Others

కన్నయ్యా... నల్లని కన్నయ్యా (నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాదీ ఆడజనే్మ సినిమాలో మంచి ఆదరణ పొందిన పాట ఇది. సుశీలమ్మ సమధుర గాత్రం, సావిత్రమ్మ అద్భుత నటనా సామర్థ్యం ప్రేక్షకులను అంతులేని తీరాలకు తీసుకెళ్తుంది. సహజంగా ఏతరం సినిమాలోనైనా హీరోయిన్ అందంగా ఉంటుంది. కానీ -ఈ సినిమాలో హీరోయిన్ డీగ్లామరే కథావస్తువు. చాయ తక్కువగల సావిత్రి గొప్పింటి కోడలు అవుతుంది. మెట్టింట -్భర్తతోపాటు మిగతావారి నుంచి నిరాదరణ ఎదురవుతుంది. కోడలి నలుపు రంగుని మావగారు యావగించుకుంటారు. అలాంటి సందర్భంలో పెరట్లోని శ్రీకృష్ణుడి విగ్రహంముందు తన మనోవేదనను ఆవిష్కరిస్తుందామె. నువ్వూ నల్లగా ఉన్నావు. నిన్ను అందరూ ఆదరిస్తారు. ప్రేమిస్తారు. పూజిస్తారు కూడా. మరి ననె్నందుకు అసహ్యించుకుంటున్నారు. నలుపు రంగుగా ఉండటం నా తప్పా? మంచి గుణాలు నాలో ఉన్నాయ్. అవి గుర్తించరా? అంటూ ఆవేదన చెందుతుందామె. నన్నిలానే బలి చేస్తావా అంటూ నిలదీస్తుంది. ఒక స్ర్తి అంతరంగాన్ని, మానసిక వేదనను చిన్న పాటలో కవి గొప్పగా ఆవిష్కృతం చేసిన పాట ఇది. ఎస్‌వి రంగారావు, ఎన్‌టి రామారావు, ఛాయాదేవి, రమణారెడ్డి, జమున, హరనాథ్‌లు- తమతమ పాత్రల్లో జీవించారు. ఇంతమంది మధ్య సావిత్రి నటన మహోన్నతంగా, ఉత్కృష్టంగా ఉంది. ఆమెను మహానటి అనటానికి ఈ పాట మరొక ఉదాహరణ. కన్నయ్యా.. అంటూ దీర్ఘం తీసి, ఆపి, గుటకవేసి, రొప్పుతీర్చుకుని- మహోన్నతమైన ఆమె నటనకు ఈ పాట వంతపాడింది. అందుకే ఈ పాటంటే ఇష్టం, ప్రేమ కూడా!

---

వెనె్నల రచయితలకు
సూచన

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
ప కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
ప తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
ప కొత్త హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వ్యాసాలకు కూడా స్వాగతం.
ప ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలువుంటే పంపొచ్చు.
ప రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో పళశశళ్ఘబజూళషష్ఘశ్ఘౄజ.ష్యౄకు మెయల్ చేయగలరు.
ప ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.

మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

-అన్నదాత దయాకర్, నెల్లూరు