Others

నాకు నచ్చిన పాట--ప్రేమించి పెళ్ళిచేసుకో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1966లో విడుదలైన అన్నపూర్ణావారి ఆత్మగౌరవం సినిమాలోని ఈపాట నేటి తరాన్నీ అలరించేదే. ‘ప్రేమ’ అనే పదం యువతకు గిలిగింతలు కలిగించేది. అది ఫలిస్తే సంతోషం, వికటిస్తే విషాదం.
కాలేజీలో జరుగుతున్న పోటీలో ‘ప్రేమ వివాహాలను’ సమర్ధిస్తూ సినారె రాసిన ఈ గీతం ఇటు పెద్దలకు అటు యువతరానికి హెచ్చరికగా ఉంటుంది.
ప్రేమించి పెళ్లి చేసుకో/ నీ మనసంతా హాయనింపుకో
వరుని వలపేమిటో/ వధువు తలపేమిటో/ తెలుసుకోలేక పెళ్లిళ్లు జరిపించినా/ తెలిసి కట్నాలకై బ్రతుకు బలిచేసినా/ కథకు మిగిలేది ఎడమోము.. పెడమోమే
మనిషి తెలియాలి/ మనసు కలవాలి/ మర్చిపోలేని స్నేహాన కరగాలిలే/ మధుర ప్రణయాలు మనువుగా మారాలిలే/ మారి నూరేళ్ల పంటగా వెలగాలిలే....
యువతీ యువకుల మనోభావాలు అర్ధంచేసుకోకుండా కట్నాల కోసం, ఆస్తుల కోసం బలవంతంగా పెళ్ళిళ్ళు చేస్తే చివరకు మిగిలేది ఎడమోము.. పెడమోము అని తల్లిదండ్రులకు సూచిస్తూ, ప్రేమంటే ఒకరి మనసు ఒకరు తెలుసుకుని మంచి స్నేహితులుగా మారి దానిని పెళ్ళిగా మలుచుకోవాలని యువతను హెచ్చరిస్తూ.. ఇందుకు మన పురాణాల్లోని నలదమయంతి, రుక్మిణి శ్రీకృష్ణుడు, శకుంతల దుష్యంతుల ప్రణయ గాథలు వివరించడం ముదావహం. ఘంటశాల మధురగానం, రాజేశ్వరరావు సంగీత స్వరకల్పన, అక్కినేని అభినయంతో ఈ పాట నేటికీ ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేస్తోంది.
ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట.

-సుసర్ల సర్వేశ్వరశాస్ర్తీ, విశాఖపట్నం