రాష్ట్రీయం

భద్రాచలంలో ముక్కోటికి ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 4: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 20వ తేదీన నిర్వహించే తెప్పోత్సవం, 21న నిర్వహించనున్న ఉత్తరద్వార దర్శనం ఉత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ శుక్రవారం స్థానిక చిత్రకూట మంటపంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధానంగా భక్తులను లక్ష్యంగా చేసుకోని ఆటోలు, లాడ్జిలు, హోటళ్లు అధిక ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని, దీన్ని ముందుగానే అరికట్టాలని ఆర్డీవోను ఆదేశించారు. అంతేకాకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వీవీఐపీల రాక తక్కువగా ఉంటుందని, అయినప్పటికీ వచ్చినవారికి ప్రోటోకాల్ ప్రకారం ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. భద్రాచలం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని, భక్తులకు వైద్య సౌకర్యాలు, స్నానఘాట్ల వద్ద గజ ఈతగాళ్లు, సురక్షిత తాగునీరు, అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్సవాల రెండురోజులు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని, మాంసం విక్రయాలు నిషేధించాలని ఆదేశించారు. అనంతరం ముక్కోటి ఉత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో కాళీచరణ్, దేవస్థానం ఈవో జ్యోతి, అదనపు ఎస్పీ సాయికృష్ణ, ఏఎస్పీ భాస్కరన్ తదితరులు పాల్గొన్నారు.