రాష్ట్రీయం

ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 6: చత్తీస్‌గఢ్ దంతెవాడ పోలీసులు ఆదివారం ఇద్దరు కరుడుగట్టిన మావోయిస్టులను అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. బస్తర్ ఐజీ కల్లూరి, దంతెవాడ ఎస్పీ కమలోచన్ కశ్యప్ తెలిపిన వివరాల ప్రకారం లూదార్ తామో(26) మాఢ్ ప్రాంతంలోని ఇంద్రావతి ఏరియా పరిధిలోకి వచ్చే ఆదేర్ కమిటీ డిప్యూటీ కమాండర్‌గా పనిచేస్తున్నాడు.
ఇతను పార్టీ పనిపై గీదం వచ్చినపుడు స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లొంగిన మావోయిస్టుల ద్వారా ఇతనిని గుర్తించారు. 2005-08 వరకు మిలీషియాలో పనిచేసిన తామో 2008 నుంచి ఇప్పటి వరకు ఇంద్రావతి ఏరియాలో డిప్యూటీ కమాండర్‌గా పనిచేస్తున్నాడని ఐజీ వెల్లడించారు. అరెస్ట్ అయిన మరో మావోయిస్టు జనతన సర్కారు ద్వారా నడుస్తున్న పాఠశాల ఉపాధ్యాయుడు. ఇడమా అలియాస్ నికిల్ కిష్టారం ఏరియా కమిటీలో పనిచేస్తున్నాడు. చిన్నతనంలోనే ఇతను నక్సల్స్ ఉద్యమానికి ఆకర్షితుడై దళంలోకి వెళ్లాడు. గొల్లపల్లి, కిష్టారం ఏరియాల్లో ఇతను పనిచేస్తున్నాడు. చిన్నారులను తీసుకెళ్లి వారికి పాఠాలు చెప్పడం, తర్వాత ఉద్యమంలోకి తీసుకెళ్లడం ఇతని పని. తరుచూ భద్రాచలం ప్రాంతానికి వెళ్లడం దళాలకు కావాల్సిన వస్తువులు తీసుకురావడం వంటి కార్యక్రమాలు కూడా చేస్తూండేవాడని పోలీసులు తెలుపుతున్నారు. ఇతనిపై కూడా రూ.5లక్షల రివార్డు ఉందని ఐజీ కల్లూరి తెలిపారు.