Others

సెంటిమెంటే వర్కవుట్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమన్నా మరోసారి తన స్పీడును పెంచేస్తోంది, హీరోయిన్‌గా కాదు ఐటెం సాంగుల్లో.
విషయంలోకెళితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలి చిత్రం అల్లుడు శీనులో ఐటెం చిందేసిన తమన్నా,
ఎంతోమందిని ఆ తరువాత మర్చిపోలేకుండా చేసింది. అది వర్కవుట్ అయిందేమో మరి, సెంటిమెంట్ పరంగా మరోసారి తమన్నా చేతే తాజాగా చిత్రంలో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వస్తున్న
‘స్పీడున్నోడు’ చిత్రంలో కూడా తమన్నానే ఐటెం చేసేస్తోంది. హస్కీగా సాగే పాటతో మాస్ స్టెప్పులతో
తమన్నా మరోసారి తన నృత్య ప్రతిభను ఈ పాటలో చూపించిందని తాజాగా విడుదలైన ట్రైలర్
చూసినవాళ్లు చెబుతున్నారు. ఫిబ్రవరి 5న విడుదలకానున్న ఈ చిత్రంలో తమన్నా పాటకు కనుక
మంచి రెస్పాన్స్ వచ్చిందీ అంటే, ఇక ఆమెను హీరోయిన్ కమ్ ఐటెం నాయికగా చూడాల్సిందే.
ఏదైనా అవకాశం వున్నపుడే సద్వినియోగం చేసుకోవాలి కదా!
తమన్నా ప్రస్తుతం అదే బాటలో వుంది.