రాష్ట్రీయం

కొలిక్కొచ్చిన కొత్త జిల్లాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్తయిన అధ్యయన కమిటీ కసరత్తు
ప్రభుత్వానికి రెండు మూడు రోజుల్లో నివేదిక
తొలి దశలో 10 జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదన
ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే కేంద్రానికి నివేదిక

హైదరాబాద్, నవంబర్ 23: కొత్త జిల్లాల సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి సిఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన సర్కారు ఏర్పాటు చేసిన కమిటీ కసరత్తు ముగింపునకు చేరుకుంది. రెండు మూడు రోజుల్లో నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు అధికార వర్గాల సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 10 జిల్లాలుండగా, అదనంగా మరో 14 జిల్లాలు ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తుంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని కూడా తెరాస ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు హామీ ఇచ్చింది. ఈమేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయగా, సాధ్యాసాధ్యాలపై కమిటీ ప్రతిపాదనలను రూపొందించింది. అయితే తొలి దశలో 10 జిల్లాల ఏర్పాటుకు మాత్రమే కమిటీ ప్రతిపాదించనున్నట్టు తెలిసింది.
జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు సిఎం కెసిఆర్ మెదక్ జిల్లాలో సిద్ధిపేట, కరీంనగర్ జిల్లాలో జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాలో మంచీర్యాల, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. సిఎం హామీ ఇచ్చిన నాలుగు జిల్లాలతోపాటు మరో ఆరు జిల్లాలను కమిటీ ప్రతిపాదించినట్టు సమాచారం. వీటిలో నల్లగొండ జిల్లా భువనగిరి, మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ లేక వనపర్తి, ఖమ్మం జిల్లా కొత్తగూడెం, హైదరాబాద్ వెస్ట్ (గొల్కొండ), హైదరాబాద్ సౌత్ (చార్మినార్), హైదరాబాద్ సెంట్రల్ ఉన్నట్టు అధికారవర్గాల సమాచారం. తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం 3.6 కోట్ల జనాభా కలిగి ఉంది. దేశవ్యాప్తంగా అత్యధిక జిల్లాల జనాభా 19 లక్షలుండగా, తెలంగాణలో పది జిల్లాల్లో ప్రస్తుతం రమారమిగా 36 లక్షల జనాభా కలిగివుంది. జిల్లాల జాతీయ జనాభాను అనుసరించి కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాలకు 19నుంచి 20 లక్షల జనాభా ఉండేలా అధ్యయన కమిటీ ప్రతిపాదించినట్టు సమాచారం. ఇదిలావుంటే కొత్త జిల్లాల ప్రతిపాదనలు దాదాపు ముగింపు దశకు చేరుకోవడంతో నియోజకవర్గాల విభజన త్వరగా జరగాలని కేంద్రంపై ఒత్తిడి తేనున్నట్టు కరీంనగర్ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ సోమవారం మీడియాకు తెలిపారు. ఎంపీల బృందం సోమవారం సిఎం కెసిఆర్‌తో సమావేశమైన సందర్భంగా కూడా కొత్త జిల్లాల ప్రస్తావన వచ్చినట్టు తెలిసింది. నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయితే కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమమవుతుందని ఎంపీలు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో కూడా ప్రస్తావించడానికి తెరాస ఎంపీలు సన్నద్ధమవుతున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయన కమిటీ నుంచి నివేదిక అందిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ పూర్తయ్యాక కేంద్రం అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపించనుంది.