రాష్ట్రీయం

నకిలీ గుట్కా కేంద్రంపై పోలీసుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, డిసెంబర్ 7: నకిలీ గుట్కాలను తయారు చేసే పరిశ్రమపై మహబూబ్‌నగర్‌కు చెందిన స్పెషల్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాడి జరిపి 60 లక్షల రూపాయల విలువగల గుట్కాలతో పాటు ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ శివారులో నకిలీ గుట్కాలు తయారు చేసి అక్రమ పద్ధతుల ద్వారా ఎగుమతి చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న జిల్లా సూపరింటెండెంట్ ప్రత్యేక బృందాన్ని పంపించారని, అందులో భాగంగా ఆదివారం అర్ధరాత్రి పరిశ్రమపై దాడి జరిపి అక్కడ అక్రమ పద్ధతుల ద్వారా నకిలీ గుట్కాలను తయారు చేస్తున్నారని గుర్తించి దీనికి సంబంధించిన ముడి పదార్థాలు 60 లక్షల రూపాయల విలువ గల నకిలీ గుట్కాలను స్వాధీన పరుచుకుని అక్రమ పద్ధతుల ద్వారా నడుపుతున్న పరిశ్రమను స్వాధీనపరుచుకుని రికార్డులను, దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం మళ్లీ మహబూబ్‌నగర్‌కు చెందిన ప్రత్యేక పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఫరూఖ్‌నగర్ తహశీల్దార్ చందర్‌రావు, జిల్లాకు చెందిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఇతర అధికారులతో చర్చించి పరిశ్రమ నడుపుతున్న అనుమతులు ఏమిటి..అనుమతులు లేకుండా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం, రహస్యంగా నకిలీ గుట్కాలను తయారు చేయడం జరుగుతోందని గుర్తించారు. ఈ వివరాలను సేకరించేందుకు వెళ్లిన మీడియాకు సమాచారం తెలపలేదు సరికదా కనీసం పరిశ్రమ లోపలికి కూడా రానివ్వలేదు. అయతే, దీనికి సంబంధించిన వివరాలు జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ విలేఖరుల సమావేశంలో చెబుతారని స్థానిక పోలీసులు మీడియాకు తెలిపారు. మహబూబ్‌నగర్ స్పెషల్ పోలీసులతో పాటు రూరల్ సిఐ గంగాధర్, సిబ్బంది పాల్గొన్నారు.