రాష్ట్రీయం

వాటర్ గ్రిడ్‌పై అఖిలపక్షం నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజీ మంత్రి డాక్టర్ నాగం డిమాండ్

హైదరాబాద్, నవంబర్ 30: వాటర్ గ్రిడ్‌పై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని బచావో తెలంగాణ మిషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశంలో వాటర్ గ్రిడ్ గురించి వివరించాలని, అన్ని పార్టీల సలహాలు, సూచనలు తీసుకోవాలని ఆయన సోమవారం మిషన్ నాయకులు యోగీశ్వర్‌రెడ్డి, అంజిరెడ్డితో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. రీ-డిజైనింగ్ గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న 33 ప్రాజెక్టుల సంగతేమిటో చెప్పాలని డాక్టర్ నాగం డిమాండ్ చేశారు. 33లో కేవలం 3 ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయని అన్నారు. రీ-డిజైనింగ్ కాదు రీ-దోపిడీ అని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 350 మండలాల్లో కరవు విలయతాండవం చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 231 మండలాల్లోనే కరవు ఉన్నట్లు ప్రకటించి చేతులు దులుపుకున్నదని ఆయన విమర్శించారు. కరవు తీవ్రం గా ఉన్న మండలాలను ఆదుకునేదెవరని ఆయన ప్రశ్నించారు. దీంతో 9 జిల్లాల నుంచి వలసలు ప్రారంభమయ్యాయని అన్నారు. వలసల నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాల్లో 1690 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం కేవలం 313 మంది కుటుంబాలకు మాత్రమే సహాయం అందించిందని ఆయన తెలిపారు. మిగతా కుటుంబాలకు ఆర్థిక సహాయం ఎప్పుడు అందిస్తారని ఆయన ప్రశ్నించారు. కరవు తీవ్రంగా ఉన్నందున 3 వేల రూపాయల చొప్పున కరవు భత్యం ఇవ్వాలని, నిరుద్యోగులకు వెయ్యి రూపాయల చొప్పున భృతి ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బచావో తెలంగాణ మిషన్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయడం గురించి ప్రశ్నించగా, యెన్నంకు ఏమి మిషన్ ఉందో తనకు తెలియదంటూ డాక్టర్ నాగం దాట వేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వరంగల్ ఓటర్లకు మాయ మాటలు చెప్పి ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించుకున్నారని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు.