Others

ఇదేంటబ్బా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఉయ్యాల జంపాల’తో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది చిన్నారి పెళ్లికూతురు అవికాగోర్. తెలుగులో తొలి చిత్రం తర్వాత ఆమె చేసిన రెండు మూడు సినిమాలు సరైన ఫలితాన్ని మూటగట్టకపోవడంతో -కెరీర్ గ్రాఫ్ ఢమాల్‌మని కిందకి దిగిపోయింది. దానికితోడు చిన్న వయసులోనే భారీ హీరోయిన్ అయిపోవడంతో -తొలి చిత్రంలో ఆహా ఓహో అన్నవాళ్లే తరువాతి ప్రాజెక్టులకు తూచ్ అన్నారు. ఇక తెలుగులో లాభం లేదనుకుని -చదువుమీద ధ్యాస పెరిగిందని, అందుకే కొన్నాళ్లు నటనకు బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించేసింది. ఇటీవల కాస్త సన్నబడిన గోర్ -ప్రస్తుతం తమిళ, కన్నడ భాషల్లో చిత్రాలు చేస్తోంది. అదీకాక ఇటీవల కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో హల్‌చల్ చేసింది. దీన్నిబట్టి చూస్తే చదువు సాకుతో గ్లామర్‌ను వంటబట్టించుకోవడానికే వెళ్లిందని అంటున్నారు. ఇప్పుడు అవకాశాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి కనుక -నటనమీద ధ్యాసపుట్టి చదువు ఆపేసి వచ్చేస్తుందన్న మాట.