Others

నాకు నచ్చిన సినిమా.. సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు పాతికేళ్ళ క్రితం వెంకటేష్ హీరోగా వచ్చిన ‘సుందరకాండ’లో నేటికీ ఫ్రెష్‌నెస్ కనిపిస్తుంది. అందుకే బుల్లితెరపై వేసినా -ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 1992 అక్టోబర్ 15న మార్నింగ్‌షో చూశాను. ఇప్పటికీ ‘అపర్ణ’ (కళ్ళద్దాల హీరోయిన్)ను, డాబామీద కనిపించే ‘మేఫ్లవర్’ను మర్చిపోలేం. పాటలు ఎప్పటికీ సతతహరితమే. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. ఇప్పుడు లెక్చరర్‌గా పని చేస్తున్నా. సైకాలజీలో ‘రోల్ రివర్సల్’ అనుభవంలోకొచ్చింది. దర్శకులు ‘ద్రష్ట’లుగా పేర్కొనబడేది అందుకే. తమిళంలో ‘్భగ్యరాజా’ కథను రాఘవేంద్రరావు తెలుగులో ‘పేరు’ చెడగొట్టకుండా తెరకెక్కించారు. ఈ సినిమా స్ఫూర్తితో ‘కిష్కిందకాండ’ అనే కామెడీ సినిమావచ్చింది. వెంకటేష్ ‘డ్రెస్‌సెన్స్’ ఇందులో ‘సింప్లీ సూపర్బ్’. ‘అపర్ణ’ మళ్లా కనిపించకపోయేసరికి కుర్రాళ్ళు బెంగపెట్టుకొన్నారు. సులోచనాలున్న అమ్మాయిల్ని ప్రేమించడం కొద్దిరోజులు ఫ్యాషనైపోయింది. ‘మీనా’ గృహిణిగా అందంగా మారింది. బ్రహ్మానందం ‘హల్వా’ కామెడీ వర్క్‌అవుటైంది. కీరవాణిచ్చిన ‘సుందరాకాండకు’, ‘కుకుకు’, ‘ఆకాశాన సూర్యుడుండడు’ హంట్ చేస్తాయి. పెళ్లయిన హీరోతో సినిమా ప్రారంభం కావడం, అందులోనూ ‘వెంకటేష్’తో సాహసమే. ఐనా కథాబలంపై నమ్మకం, అభిరుచిగల నిర్మాత, సత్తావున్న దర్శకుడు, చేయగల కథానాయకుడు వుంటే ‘విజయం’ సాధ్యమేనని నిరూపించబడింది. పవిత్రమైన ‘సుందరకాండ’ పేరుకు ‘అపవాదు’రానీకుండా తీసిన చిత్ర బృందం ఎంతైనా అభినందనీయం. రామాయణంలో ‘సుందరకాండ’ అనగానే ఎమ్మెస్ రామారావు, సినిమాల్లో ‘సుందరకాండ’ అనగానే రాఘవేంద్రరావు, వెంకటేష్ గుర్తొస్తారు.

-కాళిదాసు, కావలి