రాష్ట్రీయం

రాజధానికి లంక భూములు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సేకరణకు త్వరలో నోటిఫికేషన్!
గుంటూరు, నవంబర్ 30: రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో నిర్మాణాల కోసం లంకభూములను సేకరించేందుకు సిఆర్‌డిఎ అధికారులు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో 2300 ఎకరాల లంకభూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తుళ్లూరు మండలం బోరుపాలెం, రాయపూడి, తాళ్లాయపాలెం, వెంకటపాలెం, లింగాయపాలెం, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గ్రామాల్లో లంకభూములు ఉన్నాయి. కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని లంకభూములను రాజధాని నిర్మాణాలకు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే రైతులను కోరింది. పట్ట్భాములు ఇచ్చిన రైతులు అసైన్డ్, లంకభూములనూ ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే సిఆర్‌డిఎ అధికారులు మాత్రం లంకభూములు తీసుకునే విషయంలో సర్వే తర్వాతనే నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు. అందుకు అనుగుణంగా లంక భూములపై సర్వే నిర్వహించారు. అసైన్డ్ భూములను కూడా గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టింది. వీటిని సాగుచేస్తున్న రైతులు ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే మెట్ట, జరీబు భూములకు ఇచ్చిన ప్యాకేజీని తమకూ వర్తింపజేయాలని లంకభూముల రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అందువల్లనే కొంత కాలయాపన జరిగినప్పటికీ ప్రభుత్వం సర్వే అనంతరం 2300 ఎకరాలు ఉన్నట్లు గుర్తించింది.