సబ్ ఫీచర్

పనిలో ఒత్తిడి తగ్గాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి ఆధునిక యుగంలో పనిఒత్తిడి కారణంగా వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాలవారూ మానసిక వేదనకు లోనవుతున్నారు. జీవనశైలిలో వేగం పెరిగినందున పనిలో ఒత్తిడి సర్వసాధారణమైంది. పనిలో నైపుణ్యం చూపాలన్నా, కొత్త బాధ్యతలతో సమర్ధత చాటాలన్నా ఏదో ఒక రూపంలో ఒత్తిడిని ఎదుర్కొనక తప్పదు. కొన్ని సులభ పద్ధతులను పాటిస్తే పనిఒత్తిడి నుంచి ఉపశమనం పొందే వీలుందని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉల్లాసంగా గడుపుతూ, పనిలో నైపుణ్యం చూపాలంటే ముందుగా- ‘ఒత్తిడిని ఎదుర్కొంటున్నామ’న్న భావన నుంచి బయటపడాలి. కాలం విలువను తెలుసుకుని, నిర్ణీత సమయానికి పూర్తి కావాల్సిన పనులను ముగించాలి. వాయిదాలు వేసుకుని మొత్తం పనిని ఒకేసారి చేద్దామనుకుంటే ఒత్తిడికి లోనుకాక తప్పదు. పనిభారం పెరిగినపుడు ఆ విషయాన్ని నిర్మొహమాటంగా బయటకు చెప్పాలి. అన్ని పనులనూ మనమే చేద్దామని భుజాన వేసుకున్నపుడు తప్పులు జరిగే ప్రమాదం ఉంది. పనిభారం గురించి ఉన్నత స్థాయి అధికారుల ఎదుట మన వాదన వినిపించినపుడే పరిష్కారం లభిస్తుంది. చేసే పనులను, బాధ్యతలను ఉద్యోగులకు విధిగా నిర్దేశించినపుడు మాత్రమే సమర్ధతతో పనిచేస్తారు. లేకుంటే కొందరిపైనే పనిభారం పడి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. బాగా పనిచేసిన వారిని ప్రశంసిస్తుంటే వారు ఒత్తిడిని మరచిపోయి విధి నిర్వహణలో మరింత ఉత్సాహంగా ఉంటారు. పనిలో అంకితభావం ఎంత అవసరమో ఉద్యోగులకు వినోదం, వికాసం కూడా అంతే అవసరం. ఒత్తిడిని ఎదుర్కొంటున్నపుడు కొద్దిసేపు అటూ, ఇటూ నడవడం, తేలికపాటి వ్యాయామాలు చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరుబయట కాసేపు నిలబడి స్వచ్ఛమైన గాలి పీల్చితే ఉల్లాసం కలుగుతుంది. ఉద్యోగుల సమర్ధత మేరకు వారికి అనువైన బాధ్యతలు అప్పగించాలి. సమర్ధవంతంగా పనిచేస్తున్నారని కేవలం కొంతమందిపై పనిభారం పెంచితే- వారు తప్పనిసరిగా ఒత్తిళ్లకు గురవుతారు.