Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈవారం విడుదలైన రెండు సినిమాలే ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. సూర్య స్టారర్‌గా 24, మెగా క్యాంప్ హీరో సాయిధరమ్‌తేజ్ సుప్రీం చిత్రాలు విడుదలై బాక్సాఫీస్ దగ్గర నిలకడగానే ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన సూర్య 24 -ఓపెనింగ్ వసూళ్లు భారీగానే సాధించింది. తరువాత బి, సి సెంటర్లలో చతికిలపడింది. తమిళంలో 4.46 కోట్ల గ్రాస్ సాధించిన సూర్య, ఇటు తెలుగులోనూ 4.42 కోట్ల గ్రాస్ వసూలు సాధించి -తెలుగులో క్రమంగా తన మార్కెట్‌ను స్థిరపర్చుకుంటున్నాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌పై పూర్తి నమ్మకంతో వచ్చిన సాయిధరమ్ సుప్రీం కూడా మంచి టాక్‌తోనే దూసుకుపోతోంది. ప్రాజెక్టు హిట్టు రేంజ్‌కు చేరుకోకున్నా -పోటీగా నిలబడే సినిమాలు పెద్దగా లేకపోవడంతో సుప్రీం బాక్సాఫీస్ దగ్గర సండది చేస్తున్నాడు. ఇక గత వారం విడుదలైన అల్లు అర్జున్ సరైనోడు చిత్రం ఇంకా కలెక్షన్లలో స్టడీగానే ఉంది. ఇప్పటికే 50కోట్ల మార్కెట్‌ను చేరుకున్న సరైనోడు -అన్నట్టుగానే ఊరమాస్‌కు వినోదాన్ని పంచుతున్నాడు. వచ్చేవారం మహేష్‌బాబు బ్రహ్మోత్సవం విడుదలవుతున్న నేపథ్యంలో -ప్రస్తుత సినిమాలకు చాన్స్ ఉండకపోవచ్చు. బ్రహ్మోత్సవంపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో -దాని దాటిని 24, సుప్రీం చిత్రాలు ఏమేరకు తట్టుకున్నాయన్నది చూడాలి.