Others

సినిమాతో గుర్తింపు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్ రావిపల్లి
వైఫ్, స్వప్న బాలు సెకండ్ బికామ్., డాక్టర్ పరమానందయ్యాస్ స్టూడెంట్ గ్యాంగ్ లాంటి చిత్రాలతో దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్న రామ్ రావిపల్లి మంచి కథలు ఎన్నుకుంటే తప్పక విజయం దొరుకుతుందని చెబుతున్నారు. ఆయనతో ఈవారం చిట్ చాట్..

* నేపథ్యం?
- రాజమండ్రి దగ్గర కొత్తపల్లి మా వూరు. కాకినాడలో చదువు. జర్నలిస్టుగా పనిచేస్తూ ఈ రంగంలోకి వచ్చాను.
* దర్శకుడిగా ఎందుకు?
- జనరల్‌గా చప్పట్లు కొట్టించుకోవడం చాలా ఇష్టం. సినిమా ద్వారా ప్రశంస పొందాలన్న కోరికతో నటుడిగా సాగుతూ, దర్శకుడిగా మారాను.
* తొలి అవకాశం
- ఉషాకిరణ్ మూవీస్ చిత్రాలకు మాటలు రాశాను. పి.చంద్రశేఖర్‌రెడ్డి, టి.కృష్ణలాంటి వాళ్లతో పనిచేయడం నాకు వరంలా మారింది. దర్శకత్వ మెళకువలు నేర్చుకున్నా. తొలి అవకాశం కోనేరు ప్రసాద్ ఇచ్చారు.
* ఇష్టమైన జోనర్స్
- హ్యూమన్ డ్రామా అంటే చాలా ఇష్టం. దర్శకుడిగా అన్ని జోనర్స్ ఇష్టపడతాను. ప్రేక్షకుడు ఏదైనా చక్కగా తీస్తే చూస్తాడు. సమాజానికి ఏదో మంచి చెప్పాలనే కంటెంట్, కానె్సప్ట్ ఉండాలని అనుకుంటా.
* కళ వ్యాపారమా?
- కళతో కూడిన వ్యాపారం అంటాను. డబ్బులు పెట్టిన నిర్మాతకు నష్టం రావాలని కోరుకోలేం కదా. అలాగే ప్రేక్షకుడికి ఎంటర్‌టైన్‌మెంట్ ఆ వ్యాపారంలోనే ఇవ్వాలి.
* హారర్ లవ్ జోనర్స్‌పై కామెంట్?
- లవ్ అంటే అందరిలో ఉన్నదే కదా? అది సహజాత లక్షణం. జీవితంలో హ్యూమన్ రిలేషన్స్ టచ్ చేస్తూ కథ రాసుకుంటే అది హిట్. అలాగే భయపడిన వాడెవడూ లేడు. దాన్ని సరైన రీతిలో కథ రాసుకోగలగాలి.
* సమస్యలు?
- పరిశ్రమలో థియేటర్ల సమస్య ఉన్నమాట నిజమే. ఐతే సరైన చిత్రాలకు దొరకడం లేదన్నది కరెక్ట్ కాదు. పెద్ద హీరోల చిత్రాలకు ప్రాధాన్యత ఉంటుంది. చిన్న థియేటర్లు త్వరలో రాబోతున్నాయి. అదే విధంగా రోజుకి ఐదు ఆటలు అన్నది కూడా మంచి సూత్రామే. దీంతో థియేటర్ల సమస్య తీరవచ్చు.
* దర్శకుడంటే?
- ప్రయోక్త, నిర్దేశకుడు అనుకుంటారు.. కాదు అతను తొలి ప్రేక్షకుడు. సినిమాను కథ రూపంలో ఉండగానే మనో నేత్రంతో చూసేవాడు. తన ఊహలకు రంగులద్ది సజీవంగా అందించగలవాడు.

- సరయు