రాష్ట్రీయం

పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువకుడి మృతి ఇద్దరి పరిస్థితి విషమం
కుందుర్పి, డిసెంబర్ 6: కర్నాటకలో వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా, మరో 30 మందికి పైగా గాయపడిన సంఘన ఆదివారం రాత్రి అనంతరపురం జిల్లా కుందుర్పి మండలంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రమైన కుందుర్పికి చెందిన వీరన్న, ధనలక్ష్మి దంపతుల కుమారుడు గురుస్వామికి కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గం జిల్లా చెళ్లికెర తాలూకా నాగేహళ్లి గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయించారు. ఆ మేరకు శనివారం గురుస్వామి బంధువులు దాదాపు 50 మందికి పైగా ట్రాక్టర్‌లో నాగేహళ్లి గ్రామం వెళ్లారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో వివాహం వేడుక ముగిసింది. దీంతో పెళ్లికుమారుడి బంధువులు సాయంత్రం తిరిగి కుందుర్పికి బయల్దేరారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో కుందుర్పి మండలంలోని యల్లయ్యనూరు గ్రామం వద్ద ట్రాక్టర్ వేగంగా వస్తుండగా ఉన్నపళంగా ఇంజిన్ టైరు పగిలిపోయింది. దీంతో ట్రాక్టర్ రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి బోల్తా పడింది. ఈ సంఘటనలో ట్రాక్టర్ ట్రాలీ మీద పడడంతో ఓబుళయ్య (30) అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే ట్రాక్టర్‌లో ఉన్న దాదాపు 30 మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో కుందుర్పి ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా క్షతగాత్రుల ఆర్తనాదాలు ఉన్న సమీప గ్రామ ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు సహాయక చర్యలు చేపట్టారు.