Others

వెనె్నల పువ్వు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలియాస్ జానకిగా వచ్చి.. ఆ గ’మ్మతె్తైన నవ్వుతోనే అందర్నీ పడగొట్టేసింది. తెలుగు తెరపై అనీషకు తిరుగులేదనుకున్నారు. అనుకున్నట్టే -సర్దార్ గబ్బర్‌సింగ్ చాన్స్ వొళ్లోకొచ్చి వాలింది. పవన్ ప్రాజెక్టులో కనుక -కుర్రది స్టార్ అయిపోయందనుకున్నారు. కానీ -చిత్రసీమలో చాన్స్ చేజారిపోవడానికి క్షణం చాలు. చివరి క్షణంలో సర్దార్ ప్రాజెక్టు నుంచి ఆంబ్రోస్‌ను తప్పించారు. -కాజల్ వచ్చిచేరింది. ఆంబ్రోస్ దురదృష్టవంతురాలు అనుకున్నారంతా. కానీ -అదృష్టం ఆమెవైపే ఉందని ‘ఎస్‌జిఎస్’ ఫలితం రుజువు చేసింది. సర్దార్‌కు ఊహించినంత ఊపు లేకపోవడంతో -కాజల్‌కూ కలిసొచ్చిందేం లేదు. ఇప్పుడు మళ్లీ -ఆంబ్రోస్‌ను వెతుక్కుంటూ మరో లక్కొచ్చిందట. మోహన్‌లాల్, గౌతమి ప్రధాన పాత్రల్లో చంద్రశేఖర్ యేలేటి ‘మనమంతా’ రూపొందిస్తున్నాడు. ఓ కీలక పాత్ర కోసం ఆమెను ఎంపిక చేశారని అంటున్నారు. తెలుగు, మలయాళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం తనకు మంచి పేరే తెస్తుందన్న నమ్మకంతో కనిపిస్తోంది అనీషా.