడియో, పది ఫ్లోర్‌ల స్టూడియో మాది. స్టూడియో మెయింటెనెన్స్ కావాలికదా. స్టూడియోలో పనిచేసే ‘క్రూ’కి పనికావాలి కదా. ఒకటి, పది ఫ్లోర్లూ ముప్పొద్దులా మూడొందలరవై రోజులూ రన్నవ్వాలి.
రెండవది -రన్ అయినా అవ్వకపోయినా నెల జీతాలు ఇచ్చి తీరాలి కదా. కూర్చోబెట్టి జీతాలు ఇవ్వలేం కదా. వాళ్లకి పని కల్పించాలి. వాళ్లకి పని కల్పించడం కోసమే తప్పనిసరి పరిస్థితుల్లో నేను చిత్ర నిర్మాణం చేపట్టవలసిన అవసరముంది. నా పాయింట్ కేచ్ చేశావా?’. నాయుడు మొహంలోకి చిరునవ్వుతో చూశారు నాగిరెడ్డి. దాంతో నాయుడు తగ్గిపోయారు.
‘్భరీ చిత్ర నిర్మాతగా ఇప్పుడిప్పుడే నాకు పేరొస్తుంది. ననే్నం చెయ్యమంటారు?’ నాయుడుగారి ప్రశ్న.
‘ఇవన్నీ సీజనల్‌గా వుంటాయి నాయుడూ! నువ్వొక హిట్ సినిమా ఇచ్చావా? చరిత్రలో నిలిచిపోతుంది. మాయాబజార్‌ని పొగడమని మేం చెప్పేమా? అగ్ర హీరోలిద్దరుంటుండగా సూర్యాకాంతమ్మతో గుండమ్మకథ తీయలేదూ! భారీ చిత్ర నిర్మాణంలో ప్రోబ్లమ్ ఏవిటంటే ముందు పారితోషికాలు పెరుగుతాయి. యూనిట్ ఖర్చులు పెరుగుతాయి. సందర్శకుల తాకిడి పెరుగుతాయి. ఇవన్నీ హాయిగానే వుంటాయి. ముందనుకున్న బడ్జెట్టూ మనకు తెలియకుండానే పెరుగుతుంది. సినిమా ఆపేస్తామా? ఆపలేం కదా. పూర్తిచేసి రిలీజ్ చెయ్యాలి. అదనపు సొమ్ము ఆయాచితంగా రాదుకదా- మార్వాడీ అవసరం వుంటుంది. (అప్పట్లో మార్వాడీలే ఫైనాన్సియర్సు) అధిక వడ్డీలు. సకాలంలో రిలీజ్ కాకపోతే వడ్డీల మీద వడ్డీలు. ఇలా ఎంతమంది ప్రొడ్యూసర్లు కాలగర్భంలో కలిసిపోయారో తెలుసా?’. నాయుడుగారు క్వెశ్చన్ మార్కు మొహం పెట్టారు.
‘నువ్వేం చెయ్యాలంటే.. నిర్మాత డబ్బులు కాచే చెట్లు కాదు. అది అనుక్షణం గుర్తుంచుకోవాలి. ఖర్చుపెడుతున్నట్టు కనిపించు- ఖర్చుపెట్టకు- ముఖ్యంగా షెడ్యూలు, కాల్షీట్లూ, కాంబినేషన్ల విషయంలో జాగ్రత్తగా వుండు. పనిగంటలు వృథాకానివ్వద్దు. ముఖ్యంగా పెద్ద తారలు, వారి పారితోషికం నిముషానికెంతవుందో లెక్కగట్టు. దీన్నిబట్టి నీకు తేలిపోతుంది నువ్వెంత వృధా చేస్తున్నావో!’ అంటూ నవ్వుతూ భుజం చరిచారు. అటువంటి వారిదగ్గర తర్ఫీదు పొందబట్టే నాయుడుగారు మూవీ మొఘల్ అయ్యాడు.

-ఇమంది రామారావు