Others

ఔను.. వీళ్లు వెళ్లిపోయారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభిమానుల గుండె గొంతుకలో కొండంత బాధ మిగిల్చి -గత ఏడాది అంజలీదేవి, అక్కినేని, బాపు, బాలచందర్‌లాంటి ప్రముఖులు నిష్క్రమించారు. నిష్క్రమించిన వాళ్లలో రెండు పదుల వరకూ ఉంటే -2015కు ఆ సంఖ్య మూడు పదులైంది. పుట్టినోళ్లెవరూ పర్మినెంట్ కాకున్నా -ఆకస్మిక మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయన్న ఆదోళనతో గత ఏడాదే టాలీవుడ్ పెద్దలంతా కలిసి మృత్యుంజయ హోమం (మార్చి 23న) భారీగా నిర్వహించారు.
హోమాలు, యాగాలు ఆత్మసంతృప్తికే తప్ప ఫలితాలు ఆశించకూడదన్న విషయాన్ని గుర్తు చేస్తూ -ఈ ఏడాది చాలామంది ప్రముఖులనే కోల్పోయాం.

ఏడాది ప్రారంభమైన ఆనందాన్ని మిగల్చకుండా -జనవరి 4న క్యారెక్టర్ నటుడు ప్రసాద్ క్యాన్సర్ వ్యాధికి ఆహుతయ్యారు. విక్టరీ మధుసూధనరావు వద్ద దర్శత్వ శాఖలో శిక్షణ పొందుతూనే మల్లెమొగ్గలు, విక్రం చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసారు. విక్రం చిత్రంలో చిన్న పాత్రతో పరిచయమై -తర్వాత ఆహుతి చిత్రం చేశారు. చాలామందిలాగే సినిమా పేరే ఇంటి పేరు చేసుకున్న అదృష్టం ఆయనకూ దక్కింది. ఈ ప్రశ్నకు బదులేది చిత్రంతో నటుడిగా బిజీ అయ్యాడు.
మరుసటి రోజే సినీలోకం మరో విషాద వార్త వినాల్సి వచ్చింది. ప్రఖ్యాత రచయిత గణేశ్‌పాత్రో జనవరి 5న మృతిచెందారు. నాటక రచయితగా పేరొందిన పాత్రో, పావలా, కొడుకు పుట్టాలి నాటకాల ద్వారా చిరపరిచితులు. నటుడు ప్రభాకరరెడ్డి చిత్రం ‘నాకూ స్వాతంత్రం వచ్చింది’ ద్వారా తెలుగుతెరకు పరిచయమై, బాలచందర్ చిత్రాలు గుప్పెడు మనసు, మరోచరిత్ర, ఆకలి రాజ్యం, రుద్రవీణతోపాటు తెలుగులో బాలచందర్ చిత్రాలన్నింటికీ రచనగావించారు. వారం తిరక్కుండానే జనవరి 10న నిర్మాత, దర్శకుడు విబి రాజేంద్రప్రసాద్‌ను కోల్పోయాం. అన్నపూర్ణ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయమైన రాజేంద్రప్రసాద్ అంతస్తులు, ఆత్మబలం, ఆస్తిపరులు, అక్కాచెల్లెలు తదితర చిత్రాలు నిర్మించి, దసరాబుల్లోడు చిత్రంతో దర్శకుడిగా పేరొందారు. తరువాత విజయవంతమైన చిత్రాలను తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లో నిర్మించి దర్శకత్వం వహించారు. కొడుకు జగపతిబాబును నటుడిగా తీర్చిదిద్దారు. నిర్మాత రఘత సత్యనారాయణ జనవరి 16న కన్నుమూశారు. శివాజీ, ఒరేయి తమ్ముడు చిత్రాలను ఈయన నిర్మించారు. కోలుకోని దెబ్బగా టాలీవుడ్‌కు 23న మరో దెబ్బతగిలింది. హాస్యనటుడు, రచయిత, దర్శకుడు ఎంఎస్ నారాయణ కన్నుమూశారు. ఇవివి సత్యనారాయణ స్టాంపుతో ‘మా నాన్నకు పెళ్ళి’ చిత్రంతో పరిచయమైన ఎంఎస్ -ఆ తరువాత వెనుతిరిగి చూడలేదు. గాంధేవాది, నటుడు ఉషాకిరణ్ మూవీస్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత అట్లూరి రామారావు ఫిబ్రవరి 6న మృతిచెందారు. ప్రతిఘటన చిత్రంలో రామారావు పోషించిన గాంధేయవాది పాత్ర ఎప్పటికీ మరువలేం. పరిశ్రమకు తగిలిన మరో షాక్ -సీనియర్ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడు ఫిబ్రవరి 18న చనిపోవడం. 1964లో రాముడు భీముడుతో మొదలైన ఆయన ప్రస్థానం, ప్రతిజ్ఞాపాలన, శ్రీకృష్ణతులాభారం, ప్రేమనగర్ లాంటి భారీ చిత్రంతోపాటు పలు సూపర్‌హిట్ చిత్రాలను తెలుగుతోపాటు తమిళ, హిందీ చిత్రాలను నిర్మించారు. 14 భారతీయ భాషల్లో చిత్రాలను నిర్మించి నిర్మాతగా గినె్నస్ బుక్ ఆఫ్ వరల్డ్ సాధించారు.
నిర్మాత బి నాగిరెడ్డి ఫిబ్రవరి 24న మృతి చెందారు. నాగిరెడ్డి నిర్మించిన సూపర్‌హిట్ చిత్రం ‘పెళ్ళిపుస్తకం’. దక్షిణాది సినిమాల్లో సినిమాటోగ్రాఫర్‌గా పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన వినె్సంట్ ఫిబ్రవరి 24న మృతి చెందాడు. ఇల్లరికం, పెళ్ళికానుక, కులగోత్రాలు, లేతమనసులు, మేజర్ చంద్రకాంత్, అడవిరాముడు, అన్నమయ్య చిత్రాలకు వినె్సంట్ పనిచేసారు.
నిర్మాత తిన్నింటి వీర శ్రీరామ్‌రెడ్డి మార్చి 28న కన్నుమూసారు. సినీ నిలయం బ్యానర్‌పై చంద్రమహేష్ దర్శకత్వంలో నిర్మించిన రెడ్ అలర్ట్ విడుదలకు సిద్ధంగాఉంది. శ్రీరామనవమి రోజున జన్మించిన ఈ నిర్మాత శ్రీరామనవమి రోజునే మరణించటం విశేషం.
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి కొడుకు సంగీత దర్శకుడు శ్రీ (శ్రీనివాస చక్రవర్తి) ఏప్రిల్ 18న మృతి చెందారు. పోలీస్‌బ్రదర్స్, మనీమనీ, సింధూరం, గాయం, చక్రం చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారాయన. చక్రం చిత్రంలో ‘జగమంత కుటుంబం’ గాయకుడిగా అందరికీ చిరపరచితుడు.
ఆడియోగ్రాఫర్ మధుసూధన్‌రెడ్డి ఏప్రియల్ 20న మృతి చెందాడు. మొదటి చిత్రం సిసింద్రీ ద్వారా మంచి పేరుతెచ్చుకొని వర్మ చిత్రంగా గోవిందా గోవిందాతో పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేసాడు. నువ్వుంటేచాలు, వేచి వుంటా, రెండుగుండెల చప్పుడు, రాజమండ్రికి 50 కిలోమీటర్ల దూరంలో చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన ఆకాష్ మే 24న మృతిచెందాడు.
హీరోయిన్ ఆర్తీఅగర్వాల్ అమెరికాలో చికిత్స పొందుతూ జూన్ 6న మృతి చెందింది. నువ్వునాకు నచ్చావ్, నువ్వులేక నేను లేను, ఇంద్ర, అడవిరాముడు, అల్లరిరాముడు ఆర్తీ నటించిన వాటిలో కొన్ని. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, రవితేజలతోపాటు తరుణ్, ఉదయకిరణ్‌లతో కూడా నటించింది. ప్రముఖ రచయిత దాశరధి రంగాచార్య జూన్ 8న మృతి చెందారు. దాశరధి కృష్ణమాచార్య సోదరుడైన రంగాచార్య చిల్లరదేవుళ్ళు చిత్రానికి రచనగావించారు.
తెలుగువాడు కాకున్నా తెలుగుతోపాటు పలు తమిళ చిత్రాల సంగీత దర్శకుడు యంయస్ విశ్వనాథన్ జూలై 14న కన్నుమూశారు. బాలచందర్ తెలుగులో నిర్మించిన అన్ని చిత్రాలకు విశ్వనాథన్ సంగీతం అందించారు. దేవదాసు చిత్రానికి సుబ్బరామన్‌వద్ద సహాయకుడిగా పనిచేస్తూ చిత్ర నిర్మాణం పూర్తికాకముందు సుబ్బరామన్ అకాల మరణం వలన విశ్వనాథన్ దేవదాసు చిత్రానికి సంగీతం పూర్తి చేస్తూ ఘంటసాల సూపర్‌హిట్ సాంగ్ జగమేమాయ పాటకు స్వరకల్పన గావించారు.
ఒక సంగీత దర్శకుడిని కోల్పోయిన రెండోరోజునే రామకృష్ణలాంటి నేపథ్య గాయకుడిని కోల్పోయాం. జూలై 16న మృతిచెందిన రామకృష్ణ ఎన్టీఆర్, అక్కినేని, శోభన్‌బాబులాంటి అగ్రనటులకు పలు విజయవంతమైన పాటలకు గాత్రం అందించారు. రామకృష్ణ భార్య జ్యోతికూడా నేపథ్యగాయని.
ప్రముఖ హాస్య, రంగస్థల నటి టి కనకం ఆగస్టు 20న కన్నుమూశారు. కీలుగుర్రం, రక్షరేఖ, గుణసుందరి కథతోపాటు లేతమనసులు చిత్రంలో కనకం ప్రధాన పాత్రలలో నటించారు.
నిర్మాత బొల్లు సత్యనారాయణ ఆగస్టు 29న మృతి చెందాడు. సత్యం ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై ధనలక్ష్మీ ఐలవ్‌యూ, మాయాబజార్ చిత్రాలను నిర్మించాడు. సీనియర్ కెమెరామాన్ వి దుర్గాప్రసాద్ సెప్టెంబరు 10న మృతి చెందాడు. విద్యార్థి పలు అగ్రశ్రేణి హిందీ నటులతో వందలాది చిత్రాలకు పనిచేసారు. విశ్వనాథ్ స్వరాభిషేకం చిత్రానికి కూడా పనిచేశారు. మరో సినీ దిగ్గజం ఏడిద నాగేశ్వరరావు అక్టోబరు 10న కన్నుమూశారు. సిరిసిరిమువ్వ చిత్రం ద్వారా నిర్మాత అవతారం ఎత్తి తాయారమ్మ బంగారయ్య, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, ఆపద్బాంధవుడులాంటి పలు కళాత్మక హిట్టు చిత్రాలు నిర్మించారు.
ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు పద్మశ్రీ రవీంద్రజైన్ అక్టోబర్ 9న మృతి చెందారు. ఎన్టీఆర్ సిఎం అయిన తర్వాత నిర్మించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రానికి రవీంద్రజైన్ సంగీతం అందించారు. ఇక ఇప్పటి నుంచి ఈ మరణాల సరళి మారి కేవలం హాస్య రంగానికి చెందిన వారినే కబళించటం ఆశ్చర్యంగా వుంది. అక్టోబరు 10న సీనియర్ కమెడియన్ మనోరమ కన్నుమూసింది. మనోరమ తెలుగు, తమిళ చిత్రాలన్నీ కలిపి వేల సంఖ్యకు దాటి గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుటుకున్నాయి. ఐదుగురు సిఎంలు అన్నాదురై, కరుణానిధి, ఎజీఆర్, జయలలిత, ఎన్టీఆర్‌ల సరసన ఆమె నటించి రికార్డు సృష్టించారు. హాస్య నటీమణుల్లో పద్మశ్రీ పొందిన ఏకైక నటి మనోరమే. ప్రముఖ హాస్య నటుడు మాడా వెంకటేశ్వరరావు అక్టోబర్ 24న కన్నుమూసాడు. మరో ప్రపంచం మాడా మొదట చిత్రం. ముత్యాలముగ్గు, చిల్లరకొట్టుచిట్టెమ్మ మాడాకు అఖండంగా పేరు తెచ్చాయి. ప్రముఖ హాస్య నటుడు కళ్లు చిదంబరం అక్టోబర్ 19న మృతి చెందాడు. గొల్లపూడి నవల కళ్ళు ఆధారంగా యంవి రఘు దర్శకత్వంలో వచ్చిన ‘కళ్ళు’ చిత్రం చిదంబరం పరిచయమై ఆ చిత్రంలో అద్వితీయంగా నటించి మొదటి చిత్రానికే నంది అవార్డు అందుకున్నారు. గత కొనే్నళ్లుగా విడుదలైన తెలుగు చిత్రాల్లో ముఖ్యపాత్రల్లో నటించి మెప్పించాడు. నవంబర్ 2న మరో హాస్య నటుడు కొండవలస లక్ష్మణరావు మృతి చెందాడు. కొందరు మొదటి చిత్రాన్ని ఇంటిపేరుగా మలచుకొంటే మరికొందరు సొంతూరి పేరుతో పాపులరయ్యారు. కొండవలస లక్ష్మణరావు ఈ కోవకు చెందినవాడు. వంశీ చిత్రం ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’నుంచి పరిచయమైన కొండవలస ఆ చిత్రంలోని ‘అయితే ఓకే’ద్వారా పాపులర్ అయి పలు చిత్రాల్లో ముఖ్య హాస్యపాత్రలలో రాణించాడు. ఎవరిగోలవాడిదే, బెండు అప్పారావు, కబడ్డీ కబడ్డీ, ఒట్టేసి చెపుతున్నా లాంటి 300 చిత్రాల్లో నటించాడు.
హాస్య నటుల తర్వాత మృత్యువు రచయితల మీద దృష్టి సారించింది. ఇద్దరు ప్రముఖ రచయితలు ఒకేరోజున మృతి చెందటం విశేషం.
రచయిత, దర్శకుడు సత్యమూర్తి 14 డిసెంబర్‌న మృతి చెందాడు. రచయితగా సత్యమూర్తి ఖైదీనెంబర్ 786, పోలీస్ లాకప్, నారీ నారీ నడుమ మురారి, శ్రీనివాసకళ్యాణం లాంటి చిత్రాలతోపాటు చైతన్యం, దాదర్ ఎక్స్‌ప్రెస్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన కుమారుడే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్.
మరో సీనియర్ రచయిత శ్రీనివాస చక్రవర్తి కూడా 14 డిసెంబర్‌న మృతి చెందాడు. పట్నం వచ్చిన పతివ్రతలు, అన్నదమ్ముల సవాల్, గురుబ్రహ్మ, చుట్టాలబ్బాయి, పుణ్యదంపతులు లాంటి కొన్ని మచ్చుకకి చెప్పుకోవచ్చు.
తెలుగు నాటకరంగ ప్రయోక్త చాట్ల శ్రీరాములు 18 డిసెంబరున కన్నుమూసారు. ఎందరో నటులను, దర్శకులను తీర్చిదిద్దిన శ్రీరాములు పలు తెలుగు చిత్రాలలో నటించారు. ఈ ఏడాది చివరిలో టాలీవుడ్‌కు మరొక షాకింగ్ వార్త తగిలింది. అలనాటి హీరో నేటి క్యారెక్టర్ నటుడు కవి, దర్శకుడు రంగనాథ్ ఆత్మహత్యతో 19 డిసెంబరున కన్నుమూసాడు. చందన చిత్రం ద్వారా పరిచయమైన రంగనాథ్ అంచలంచెలుగా ఎదుగుతూ హీరోస్థాయికి ఎదిగాడు. పంతులమ్మ, జమీందారుగారి అమ్మాయి, అమెరికా అమ్మాయి, లవ్‌మేరేజ్‌లతోపాటు మరెన్నో చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విలన్‌గా కూడా నటించాడు.
రచయిత, నటుడు కాశీవిశ్వనాథ్ డిసెంబర్ 22న మృతి చెందాడు. కాశీవిశ్వనాథ్ సినిమా పరిశ్రమకు పరిచయం కాకముందు నాటక రచయితగా సుప్రసిద్ధుడు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717