రాష్ట్రీయం

చైనా వ్యాపారవేత్తలతో మంత్రి నారాయణ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: మూడు రోజుల పాటు చైనాలో చేసిన పర్యటన అనేక విషయాలను నేర్పిందని పట్టణాభివృద్ధి మంత్రి డాక్టర్ పి నారాయణ పేర్కొన్నారు. జోంగ్జియాన్ అర్బన్ ఇనె్వస్టుమెంట్ గ్రూప్ ఆధ్వర్యంలోని ప్యూచర్ ఆర్క్ సిటీని మంత్రి నారాయణ సందర్శించారు. అమరావతి నగరంలో అన్నీ అందరికీ అందుబాటులో ఉండేలా రూపకల్పన చేయనున్న తరుణంలో ఇలాంటి ఫ్యూచర్ ఆర్క్ వంటి నిర్మాణాన్ని చూడటం మంచి అనుభూతి అని మంత్రి పేర్కొన్నారు. అనంతరం జొంగ్జియాన్ నిపుణులతో మంత్రి నారాయణ సారధ్యంలోని బృందం చర్చలు జరిపింది. అవసరమైతే అమరావతి నగర నిర్మాణంలో సలహాలు, సూచనలు సహకారం అందించడానికి తాము సిద్ధంగా ఉంటామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. మరోవైపు పారిశ్రామికంగా అభివృద్ధి పరిచేందుకు కావలసిన వనరులను ఎలా సమకూర్చుకోవాలన్న అంశంపై గుయ్‌జో పారిశ్రామికవేత్తల బృందంతో రాష్ట్ర ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. అమరావతి నగరాన్ని ఏకకాలంలో అటు సామాజిక జీవనాన్ని అభివృద్ధి పరచడంతో పాటు ఇటు పారిశ్రామిక ప్రగతి సాధించేందుకు తీసుకోవలసిన చర్యల మీద ప్రధానంగా వీరి మధ్య చర్చ జరిగింది.