Others

ఏది అదృష్టం! ఏది దురదృష్టం!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంత తక్కువ టైంలో ఈ స్థాయికి చేరుకుంటానని -ఇండస్ట్రీకి వచ్చినపుడు ఊహించలేదు. చాలామందిలాగే నన్నూ అదృష్టం వెంటాడింది. అందుకే -తక్కువ టైంలోనే టాప్ రేంజ్‌కు చేరుకున్నా.
**
అదృష్టం అన్న మాట ఆత్మ సంతృప్తి కోసమే. నిజానికి ఇండస్ట్రీకి వస్తూనే నేను వేసుకున్న ప్రణాళికలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. అదృష్టానే్న నమ్ముకుని కూర్చుంటే.. కెరీర్ ఎక్కడ మొదలుపెట్టానో ఇంకా అక్కడే ఉండి ఉండేదాన్ని.
మీడియాతో మాట్లాడేటప్పుడు టాలీవుడ్ హీరోయిన్లు పలికే చిలక పలుకులివి. కొందరు ‘అదృష్టాన్ని’ స్మరిస్తే.. మరికొందరు ‘కృషి, పట్టుదల’ అంటారు. నిజానికి -అదృష్టానే్న నమ్ముకుని కార్యాచరణను వదిలేసినా లేదూ పనితనానే్న నమ్ముకుని మంచికాలాన్ని చిన్నచూపు చూసినా కెరీర్ తల్లకిందులు కావడం ఖాయమని బలంగా చెప్పడానికి పరిశ్రమలో లెక్కలేనంత మంది జీవిత ఉదాహరణలు కనిపిస్తాయి.
-అదృష్టమనేది ప్రతి మనిషి జీవితంలో తలుపు తడుతుంది. అది గమనించినోళ్లనే విజయం వరిస్తుంది. తెలుగు ప్రజల్లో బలంగా పాతుకుపోయిన చిన్న నమ్మకం ఇది. సెంటిమెంట్‌ను నమ్ముకునే కళావ్యాపారం సాగే సినీ పరిశ్రమలో స్వర్ణయుగం నాటి అదృష్టవంతులెవరు, దురదృష్టవంతులెవరో చూద్దాం.
అలనాటి బాలకృష్ణ (అంజి), రాజబాబు, కోళ్ల సత్యం, నల్ల రామమూర్తి.. అలా హాస్య నటులతో పలు జానపద, పౌరాణిక చిత్రాల్లో చెలికత్తెగా, పనిమనిషిగా నటించిన ‘మీనాకుమారి’ని తీసుకుందాం. అందం, ఆహార్యం, అభినయం అన్నీవున్నా -మీనాకుమారి చెలికత్తె పాత్ర దాటలేకపోయింది. చివరకు సాంఘిక చిత్రాల్లో సైతం ఆమెను పనిమనిషి పాత్రలే వరించాయి. టాలీవుడ్‌లో మొదటి దురదృష్టవంతురాలు మీనాకుమారి అనుకోవాలి. చెల్లెళ్ల పాత్రల విషయానికొస్తే సీనియర్ నటి విజయనిర్మల కొన్ని చిత్రాల్లో చెల్లెమ్మల పాత్రలు పోషించినా, తరువాత అదృష్టం తలుపుతట్టి నాయిక స్థాయికి, దర్శకురాలు స్థాయికి చేరుకోగలిగింది. ‘బేబి రోజారమణి’గా పలు చిత్రాల్లో ప్రేక్షకులను అబ్బురపర్చిన రోజారమణి యవ్వన దశలో ముందుకు సాగలేక డబ్బింగ్ ఆర్టిస్టుగా మిగిలిపోయారు. అలాగే బేబి పద్మినిగా నటనతో ప్రేక్షకుల్ని తన్మయపర్చి పద్మినిగా యవ్వన దశలో వెండితెరకు దూరమైపోయింది. వీరందరికి విరుద్ధంగా బాల నటిగా శ్రీదేవి వెండి తెరన వెలిగింది. యవ్వన దశలో మరింత కాలం కలిసి రావడంతో అగ్ర నటులందరితో జతకట్టి టాలీవుడ్ మహారాణిగా అగ్రతాంబూలం అందుకుంటోంది. శ్రీదేవి హీరోయిన్‌గా చేసిన చిత్రాలు శత దినోత్సవాలు, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ వరకూ విజయం సాధించాయంటే నటనతోపాటు ఆమె అదృష్టం కూడా అనుకోవాలి.
హాస్యనటిగా పద్మనాభంతో జోడీ కట్టి హాస్య పరిమళాలు వెదజల్లిన నాట్యతార ‘గీతాంజలి’ హాస్య పాత్రలకు, నాట్యం పాత్రలకు జీవంపోస్తూ మంచి వెలుగు వెలిగింది. ‘ఇల్లాలు’ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం దక్కినా, ఆ పాత్రలో తనను తాను నిరూపించుకున్నా మళ్లీ ఆమెకు నాయిక పాత్రలు దొరకలేదు. తిరిగి హాస్యపాత్రలకే పరిమితమై తెలుగు చిత్రరంగ హాస్య నటిగా మిగిలిపోయింది. ఆమెను అదృష్టం వెక్కిరించినట్టే.
అలాగే అదృష్టం వెక్కిరించిన మరో నటి ‘చంద్రకళ’. నాయక పాత్రలకంటే చెల్లె పాత్రల్లో చాలా చిత్రాల్లో కనిపించింది. అందం, అభినయం వున్నా శృంగార, త్యాగ రసాలు చిందించగలిగి, కన్నీరు తెప్పించగలిగినా టాలీవుడ్ ‘చెల్లి’ పరిధి దాటలేక తెలుగు చలనచిత్ర రంగ ‘చెల్లిగా’ మిగిలిపోయింది. ‘ఇద్దరు మిత్రులు’ చిత్రంలో పద్మనాభంతో జోడికట్టిన నాటి శారదను తీసుకుందాం.
అన్నపూర్ణ పిక్చర్స్‌లో ‘అమాయకురాలు’గా వచ్చి తనను తాను నిరూపించుకుంది. కరుణ, ప్రేమ, రౌద్రం అలా నవరసాలు చిందించి అగ్రనటిగా కొనసాగింది. శోక పాత్రలకు మారు పేరుగా ఊర్వశి అవార్డును మూడుసార్లు అందుకుంది. హాస్య నటుడు చలంతో వివాహం -విడిపోవడం మాత్రం ఆమె జీవితంలో అపశ్రుతులు. కృషి, పట్టుదల, ఓర్పు, నేర్పుతో అదృష్టం కలసిరాగా చెలికత్తె పాత్రల నుంచి సాంఘిక చిత్రాల్లో కథానాయిక స్థాయికి చేరుకున్న నటి వాణిశ్రీ. అక్కినేనితో ‘ఇద్దరు అమ్మాయిలు’ చిత్రంలో నటించి విశ్వరూపం చూపించి స్వర్ణయుగ తారగా వెలిగింది. అగ్రనటులందరితో నటించి చిత్ర విజయాలకు దోహదపడింది. చిలిపితనం, హాస్యం, ఉత్సాహం, కఠినత్వం, కోపం, తాపం, త్యాగం, శృంగారం అలా నవరసాలు నటనలో పండించింది. వాణిశ్రీ చేసిన 80 శాతం చిత్రాలు విజయం సాధించినవే. మహానటి సావిత్రి తర్వాత అటు అక్కినేని సరసన అభిమాన జంటగా, సావిత్రి తరువాత మరో సావిత్రి అనుకునేలా పాత్రల్లో పరకాయ ప్రవేశంచేసి చిత్ర విజయాలకు చిహ్నమైంది వాణిశ్రీ. గర్వం, అహం, పొగరు, హుందాతనం, నిర్లక్ష్యం, ఉదాసీనత అలా పాత్రల తీరులో మెప్పించి, ప్రేక్షకులచే నీరాజనాలందుకుని ‘కళాభినేత్రి’గా నిలిచింది. టాలీవుడ్‌లో మకుటం లేని యువరాణిగా, వెండితెర వెలుగుగా వెలిగిందంటే ఆమె కృషికితోడు అదృష్టం కలసిరావడం మరో కారణమనుకోవచ్చు. అలనాటి అగ్ర నటులిద్దరికంటే వాణిశ్రీకే ఎక్కువ పారితోషికం (్ధర) ముట్టచెప్పేవారు నిర్మాతలు. దాదాపు ఆమె నటించిన చిత్రాలన్నీ విజయం సాధించి, స్వర్ణయుగ గొప్ప చిత్రాలుగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించుకున్నవే. ప్రేమనగర్, జీవన తరంగాలు, దసరాబుల్లోడు, ఆత్మీయులు, భక్తకన్నప్ప అలా హిట్ చిత్రాలను తలచుకుంటే ఆ చిత్ర ఘన విజయాలకు కేరాఫ్ అడ్రస్ కళాభినేత్రి ‘వాణిశ్రీ’నే.
అటు స్వర్ణయుగంలోనైనా, ఇటు సాంకేతిక సినిమా కాలంలోనైనా -రవ్వంత అదృష్టం ఉన్నవాళ్లే ముందుకు పోతున్నారన్నది నిజం. అందం, ఆహార్యం, అద్భుతమైన నటనా ప్రతిభా ఉన్నా -ఒక్కోసారి సరైన ప్రాజెక్టు చేతికి చిక్కక చతికిలపడుతున్న వాళ్లు పరిశ్రమలో లెక్కలేనంతమంది. అంతెందుకు, అన్నీవున్నా అవకాశాల్లేక తెరమరుగైన తెలుగు హీరోయినే్ల ఎంతోమంది. ఒకవేళ స్వయంకృషితో ఉన్నతస్థాయికి ఎదిగినా -ఆ ఎదుగుదల వెనుక పిసరంత అదృష్టం కూడా ఉందని చెప్పుకోవడం పరిశ్రమలో పరిపాటి. కృషి, పట్టుదల అని చెప్పేవాళ్లు ఒకవేళ టాప్‌రేంజ్‌కి చేరుకున్నా -పొరబాటున కిందపడితే దురదృష్టాన్ని నిందించడం కూడా సినీ పరిశ్రమలోనే కనిపిస్తుంది. చిత్రసీమలో ఇదో విచిత్రం!

-మురహరి ఆనందరావు